For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Prathinidhi 2 : స్టార్ డైరెక్టర్ సుకుమార్ లాంచ్ చేసిన 'ప్రతినిధి 2' గ్రిప్పింగ్ ట్రైలర్‌

10:16 PM Apr 19, 2024 IST | Sowmya
Updated At - 10:16 PM Apr 19, 2024 IST
prathinidhi 2   స్టార్ డైరెక్టర్ సుకుమార్ లాంచ్ చేసిన  ప్రతినిధి 2  గ్రిప్పింగ్ ట్రైలర్‌
Advertisement

నారా రోహిత్ సినిమాల్లోకి కమ్ బ్యాక్ ఇస్తూ, జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తాపు దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్న చిత్రం ప్రతినిధి 2. ఈ సినిమా ఇంటెన్స్ టీజర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ట్రైలర్ ని లాంచ్ చేశారు.

జనవరి 30, 1948న స్వాతంత్య్ర సమరయోధుడు మహాత్మా గాంధీ మరణించిన తర్వాత గుండెపోటుతో ఎంత మంది మరణించారు అని జర్నలిస్ట్ పాత్ర పోషించిన నారా రోహిత్ అడగడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ప్రస్తుతానికి వస్తే..  ఒక ముఖ్యమంత్రి మరణించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా హింసాత్మక నిరసనలు జరుగుతాయి. ఆత్మహత్యాయత్నం చేసుకొని ఆసుపత్రిలో చేరిన వ్యక్తిని ''మీ కుటుంబం కంటే నాలుగు సంక్షేమ పథకాలు ఇచ్చిన రాజకీయ నాయకుడు ముఖ్యమా? అని కథానాయకుడు ప్రశ్నిస్తాడు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో తమ గెలుపుపై అధికార పార్టీకి అనుమానాలు వుంటాయి. మరోవైపు, ఓ ఛానెల్‌లో ప్రత్యేకంగా వార్తలు ప్రసారం చేస్తున్న కథానాయకుడిని పోలీసులు అనుమానిస్తున్నారు. అతను ఎవరు? అతని ఎజెండా ఏమిటి? వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేసే విషయంలో ఓటర్లను ఎందుకు హెచ్చరించాడు? ఇలాంటి ఎలిమెంట్స్ ఎక్సయిటింగ్ ప్రజెంట్ చేశారు.

Advertisement GKSC

రాజ‌కీయ వ్యవ‌స్థలోని అవినీతిని ప్రశ్నిస్తూ మూర్తి దేవగుప్తపు ఒక పవర్ ఫుల్ కథను రాశారు. కథానాయకుడి అసలు పాత్రను వెల్లడించకుండా ట్రైలర్‌లో సినిమా గురించి మరింత సమాచారం ఉంది. నారా రోహిత్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. సిరీ లెల్లా కథానాయికగా నటించింది. సచిన్ ఖేడేకర్, దినేష్ తేజ్, రఘుబాబు, జిషు సేన్‌గుప్తా, ఉదయ భాను, అజయ్ ఘోష్ , శ్రీ ముఖ్య పాత్రల్లో కనిపించారు.

సినిమాటోగ్రాఫర్ నాని చమిడిశెట్టి, సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్, ఎడిటర్ రవితేజ గిరిజాల క్యాలిటీ కంటెంట్‌ను అందించడానికి అద్భుతమైన టీం వర్క్ అందించారు. కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్. ట్రైలర్ ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న ఉత్కంఠను మరింత పెంచింది. ప్రతినిధి 2 ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement
Author Image