For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

మునుగోడు ప్రజలు ఏమనుకుంటున్నరో తెలుసా ? పలు సర్వే సంస్థల అభిప్రాయం

03:50 PM May 11, 2024 IST | Sowmya
UpdateAt: 03:50 PM May 11, 2024 IST
మునుగోడు ప్రజలు ఏమనుకుంటున్నరో తెలుసా   పలు సర్వే సంస్థల అభిప్రాయం
Advertisement

మునుగోడు ఉప ఎన్నిక విషయంలో అక్కడి ప్రజలు ఈ క్రింది అంశాల గురించే ఆలోచిస్తున్నట్లు పలు సర్వే సంస్థల వెల్లడి

కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి బీజేపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచినంత మాత్రాన మునుగోడుకు కలిగే ప్రయోజనం ఏమిటి ? ఏం జరిగినా వంద శాతం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ టి ఆర్ ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని ప్రజలందరికీ తెలుసు. ఈ పరిస్థితుల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే మునుగోడుకు ఏం లాభం ? కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి కోటీశ్వరుడై ఉండి కూడా తనను గెలిపించిన మునుగోడు ప్రజలను అస్సలు పట్టించుకోలేదు. గెలిచిన కాన్నుండి నియోజకవర్గం దిక్కు చూడలేదు. ఇప్పుడు తన కాంట్రాక్టుల కోసం బీజేపీలో చేరితే మునుగోడు ప్రజలు ఎందుకు ఆదరించాలి ?

Advertisement

తెలంగాణ వచ్చినంక , కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినంక మునుగోడు ప్రజల ఫ్లోరైడ్ కష్టాలను దృష్టిలో పెట్టుకుని మొత్తం రాష్ట్రానికే మంచి నీళ్లు ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు. ఈ ఉప ఎన్నికలో టి ఆర్ ఎస్ కాకుండా ఇంకో పార్టీకి ఓటేసి మనకు మంచి నీళ్లు ఇచ్చిన కేసీఆర్ గారికి అన్యాయం చేయడం న్యాయమేనా ? 2014 కు ముందు మునుగోడు నియోజకవర్గంలో ఒక ఎకరం భూమి విలువ 2-3 లక్షలు కూడా లేదు . ఈ రోజు శివన్నగూడెం లాంటి పెద్ద రిజర్వాయర్ లను నిర్మిస్తున్నందువల్ల ఎకరం భూమి 20 నుండి 50 లక్షల వరకు పలుకుతున్నది నిజం కాదా ?

మునుగోడు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ టి ఆర్ ఎస్ ప్రభుత్వం , ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వల్ల రైతు బంధు , వృద్దులకు పింఛన్లు , కల్యాణ లక్ష్మి , కేసీఆర్ కిట్ , రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు , రైతు బీమా వంటి ఎన్నో పథకాలు అందుతున్నది నిజం కాదా ? ఇప్పుడు బీజేపీ , కాంగ్రెస్ లాంటి పార్టీలకు ఓటేస్తే మన కన్ను మనం పొడుచుకున్నట్లు కాదా ? ఇప్పుడు ఉప ఎన్నికలో , వచ్చే అసెంబ్లీ ఎన్నికలోనూ టి.ఆర్.ఎస్ పార్టీనే గెలిపిస్తే నియోజకవర్గానికి ఇంకా ఎక్కువ మంచి జరుగుతుందని ఎక్కువ మంది ప్రజలు తమ దగ్గరికి వచ్చే టీవీ ఛానళ్ల వారికి , సర్వే సంస్థల ప్రతినిధులకు చెబుతున్నట్లు తెలుస్తున్నది.

ఇక టి ఆర్ ఎస్ అభ్యర్థి విషయానికి వస్తే నియోజకవర్గంలో ప్రజల అభీష్టం మేరకు వివిధ సర్వే రిపోర్టుల ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయిస్తారని ప్రజలు అభిప్రాయపడుతున్నరు. ఎట్టి పరిస్థితుల్లోనూ టి ఆర్ ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీతో విజయం సాధించే అవకాశాలే ఉన్నాయని సర్వే సంస్థలు స్పష్టం చేస్తున్నాయి.

ఇక్కడి టి ఆర్ ఎస్ టికెట్ ఆశించే నాయకులు ఎక్కువ మంది ఉన్నప్పటికీ ఎన్నికల్లో టి ఆర్ ఎస్ అభ్యర్థిని మంచి మెజార్టీతో గెలిపించుకునే విషయంలో కష్టపడే ఇతర నాయకులకు ఎమ్మెల్సీ , కార్పొరేషన్ , ఇతర పదవులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఖచ్చితంగా ఇచ్చి నాగార్జునసాగర్ తరహాలో నిర్ణయం తీసుకుంటారని తెలుస్తున్నది . సాగర్ లో ఎమ్మెల్యే భగత్ గెలుపునకు కృషి చేసిన ఎం సి కోటిరెడ్డి కి ఎమ్మెల్సీ , రామచంద్ర నాయక్ కు గిరిజన సహకార ఆర్ధిక సంస్థ చైర్మన్ పదవి ఇచ్చి గౌరవించింది. అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగే ఎన్నికలు కాబట్టి టి ఆర్ ఎస్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటే మునుగోడు నాయకులకు , స్థానిక ప్రజాప్రతినిధులకు , ప్రజలకు ఇంకా ఎక్కువ మంచి జరిగే అవకాశం ఉందని మునుగోడు ప్రజల శ్రేయస్సును కాంక్షించే రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నరు. ఇతర పార్టీల వాళ్ళు ఎన్ని రకాలుగా మభ్యపెట్టినా టి ఆర్ ఎస్ ను మంచి మెజార్టీతో గెలిపించుకుంటే అది మునుగోడు ప్రజలకు చాలా మేలు చేస్తుందని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఒకరు పేర్కొనడం గమనార్హం.

Advertisement
Tags :
Author Image