For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Yuva Raithu : 'హరిహర వీరమల్లు' డైరెక్టర్ క్రిష్ మనసు దోచుకున్న పాట

01:08 PM Dec 18, 2023 IST | Sowmya
Updated At - 01:08 PM Dec 18, 2023 IST
yuva raithu    హరిహర వీరమల్లు  డైరెక్టర్ క్రిష్ మనసు దోచుకున్న పాట
Advertisement

కట్టిపడేస్తున్న "రైతు పాట" - గుండెను తాకుతున్న స్వరాలు- సాహిత్యం 

ఆర్.పి.ఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాగుల ప్రసాదరావు నిర్మాణ సారథ్యంలో యువ ప్రతిభాశాలి వేణు గుడిపెల్లి దర్శకత్వం వహించిన ‘యువరైతు’ స్వతంత్ర సినిమాలోని పాటని ప్రముఖ దర్శకుడు , యువతరానికి దార్శనికుడు జాగర్లమూడి క్రిష్ తన ఫస్ట్ ఫ్రేం ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థలో మధుర ఆడియో ద్వారా విడుదల చేసారు. ఈ చిత్రానికి ప్రభాకర్ దమ్ముగారి సంగీత దర్శకత్వం వహించారు.

Advertisement GKSC

ఈ చిత్రంలోని పాటని, అందులోని సాహిత్యాన్ని విన్న తరువాత క్రిష్ మాట్లాడుతూ... "రైతుకి కన్నతల్లి.. నేల తల్లి ఇద్దరూ ఒకటే అని... కష్టమైనా నష్టమైన విడువడు ఎన్నటికి అని.. అధ్బుతంగా వ్యసాయాన్ని, సాయాన్ని కొత్తగా అభివర్ణించారని...అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చిన ప్రభాకర్ దమ్ముగారిని, సాహిత్యాన్ని అందించిన దర్శకుడు వేణు గుడిపెల్లి గారిని ప్రత్యేకంగా అభినందించారు.

వ్యవసాయ పట్టబద్రుడి అందమైన హృద్యమైన ప్రేమ కథని, వ్యవసాయాన్ని జోడించి తీసిన చిత్రమిదని, భూమిని నమ్ముకున్న నాన్న చనిపోయాక.. అదే భూమిని నమ్మిన కొడుకు ఏం చేశాడు? ప్రస్తుత సమాజంలో రైతు విలువని గుర్తు చేసే చిత్రమిదని దర్శకుడు వేణు గుడిపెల్లి వివరించారు. నిర్మాత రాగుల ప్రసాద్ రావు మాట్లాడుతూ... ఈ సినిమా ప్రతి రైతుదే కాదు, అన్నం విలువ తెలిసిన ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా" అన్నారు. సంగీత దర్శకుడు ప్రభాకర్ దమ్ముగారి మాట్లాడుతూ... "ఇందులో ఉన్న భావోద్వేగాలు అద్భుతమని, ప్రకృతికి దగ్గరగా తీసుకెళ్ళే సినిమా" అని వివరించారు!!

Advertisement
Author Image