Tollywood News : దిల్ రాజు గారి 'లోర్వెన్ AI' స్టూడియో సూపర్ : తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు
Lorven AI studio : 'మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతున్న టెక్నాలజీని సినీ రంగంలోకి పరిచయం చేయాలనే దృఢ సంకల్పంతో దిల్ రాజు గారు 'లోర్వెన్ AI' స్టూడియోని లాంచ్ చేయడం అభినందనీయం. 'లోర్వెన్ AI' స్టూడియో ఎంటర్‌టైన్‌మెంట్ వరల్డ్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను'అన్నారు తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు 'లోర్వెన్ AI' స్టూడియోని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ కి తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సినీ పరిశ్రమకు చెందిన అతిరధమహారధులు హాజరైన ఈ వేడుకు చాలా గ్రాండ్ గా జరిగింది.
'లోర్వెన్ AI' స్టూడియో లాంచ్ ఈవెంట్ లో తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీ డి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నా మిత్రులు దిల్ రాజు గారు మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతున్న టెక్నాలజీని సినీ రంగంలోకి పరిచయం చేయాలనే దృఢ సంకల్పంతో ఈరోజు'లోర్వెన్ AI' స్టూడియోని లాంచ్ చేస్తున్న సందర్భంలో వారికి వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పేరుగాంచిన నిర్మాతలు దర్శకులు సినీ రంగంలో వివిధ స్థాయిల్లో వారి పాత్ర నిర్వహిస్తున్న అందరికీ నమస్కారం. దిల్ రాజు గారి విజన్ కి కంగ్రాజులేషన్స్. మూవీ వరల్డ్ కి ఫ్యూచర్స్టిక్ టెక్నాలజీని బిల్డ్ చేసిన దిల్ రాజు గారికి వారి టీం కి అభినందనలు. క్వాంటం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ. వారు 'లోర్వెన్ AI' స్టూడియోలో భాగస్వామ్యం కావడం అభినందనీయం.
తెలంగాణ టెక్నాలజీ డ్రివెన్ స్టేట్. గత మూడు దశాబ్దాలుగా మనం లీడర్స్ ఆఫ్ టెక్నాలజీ అని ఈ వరల్డ్ కి ప్రూవ్ చేసుకున్నాం. హాలీవుడ్ కి ధీటుగా హైదరాబాదు ఎదుగుతోంది. ఈరోజు జరిగిన నాలుగు ప్రొడక్ట్స్ లాంచ్ ఎంటర్టైన్మెంట్ లో గేమ్ చేంజెర్స్ అనిపిస్తున్నాయి. ఈ టెక్నాలజీని మూవీతో బ్లెండ్ చేయడమనేది ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవెల్ స్టెప్. దిల్ రాజు గారు వారి టీం కలిసి చేసిన ఈ ప్రోడక్ట్ అద్భుతం. చాలా సినిమాలు ఎఐ ఇంటిలిజెన్స్ ఆధారంగా వస్తున్నాయి. క్రియేటివిటీని డూప్లికేట్ చేయలేం గానీ క్రియేటివిటీని టెక్నాలజీ తో ఎన్హాన్స్ చేయవచ్చు. టెక్నాలజీ కొత్త అవకాశాలు తెరపైకి వస్తాయి. కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి. చాలా జాబ్స్ క్రియేట్ అవుతాయి. ప్రతి రంగంలో మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
మూవీస్ కూడా న్యూ పేజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ లోకి వెళ్తున్నాయి. ఈ ట్రాన్స్ఫర్మేషన్ లో ఎవరైతే లీడ్ తీసుకుంటారో వాళ్లే లీడర్స్. దిల్ రాజు గారు ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉండి లీడర్ గానే ఆయన జర్నీని కొనసాగిస్తున్నా. ఆయన 'లోర్వెన్ AI' స్టూడియో నెక్స్ట్ లెవలో టెక్నాలజీ లోకి వెళ్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. దిల్ రాజు గారు ఈ విజన్ తో రావడం చాలా ఆనందాన్నిచ్చింది. దిల్ రాజు గారి లాంటి కింగ్ ఆఫ్ మూవీ ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ ఏఐ లోకి రావడం శుభ పరిణామం. ఆయన ఈ వేడుకకి నన్ను ఆహ్వానించడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. దిల్ రాజు గారికి వారి కుటుంబానికి వారి టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఇది అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'అన్నారు.