కశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్రజాకార్, చావా చిత్రాల కోవలో రాబోతున్న తర్వాతి చారిత్రక చిత్రమేంటి ? దర్శక రచయిత నిర్మాతలెవరు ? ఆ వివరాలేంటి ??
Prapancha Charitra : అలగ్జాండర్ ద గ్రేట్ అంటారు కానీ అల్లూరి ద గ్రేట్ అని ఎందుకనరు ? ఇదీ ఇటీవల జరిగిన దగ్గుబాటి ప్రపంచ చరిత్ర అనే పుస్తకావిష్కరణ సభలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేసిన కామెంట్ అంటే ఇన్నాళ్ల పాటు వాళ్లు చెప్పుకున్న చరిత్ర మాత్రమే చరిత్రగా మిగిలిందిది.. దానికి తోడు ఆయన మరో మాట కూడా అన్నారు.. మన చరిత్ర మన వాస్తవిక సంఘటనల సమాహారాలను ఇటు పుస్తకాల రూపంలో మాత్రమే కాదు.. అటు తెరపై కూడా ఆవిష్కరించాలని అంటారు. ఇంకా గట్టిగా మాట్లాడితే.. వెంకయ్య పదే పదే చేసే మరో కామెంట్.. మంచి సందేశాత్మక చిత్రాలు తీయండయ్యా! అని.. చాలా మందికి వచ్చే అనుమానం.. తీస్తే ఈ ప్రేక్షకులు చూస్తారా ఏంటి ? ఎన్ని మంచి సినిమాలను ఫ్లాప్ కొట్టించలేదా ఈ ప్రేక్షక లోకం??? అన్నది సందేశాత్మక సినిమాలను తీసే వారి నుంచి వినిపించే కామెంట్.
అంతే కాదు.. అర్జున్ రెడ్డి వంటి బూతు సినిమాలు తీస్తేనే నాలుగు పైసలు వచ్చేదంటూ.. అందరూ ఆ దారిలోనే పయనిస్తుండటం మనం లైలా వంటి సినిమాల ద్వారా చూసే ఉంటాం.. ఆపై దాన్ని ప్రేక్షక జనులు అట్టర్ ఫ్లాప్ కొట్టించడం వెనక కొంత మేర రాజకీయ కారణాలున్నా.. మొత్తానికైతే.. అందులోని ఓవర్ అడల్ట్రీ డైలాగ్ వర్షన్ కుటుంబ కుటుంబ ప్రేక్షకులను దూరం చేసిన మాట కఠిన వాస్తవం.. మరి ఎలాంటి సినిమాలు తీయాలి? ఇప్పుడందర్నీ వేధిస్తున్న ప్రశ్న ఇదే.. ఒక కశ్మీర్ ఫైల్స్, ఒక కేరళ ఫైల్స్, ఒక రజాకార్, ఒక చావా.. త్వరలో తెరకెక్క పోతున్న.. లక్ష్మీ గాడ్సే లవ్ స్టోరీ.. వంటి కొన్ని చిత్రాల వంటివి రావాలి… కశ్మీర్ ఫైల్స్.. కాశ్మీర్ లోని పండిట్స్ ని.. అక్కడి ముస్లిములు ఎంత భయంకరంగా వారిని చిత్ర వథ చేసి మరీ ఎలా తరిమేశారో ఈ ప్రపంచానికి చాటి చెబితే.. కురిసిన కలెక్షన్ల వర్షం సుమారు 350 కోట్లు..
అర్జున్ రెడ్డి వంటి చిత్రాలు మాత్రమే కాదు.. ఇలాంటి వాస్తవికత ఆధారంగా చేసుకుని నిర్మించే చిత్రాలు కూడా కనక వర్షం కురిపించగలవని నిరూపించిందీ చిత్రం.. ఇక కేరళ ఫైల్స్ ఎంత పెద్ద పెను దుమారమంటే.. లవ్ జిహాద్ ఎంత తెలివిగా వారు చేస్తారో చాటి చెప్పే చిత్రం.. ఇస్లామిక్ ఉగ్రవాదం మన మహిళలపై ఎలాంటి దారుణమైన వల వేసి.. వారికి అనువుగా వాడేసుకుని.. మనకు ద్రోహం చేస్తుందో చెబుతుందీ చిత్ర రాజం.. ఇక రజాకార్ ఫైల్స్.. ఈ సినిమా ఆడాల్సిన స్థాయిలో ఆడకున్నా.. చూసిన ప్రతి ఒక్కరూ.. ఆనాటి రజకార్ల కారణంగా మన వాళ్లు పడిన అరగోసకు అద్దం పట్టింది.. ఇదీ ఒక మంచి చిత్రమంటే..
ఇక చావా సంగతి చెప్పనక్కర్లేదు.. మొన్నటి వరకూ పెద్ద పెద్ద ఖాన్లు ఇటు దేశాన్ని తిడుతూనే అటు.. కోట్ల వర్షం కురిపించుకోవాలన్న కక్కుర్తి కొద్దీ చేసిన ఫేబ్రికేటడ్ స్టోరీస్ కారణంగా.. వరుస ఫ్లాపులను ఎదుర్కుంటున్న బాలీవుడ్.. ఇవాళ చావా చావ చూపించడంతో.. తిరిగి ఊపిరిలూదుకుంది.. ఇక్కడి వాళ్లకు కూడా భారీ కలెక్షన్లను వసూళ్లు సాగించగల సామర్ధ్యముందని నిరూపించింది. ఇప్పుడీ చిత్రం 500 కోట్ల క్లబ్ దిశగా అడుగులు వేస్తోంది.
