For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

DJ Tillu Movie Review: డీజే టిల్లు ఎలా ఉందంటే... ?

03:33 PM Mar 05, 2022 IST | Sowmya
Updated At - 03:33 PM Mar 05, 2022 IST
dj tillu movie review  డీజే టిల్లు ఎలా ఉందంటే
Advertisement
అరె బాబూ ... ఈ డీజే టిల్లు ఏంట్రా బాబూ, ఖిలాడికే ఖిలాడీకి ఎలా నిలిచిందిరా బాబూ, ఎలా సాధ్య‌మైంది, ఎలాంటి ఎక్స్ పెక్టేష‌న్స్ లేకుండా కేవ‌లం ఒక సాంగ్ తో మొత్తం సినిమాని జ‌నానికి క్రేజీగా ద‌గ్గ‌ర చేసేసింది, ఎలా వ‌ర్క‌వుట్ అయ్యింది అన్న‌ది ఒక సారి ప‌రిశీల‌న చేస్తే
ఇది కూడా పుష్ప‌లాగా ఒక కేరెక్ట‌రైజేష‌న‌ల్ వండ‌ర్, క‌థ కాక‌ర‌కాయ బెండ‌కాయ వండ‌కాయ‌ ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే సిద్దూ వేసిన‌ టిల్లు అలియాస్ బాల గంగాధ‌ర తిలక్ కేరెక్ట‌ర్ లో టిల్లూ గాడు డీజే కొట్టిందే లేదు. ఒక్క పాట‌ దానిక‌న్నా ముందు ఒక ఫంక్ష‌న్ లో చిన్న ఎస్టాబ్లిష్ మెంట్ త‌ప్ప‌.. ఎక్క‌డా టిల్లు డీజేగా క‌నిపించ లేదు, కాకుంటే సినిమా లో అత‌డి మ్యూజిక్ బ్యాగ్రౌండ్ ద్వారా హీరోయిన్ క‌నెక్ట్ కావ‌డం
ఆమె వేసిన స్కెచ్ ని ఆమెకు ప‌రిచ‌య‌మైన మ్యూజిక్ డైరెక్ట‌ర్ ద్వారానే చేధించ‌డం వీటికి అత‌డి డీజే బ్యాగ్రౌండ్ ప‌నికొచ్చిందే త‌ప్ప‌
ఇందులో మ్యూజిక్ ఓరియెంటేష‌న్ ఎక్క‌డా లేదు..
ఇద‌లా ఉంచితే... ఈ సినిమాకు ప్ల‌స్ పాయింట్లు డైలాగ్స్.. స్లాంగ్.. సిద్ధూ బేసిగ‌గా ఆంధ్ర‌నా తెలంగాణ‌నా తెలీదు కానీ.. తెలంగాణ స్లాంగ్ యాజ్ ఇటీజ్ దింపేశాడు.. చింపేశాడు. ఇక్క‌డే డైరెక్ట‌ర్ ఓ వండ‌ర్ క్రియేట్ చేశాడు. అదేంటంటే.. స‌ర్ కాస్టిక్ డైలాగ్ డెలివ‌రీ. ఆ స‌ర్కాస్టిజంలోనే
సిద్దూ ప్రేక్ష‌క జ‌నాన్ని అంత సీరియ‌స్ క్రైమ్ డ్రామాలో కూడా ముసి ముసి న‌వ్వులు న‌వ్వేలా చేశాడు.. చాలా మంది జాతిర‌త్నాలుతో ఈ సినిమాను పోల్చారంటే కార‌ణ‌మిదే.. ఇక్క‌డే సిద్దూ త‌న డైరెక్ట‌ర్ ని గెలిపించేశాడు.. అందుకే త‌క్కువ బ‌డ్జెట్ లో తీసిన ఈ సినిమా
ఎక్కువ డ‌బ్బులు రాబ‌ట్టింది. టైటిల్ సాంగ్ జ‌నాన్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌గా.. తెర మీద ద‌ర్శ‌కుడు అనుకున్న‌ది అనుకున్న‌ట్టు కాగ‌ల కార్యం పూర్తి చేశాడ‌ని చెప్పాలి.. ఎప్పుడైతే వ‌చ్చిన జ‌నాన్ని వ‌చ్చిన‌ట్టు డైరెక్ట‌ర్ ఎంగేజ్ చేయ‌గ‌లిగాడో అక్క‌డే అత‌డికి ఫ‌స్ట్ హిట్ న‌మోదైంది.. ఈ మొత్తం మూవీ మూమెంట్ లో సిద్ధూ ఒంటి చేత్తో న‌డిపించాడు.. ఇత‌డికిది టైల‌ర్ మేడ్ కేరెక్ట‌ర్. దానికి యాజ్ ఇటీజ్ న్యాయం చేశాడు
జూనియ‌ర్ విజ‌య్ దేవ‌రకొండ‌లాగా ఎదిగే క్ర‌మంలో తొలి అడుగైతే వేసేశాడు. ఆ ఎస్టాబ్లిష్ మెంట్ దొరికేసింది.. ఇక‌పై వ‌చ్చే ప్రాజెక్టుల‌ను ఎంపిక చేసుకోడాన్నిబ‌ట్టీ ఉంటుంది.. అత‌డి కెరీర్ ముందుకు వెళ్లేదీ లేనిదీ.. మ‌రి చూడాలి..
dj tillu movie Review in telugu,Siddu Jonnalagadda,Neha Shetty,Prince Cecil,latest telugu movie reviews,telugu golden tv,my mix entertainaments, www.teluguworldnow.com,Director Vimal Krishna.1సిద్ధూ కెరీర్ ఎలా సాగుతుందో.. ఇదే సినిమాలో మ‌రో ప్ల‌స్ పాయింట్, టిల్లు ఫాద‌ర్ అండ్ మ‌ద‌ర్, వీళ్లే లేకుంటే సినిమాకు ఫ్యామిలీ లుక్ వ‌చ్చేది కాదు.. ఒక క్రైమ్ బ్యాగ్రౌండ్ మూవీకి ఫ్యామిలీ ఫ్లేవ‌ర్ అందించిది ఈ రెండు పాత్ర‌లే..హీరోకి కావ‌ల్సింది ద‌ర్శ‌కుడు0 ద‌ర్శ‌కుడికి కావ‌ల్సింది హీరో, ప‌ర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిన‌ సినిమాగా డీజే టిల్లును చెప్పుకోవ‌చ్చు.. ఆల్ ద బెస్ట్ ఫ‌ర్ నెక్స్ట్ మూవీ టీం టిల్లూ!
Author: Jounalist Audi
Advertisement
Author Image