డా.పి.వి.జి .రాజు ఆధ్యాత్మిక పురస్కారం అందుకోవడం నా అదృష్టం : ట్రావన్ కోర్ మహారాణి, కవయిత్రి డా. గౌరీ లక్ష్మీ బాయి
విశాఖపట్నం - ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో మాన్సాస్ ట్రస్ట్ తో సంయుక్తంగా విశాఖపట్నం లో 25 నవంబర్ 2024 ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం లోని డా.వై.ఎస్.ఆర్.మూర్తి ఆడిటోరియం లో డా.పి.వి.జి .రాజు శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా ట్రావన్ కోర్ మహారాణి, కవయిత్రి , పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. అశ్వతి తిరుణల్ గౌరీ లక్ష్మీ బాయి గారికి "డా.పి.వి.జి రాజు ఆధ్యాత్మిక పురస్కారాన్ని" శ్రీ అశోక్ గజపతి రాజు, జస్టిస్ .డి.వి.ఎస్.ఎస్. సోమయాజులు. పరిషత్ అధ్యక్షులు డా. గజల్ శ్రీనివాస్ లు ప్రదానం చేశారు.
గొప్ప సామాజిక సేవా తత్పరులు, ఆధ్యాత్మిక వేత్త అయిన మహారాజా డా.పి.వి.జి.రాజు గారి ఆధ్యాత్మిక పురస్కారం అందుకోవడం నా పూర్వ జన్మ సుకృతమని పురస్కార గ్రహీత ట్రావెన్ కోర్ మహారాణి డా. అశ్వతి తిరుణల్ గౌరీ లక్ష్మీ బాయి అన్నారు. మా తండ్రి గారు పేరు మీద ఇస్తున్న పురస్కారాన్ని డా.గౌరీ లక్ష్మీ బాయి అందుకోవడం మాన్సాస్ కు ఎంతో గౌరవం అని శ్రీ అశోక్ గజపతి రాజు అన్నారు.
జస్టిస్ డి.వి.వి. సోమయాజులు మాట్లాడుతూ... డా.గౌరీ లక్మీ బాయి గారి ఆధ్యాత్మిక రచనలు ఎందరికో స్ఫూర్తి దాయకమని అన్నారు. డా.పి.వి.జి.రాజు గారికి "మరణాంతర పద్మ విభూషణ్ " తో భారత ప్రభుత్వం గౌరవించాలని పరిషత్ అధ్యక్షుడు డా.గజల్ శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో సెంచురియన్ విశ్వ విద్యాలయం కులపతి డా.జి.వి.ఎన్ .రాజు , మాన్సాస్ కార్యదర్శి శ్రీ లక్ష్మీపతి రాజు తదితరులు ఆత్మీయ అతిధులుగా పాల్గొన్నారు. తొలుత సభకు పరిషత్ కార్యదర్శి శ్రీ రెడ్డప్ప దవెజి స్వాగతం పలికారు. పరిషత్ సంచాలకులు శ్రీ పి.రామచంద్రరాజు వందన సమర్పణ చేశారు. శ్రీ పి.రామచంద్రరాజు 99494 93636