For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

ఆత్మ‌గౌర‌వం అంటే ఈ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి తెలుసా? : Journalist Audi

11:59 PM Mar 15, 2022 IST | Sowmya
Updated At - 11:59 PM Mar 15, 2022 IST
ఆత్మ‌గౌర‌వం అంటే ఈ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి తెలుసా    journalist audi
Advertisement

ఆత్మ‌గౌర‌వం ఈజీక్వ‌ల్టూ ఆత్మ‌విశ్వాసం, సొంతంగా త‌న కాళ్ల మీద నిల‌బ‌డ్డాన్నే ఆత్మ‌విశ్వాసం అంటారు, ఎవ‌రో రావాలి ఏదో చేయాలి అనేది కూడా ఒక గొప్పేనా? ఇంకా బీజేపీ నుంచి రూట్ మ్యాప్ రావాలి అన‌డం, ఎంత బేల‌త‌నం? ఎంత చేత‌గాని త‌నం?? ఏం నిరూపించాల‌ను కుంటున్నాడీ  ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, త‌న సినిమాల్లోని ఒక్కటంటే ఒక్క హీరో కేరెక్ట‌ర్ లోని, స్వాభిమానం కూడా ఇత‌డికి త‌ల‌కు గానీ ఎక్క‌లేదా?,
క‌నీసం తాను ఎప్పుడూ రీమేక్ చేస్కునే ఆ మ‌ల‌యాళ‌- క‌థానాయ‌క పాత్ర‌ల్లోని ప‌రువైనా తెర‌బ‌య‌ట ప్ర‌ద‌ర్శించ‌లేడా? అయినా బీజేపీ రూట్ మ్యాప్ కోసం ఎదురు చూడ్డ‌మేంటి? చంద్ర‌బాబుకు, కేటీఆర్ కూ న‌-మ‌స్కా-ర బాణాలేంటి? ఈ డొల్ల‌త‌న‌మేంటి? ఈ డీలా ప‌డ్డ‌మేంటి?
వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు న‌మ‌స్కారాలు చెప్ప‌డ‌మేంటి? అందుకు నాగ‌బాబు ముసి ముసి న‌వ్వులేంటి? అస‌లా రాసిచ్చిన స్క్రిప్ట్ చ‌ద‌వ‌డం కూడా గొప్ప‌గా ఫీల‌వ్వ‌డ‌మేంటి? ఏంటి సార్ ప‌వ‌నాల్ సార్.. ఏంటి సార్ ఇదంతా..

మీరు మీ సొంత శ‌క్తి సామ‌ర్ధ్యాల‌తో బీజేపీకే రూట్ మ్యాప్ ఇవ్వాలి కానీ వాళ్లెవ‌ళ్లో మీకు దారి చూపించ‌డ‌మేంటండీ సిల్లీగా... ఇప్ప‌టికే కాపులంతా క‌ల‌సి స‌మావేశ‌మై ఇంకా మ‌నం డిప్యూటీ సీఎంల‌కే ప‌రిమిత‌మా? సొంతంగా ముఖ్య‌మంత్రుల‌య్యేదెప్పుడు? అని మేధోమ‌థ‌నాలు చేసి సొంత కాళ్ల‌పై నిల‌బ‌డాల‌ని సూచిస్తుంటే మీరేంటండీ.. ఇంకా గోబ్రాహ్మ‌ణుకు మొక్కుతారు, క‌మ్మ, రెడ్ల‌కు స‌లాములు గులాములంటారు
ఏంటండీ ప‌వ‌నాలుగారూ ఏంటిదీ??? ఈ మ‌ధ్య నేను సైతం జ‌న సేన‌కు జై కొట్టాల‌ని ఎంద‌రో అనుకుంటుంటే మీరేంటండీ..ఇలాగున్నారూ???
దేశంలో ఉన్న పార్టీల‌న్నీ నా పార్టీలే అన్న సిగ్న‌ళ్ల‌నిస్తున్నారు, సైకిల్ మీదే, క‌మ‌లం పువ్వు మీదే అన్ని గుర్తులూ మీవే అంటారేంటండీ బాబూ
ఇంకా న‌యం జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డికీ దండాలెట్ట‌లేదు.. బ‌తికిపోయాం!!! మొన్న సొంతంగా నిల‌బ‌డి మీరు ఒక్క సీటు సాధించిన‌పుడు స్వ‌యంగా మీరే ఓడిన‌పుడు సినిమాలో హీరో మొద‌ట ఇలాగే ఓడిపోతాడు సివ‌రాక‌ర్లో గెలిసేది మా ప‌వ‌ర్ స్టారుడే అని మాకు మేం స‌ర్ది చెప్పుకున్నాం..
జ‌నానికి రూపాయ ఇవ్వ‌కుండా ఆ మాత్ర‌మైనా ఓట్లు వేయించుకున్నార‌ని గాంధేయ వాదాన్ని ఇంకా మోస్తున్న‌ అస‌లు సిస‌లు నిజాయితీ ప‌రుల‌నుకున్నాం (ఇంగ్లీష్ ప‌త్రిక‌ల్లో ఇలాగే రాస్తే అదే నిజ‌మ‌నుకున్నాం) ఇదేంటండీ మీరు ఇలా- ఆల్ షోస్ హౌస్ ఫుల్- ఫార్ములా అప్లై చేస్తున్నారు???

Advertisement GKSC

Does this pavan kalyan know what self-respect means,Janasena Party Emergence Meeting,telugu golden tv,my mix entertainments,www.teluguworldnow.comసినిమాల్లో ఎన్నేసి న‌వ‌ర‌సాలు పండించాలో అన్నేసి మీ రాజ‌కీయ సినేమాలో పండించేందుకు సిద్ధ ప‌డిపొతున్నారు!!! ఇది రాజ‌కీయ‌మండీ బాబూ.. మీ ఫ్యామిలీ హీరోలు చేసే త‌మిళ‌, మ‌ల‌యాళ రీమేక్ సినేమా కానే కాదు..ఇక్క‌డ మీ నుంచి కూసింత నిజాయితీ ఆశిస్తున్నాం. బ‌య‌ట లేనిదే అది- మీ నుంచి కోరుతున్న‌దే ఇదీ మీ ద‌గ్గ‌ర ఏదైతే ఉంద‌నుకున్నామో అదే లేకుంటే ఇక మిమ్మ‌ల్ని అభిమానించ‌డంలో అర్ధ‌మే ముందండీ.. మ‌రీ ఇంత బ‌హిరంగ‌ వేలం పాడేశారేటండీ బాబూ!!! కొంప‌దీసి మీరుగానీ ప్యాకేజీ స్టారా ఏంటి ప‌వ‌నాల్ సార్??? ఇంతోటి దానికి దామోద‌రం సంజీవ‌య్య స్ఫూర్తి అంటూ ప‌రువు త‌క్కువ పోలిక‌లొక‌టీ...!!! అద‌స‌లు ఆవిర్భావ స‌భ కాదు. ఉన్న ఆశ‌లు ఆవిరై పోయిన స‌భ‌.. Author: Journalist (Audi)

Advertisement
Author Image