ఇండియన్ స్కూల్ అఫ్ బిజినెస్ ( ISB ) హైదరాబాద్ క్యాంపస్ సందర్శించిన డా. కందుల గౌతమ్ నాగి రెడ్డి
Indian School of Business : ఇండియన్ స్కూల్ అఫ్ బిజినెస్ ( ISB ) హైదరాబాద్ క్యాంపస్ సందర్శించిన డా. కందుల గౌతమ్ నాగి రెడ్డి ప్రొఫెసర్ డా. చందన్ చౌదరి గారితో కలిసి అక్కడి చర్చాకార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడి బోధనా పద్ధతులు, విద్యార్థులతో కలిసి అవగాహనా కార్యక్రమంలో పాల్గొని, దేశ విదేశాల్లో ఇండియన్ స్కూల్ అఫ్ బిజినెస్ విద్యార్థులు ప్రపంచ అగ్రగామి సంస్థల్లో డైరెక్టర్లుగా, సీఈఓ లుగా రాణిస్తున్నారని, ప్రపంచలో నే అత్యున్నతమైన అద్భుతమైన మానెజ్మెంట్ కాలేజి స్థాపనకు కృషి చేసిన శ్రీ నారా చంద్రబాబు గారి దార్శనికత ఇప్పుడు మన రాష్ట్రానికి అవసరం అని తెలియజేసారు.
260 ఎకరాల సువిశాల క్యాంపస్ నందు ప్రొఫెసర్ డా. చందన్ చౌదరి గారితో ఉన్న సాన్నిహిత్యంతో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ స్కూల్ అఫ్ బిజినెస్ నందు ఇంటరాక్టివ్ కర్తక్రమాల్లో పాల్గొన్నారు. డా. చందన్ చౌదరి గారు ప్రొఫెసర్ అఫ్ ఆపరేషన్స్ మానేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (ప్రాక్టీస్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముంజల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్, పుంజ్ లోయ్డ్ ఇన్స్టిట్యూట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానేజ్మెంట్. ప్రొఫెసర్ చందన్ చౌదరి గారు ఐఐఎం ముంబై సంస్థలో డీన్ గా, రీసెర్చ్ చైర్మన్ గా పని చేసిన అనుభవం కలిగిన నిపుణులు గతంలో పలు విదేశీ సంస్థల్లో సీఈఓ గా , మేనేజింగ్ డైరెక్టర్ గా పని చేసిన అనుభవం కలదు.
త్వరలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్రబాబు గారిని కలిసి ఇండియన్ స్కూల్ అఫ్ బిజినెస్ (ISB ) లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థను నెలకొల్పేలా తనవంతు సహాయ సహకారాలు అందజేస్తానని తెలిపారు. చంద్రబాబుగారి పాలనలో ఆంధ్రరాష్ట్రo పురోగమిస్తుందని, చంద్రబాబు గారి దార్శనికత, ముందు చూపు వల్ల హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందిందని, ఆంధ్రరాష్ట్రము భవిష్యత్తులో అన్ని రంగాల్లో ముందుండాలని, దేశంలోనే అగ్రగామి రాష్టముగా వెలుగొందాలని, దానికి కావలసిన అన్ని సహజ వనరులు, మానవ సంపద, తెలివితేటలూ ఉన్న యువత రాష్ట్రంలో ఉందని, అన్నిటికి మించి సరియైన నాయకత్వం, పటిష్టమైన ప్రణాళిక NDA కూటమి అండ మనకు వరమని ప్రొఫెసర్ చందన్ చౌదరి గారు తెలియజేసారు.