Tollywood News : డిఫరెంట్ ట్రైలర్ విడుదల, ఏప్రిల్ 18న థియేటర్స్ లో డిఫరెంట్ చిత్రం
Different Movie : వండర్ బ్రదర్స్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ ప్రవేట్ లిమిటెడ్ బ్యానర్ లో జి. ఎన్.నాష్, అజీజ చీమరువ, ప్రట్టీ జో, సన, రోబర్ట్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం డిఫరెంట్. ఎన్.ఎస్.వి.డి శంకరరావు నిర్మాతగా డ్రాగన్ (ఉదయ భాస్కర్) దర్శకత్వంలో లియోన్ ఆర్ భాస్కర్ కెమెరామెన్ గా చేస్తున్నా ఈ సినిమాకు నిహల్ సంగీతం అందించారు. అందరూ మంచి టెక్నీషియన్స్ వర్క్ చేసిన బెస్ట్ ఫిలిం ఇది.
ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ చాలా బాగుంది, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ జోనల్ లో ఈ సినిమా ఏప్రిల్ 18న థియేటర్స్ లో విడుదల కాబోతోంది. ఇంటర్నేషనల్ స్టాండెడ్స్ తో, సూపర్బ్ విజువల్స్ ఈ మూవీ ఉంటుందని ట్రైలర్ చేస్తుంటే తెలుస్తోంది.
తెలుగు నిర్మాత ఎన్.ఎస్.వి.డి శంకర్రావు చేసిన ఈ హాలీవుడ్ చిత్రం డిఫరెంట్. మంచి సినిమాలు చెయ్యాలనే ఆలోచనతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చెయ్యడం జరిగింది. కథ , కంటెంట్ బాగుంటే ఏ సినిమా అయినా సరే ప్రేక్షకులు ఆధరిస్తారు, అదే తరహాలో ఈ డిఫరెంట్ సినిమా రాబోతోంది. ఏప్రిల్ 18న విడుదల కాబోతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. ఎస్ కే ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ఏప్రిల్ 18 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది.