For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

COVID NEWS: 💉టీకా తీసుకున్న 95% మందికి వైరస్‌ సోకలేదు: డాక్టర్‌ ప్రతాప్‌ సి.రెడ్డి, వ్యవస్థాపక ఛైర్మన్‌, అపోలో హాస్పిటల్స్

02:59 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 02:59 PM May 11, 2024 IST
covid news  💉టీకా తీసుకున్న 95  మందికి వైరస్‌ సోకలేదు  డాక్టర్‌ ప్రతాప్‌ సి రెడ్డి  వ్యవస్థాపక ఛైర్మన్‌  అపోలో హాస్పిటల్స్
Advertisement

Dr. C. Pratap Reddy, Apollo Group of Hospitals, Covaxin, Covishield, Covid News, Health News, Covid Health Tips, Telugu World Now,

COVID NEWS: 💉టీకా తీసుకున్న 95% మందికి వైరస్‌ సోకలేదు: డాక్టర్‌ ప్రతాప్‌ సి.రెడ్డి, వ్యవస్థాపక ఛైర్మన్‌, అపోలో హాస్పిటల్స్

Advertisement GKSC

🔷కేవలం 4.28 శాతం మందిలో స్వల్ప ఇన్‌ఫెక్షన్‌, 🔶హెల్త్‌ కేర్‌ సిబ్బందిపై అపోలో తాజా అధ్యయనం, 🔷అయినా జాగ్రత్తలు తప్పనిసరి....

* వ్యాక్సిన్లతో కరోనాకు పూర్తిగా అడ్డుకట్ట వేయవచ్చని అపోలో గ్రూపు ఆసుపత్రుల తాజా అధ్యయనంలో తేలింది. దేశవ్యాప్తంగా 24 నగరాల్లోని 43 అపోలో ఆసుపత్రుల్లో దాదాపు 31,621 మంది హెల్త్‌ కేర్‌ సిబ్బందిపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం రుజువైంది. ఈ వివరాలను అపోలో ఆసుపత్రి గ్రూపు బుధవారం మీడియాకు విడుదల చేసింది. కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ మొదటి లేదా రెండు డోసులు తీసుకున్న 95 శాతం సిబ్బందికి ఎలాంటి వైరస్‌ సోకలేదని అందులో తేలింది. కేవలం 4.28 శాతం మంది మాత్రం స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో ఆసుపత్రిలో చేరారని, ఇందులో కేవలం ముగ్గురికి మాత్రమే ఐసీయూ అవసరమైందని, వారంతా కోలుకున్నారని పేర్కొన్నారు. రెండోదశ కరోనా ఉద్ధృతిగా ఉన్న సమయంలో ఈ అధ్యయనం జరిగింది.

💥 అధ్యయనం పూర్తి వివరాలు

👉 మొత్తం అధ్యయనం జరిగిన నగరాలు- 24

👉సమయం- ఈ ఏడాది జనవరి 16 నుంచి మే 30 వరకు*

👉వ్యాక్సిన్‌ తీసుకున్న మొత్తం హెల్త్‌ కేర్‌ సిబ్బంది- 31,621*

👉కొవిషీల్డ్‌ టీకా తీసుకున్నవారు- 28,918 (91.45 శాతం)*

👉 కొవాగ్జిన్‌ టీకా తీసుకున్నవారు- 2703 (8.55 శాతం)

👉 రెండు డోసులు పూర్తయిన వారు- 25,907 (81.9 శాతం)

👉మొదటి డోసు పూర్తి చేసిన వారు- 5,714 (18.1 శాతం)*

👉 రెండు డోసుల తర్వాత కరోనా సోకిన వారు- 1061 (4.09 శాతం)

👉 మొదటి డోసు అనంతరం కరోనా బారిన పడిన వారు- 294 (5.14 శాతం)

👉 రెండు డోసుల తర్వాత కరోనా సోకని వారు- 30,266 (95.8 శాతం)

👉 ఆసుపత్రిలో చికిత్స అవసరమైన వారు- 90 (0.28)

👉ఇందులో మహిళలు- 42, పురుషులు-48*

👉 కరోనా సోకిన వారిలో 83 మంది 50 ఏళ్లలోపు వారే

👉ఐసీయూలో చికిత్స పొందినవారు- ముగ్గురు (0.009 శాతం)*

👉 మరణాలు- 0

👉 కొవిషీల్డ్‌ టీకా తర్వాత కరోనా బారిన పడినవారు- 4.32 శాతం

👉 కొవాగ్జిన్‌ తీసుకున్న వారిలో కరోనా సోకినవారు- 3.85 శాతం

👉 వైరస్‌ సోకిన వారిలో 30 ఏళ్లలోపు వారు- 43.6 శాతం

👉 31-40 లోపు వయసున్న హెల్త్‌ కేర్‌ సిబ్బంది- 35.42 శాతం

💥రోజుకు 50 లక్షల మందికి టీకా ఇవ్వాలి

డాక్టర్‌ ప్రతాప్‌ సి.రెడ్డి, వ్యవస్థాపక ఛైర్మన్‌, అపోలో ఆసుపత్రుల గ్రూపు

వ్యాక్సిన్లు తొలుత హెల్త్‌ కేర్‌ సిబ్బందికే అందించడం ద్వారా వారు ఎంతోమంది రోగులకు పూర్తిస్థాయిలో సేవలు అందించారు. టీకాలతో పూర్తి రక్షణ ఉంటుందని తేలింది. సామూహిక టీకా కార్యక్రమం ద్వారా కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయవచ్చు. మూడో దశ రాకుండా అడ్డుకోవచ్చు. దేశవ్యాప్తంగా రోజుకు 50 లక్షల మందికి టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ రానున్న రోజుల్లో పూర్తిస్థాయిలో టీకాలు అందుబాటులోకి రానున్నాయి. టీకా తీసుకున్నప్పటికీ ధీమా పనికి రాదు. మహమ్మారి పూర్తిస్థాయిలో నియంత్రణలోకి వచ్చే వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్‌, చేతుల శుభ్రత, భౌతిక దూరం చాలా అవసరం.

Advertisement
Author Image