బాహుబలి, కేజీఎఫ్, సలార్ ఇటీవలి పుష్ప వంటి సౌత్ చిత్రాలు పార్టులు పార్టులుగా విడుదలై.. పాన్ ఇండియా లెవల్లో కురిపించిన కలెక్షన్ల సునామీ తప్ప.. ఖాన్ త్రయం ఎరా ఎండయ్యి.. బాలీవుడ్డే ఎండిపోయిందా??? అన్న సమయాన.. విడుదలైన చావా.. తన సత్తా చాటి.. బాలీవుడ్ కి పూర్వ వైభవం తెస్తే.. గతంలో ఎన్నడూ లేనంతగా ఒక బాలీవుడ్ సినిమా ఒక మానియా- ఒక పానిక్- ఒక ప్రభంజనం సృష్టిస్తూ. భారతీయుడన్నవాడు తప్పక చూడాల్సిన చారత్రక చిత్ర రాజంగా పేరు సాధించడం మాత్రమే కాదు.. థియేటర్ నుంచి బయటకు వచ్చేవాళ్లు రాలేక.. అక్కడే నిలబడి చేస్తున్న నినాదాల హోరు ఇప్పుడు ప్రతి గుండె గుండెకూ చేరి.. భారతీయతను తిరిగి ఊపిరిలా ఊదుతుంటే. ఒక్కో ఖాన్ కి ఏం చేయాలో పాలు పోవడం లేదు. తమకీ దేశం ఎంత మాత్రం సురక్షితం కాదంటూ.. తెరలోపట\ బయట విషాన్ని నూరి పోస్తూ.. తమ వారసుల చేత కూడా ఇక్కడి ఆచార వ్యవహారాలను తప్పు పట్టేలా మహారాజ్ వంటి సినిమాలతో వక్రభాష్యాలు చెబుతూ.. చేస్తోన్న తెర చారిత్రక విధ్వంసానికి ఇక నూకలు చెల్లు.
మన సినిమాలు యాజ్ టీజ్ గా తీయగలిగినా కూడా.. మనం అద్భుతమైన విజయాలను సాధించగలం.. ఎన్ని సార్లు కన్నా విన్నా రామాయణ మహాభారతాలు తనివి తీరవన్నట్టు.. మన చిత్రాలను మళ్లీ మళ్లీ తీయగలిగితే.. వాటి ఇంపాక్ట్. వాటి తాలూకూ భావావేశం… తిరిగి ప్రేక్షకుల్లోకి చేరవేయగలగడమే కావల్సింది. అలా చేయగలిగితే ఆటోమేటిగ్గా.. మన చిత్రాలు కూడా వసూళ్ల సునామీ సృష్టించగలవని తెలుస్తోంది.
ఇన్నాళ్లూ చదువుకున్న చరిత్ర వేరు- ఇకపై మనం చూడాల్సిన చిత్ర చరిత్ర వేరు. ఇప్పటి వరకూ మనకు తెలిసింది గాంధీ గొప్ప గాడ్సే తక్కువ అన్నట్టుగానే కన్నాం విన్నాం.. అదే వచ్చే రోజుల్లో రానున్న గాడ్సే స్టోరీ చూస్తే.. ఎక్కడ గాంధీ విగ్రహాలు కనిపించినా.. ఉక్రోషం తన్నుకొచ్చే స్థాయిలో గాడ్సే నిజ జీవిత చరిత్ర తెరకెక్కబోతోంది. (ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే విడుదల కానుంది.. కూడా.
మనం బేసిగ్గా ఈ తెర విచిత్రాన్ని మొదలు పెట్టిందే హరిశ్చంద్ర వంటి చిత్రాలతో.. అవి మన భారతీయ ఇతిహాసాల ద్వారా సేకరించిన కథల సమాహారాలు. ఆ తర్వాత కూడా మన వాళ్లు రామాయణ, మహాభారత, భాగవత గాథలను తెరకెక్కించి అద్భుత విజయాలను సాధించడం మాత్రమే కాదు.. ఒకానొక స్వర్ణ యుగాన్ని సృష్టించారు. మన అల్లూరి సీతారామ రాజు వంటి చిత్రాలు ఆరోజుల్లో ఒక తెర సంచలనాలు. అదే ఉత్సాహ ప్రోత్సాహాలతో కొంగొత్త ప్రయోగాసక్తత కొద్దీ.. గాడ్సే చిత్ర కథను తిరిగి తెరకెక్కించ బోతున్నట్టు సమాచారం. గత కాశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్, రజాకార్, చావా వంటి చిత్రాల సరసన ఈ చిత్రం కూడా తెర సంచలనం కావాలని కోరుకుంటూ.. సెలవు.
సు సినీ జనా సుఖినోభవంతు.. ఓం శాంతి శాంతి శాంతి…! ప్రత్యేక కధనం ఆది - సీనియర్ జర్నలిస్ట్