For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

సందీప్ వంగా పురుషాధిక్య ద‌ర్శ‌క‌త్వానికి, లాప‌తా లేడీస్ తీసిన‌ కిర‌ణ్ రావ్ స్త్రీ వాద‌ సినిమా క‌థ‌కూ, తుల‌సీ చందు వీడియోలోని విషం చిమ్ము ల‌క్ష‌ణానికి ఎక్క‌డైనా సంబంధ‌ముందా ?

05:59 PM May 26, 2024 IST | Sowmya
Updated At - 06:03 PM May 26, 2024 IST
సందీప్ వంగా పురుషాధిక్య ద‌ర్శ‌క‌త్వానికి  లాప‌తా లేడీస్ తీసిన‌ కిర‌ణ్ రావ్ స్త్రీ వాద‌ సినిమా క‌థ‌కూ  తుల‌సీ చందు వీడియోలోని విషం చిమ్ము ల‌క్ష‌ణానికి ఎక్క‌డైనా సంబంధ‌ముందా
Advertisement

Special Story by Senior Journalist Audi

మాములుగా ఇలా రాస్తున్నందుకు ముందు తుల‌సీ చందు కాస్త గ‌ర్వంగా ఫీల‌వ్వాలి. చూడండీ నేనిలా త‌లా తోకా లేని వీడియో పెట్టానో లేదో.. వాడెవ‌డో నా మీద అలా వ్యాస‌ర‌చ‌న చేస్తున్నాడు.. ఎంతైనా నేను గ్రేటే.. అని త‌న‌లో తాను మురిసిపోవ‌చ్చామె. ఇప్పుడీ వ్యాస‌ర‌చ‌న‌కు అస‌లు కార‌ణం ఏంటంటే.. సందీప్ రెడ్డి వంగా తీసిన అర్జున్ రెడ్డి, యానిమ‌ల్ మూవీస్ స్త్రీ వ్య‌తిరేక సినిమాల‌.. ట‌! ఓకే కాద‌న‌డం లేదు.. కిర‌ణ్ రావు తీసిన లా ప‌తా లేడీస్ స్త్రీవాద చిత్ర‌మ‌.. ఠ‌!!!

ఇదే కాదు ఇంకో ట్విస్టు కూడా ఉందిక్క‌డ‌.. సందీప్ వంగా, కిర‌ణ్ రావు ఇద్ద‌రూ ఒకే ప్రాంతానికి చెందిన వార‌ట‌.. వెంట‌నే నేను వికీపీడియా ఓపెన్ చేసి అక్క‌డున్న వారి వారి బ‌ర్త్ ప్లేసెస్ ను చూశాక గానీ ఊపిరి పీల్చుకోలేక పోయా.. అక్క‌డ చూస్తే స‌ర‌స్వ‌తీ బ్రాహ్మిణ్ (ఐ థింక్ ఇట్స్ బిలాంగ్స్ టూ స‌చిన్ టెండూల్క‌ర్ ఆల్సో) కి చెందిన కిర‌ణ్ రావ్ బెంగ‌ళూరుకు చెందిన మ‌హిళా ద‌ర్శ‌కురాలు. ఇదే సందీప్ రెడ్డి వంగా వ‌రంగ‌ల్ తెలంగాణ కు చెందిన పురుష ద‌ర్శ‌కుడు. ఈ ఇద్ద‌రిదీ ఒకే ప్రాంతం ఎలాగ‌వుతుందో అర్ధం కాదు. స‌రే కిర‌ణ్ రావు తండ్రి ఎలాగూ ఆర్మీ ఆఫీస‌రే కాబ‌ట్టి.. హైద‌రాబాద్ లోని కంటోన్మెంట్ ప్రాంతంలో నివ‌సించి ఉండొచ్చు. లేక మరేదైనా లింకులు ఉండ‌వ‌చ్చు. కాద‌న‌డం లేదు.

Advertisement GKSC

లాప‌తా లేడీస్ స్త్రీవాద చిత్ర‌మెలా అవుతుందో అర్ధం కాదు. నేను సోష‌ల్ మీడియా వేదిక‌గా చ‌దివిన కామెంట్ ఏంటంటే.. ఈ కాలంలో కూడా ఇలాంటి మ‌హిళ‌లుంటారా1? అని. అన‌గ‌న‌గా అప్పుడే పెళ్ల‌యిన ఇద్ద‌రు వివాహిత‌లు.. ఒకే జ‌న‌ర‌ల్ కంపార్ట్ మెంట్ ఎక్కుతార‌ట‌. ఆ ఇద్ద‌రూ ముసుగులు ధ‌రించి ఉంటార‌ట‌. ఒక స్టేష‌న్ రాగానే త‌న భార్య కాని మ‌రో ముసుగు- పెళ్లికూతుర్ని అత‌డు త‌న చేయి ప‌ట్టి తీస్కెళ్లి పోతాడ‌ట‌. తీరా ఇంటికెళ్లి చూశాక‌.. ఆ పెళ్లికూతురు రాంగ్.

నిజంగా ఆ మ‌హిళ త‌లుచుకుంటే త‌న భ‌ర్త అత‌డు కాడ‌ని గుర్తించ‌డానికి అవ‌కాశం ఉందా ? లేదా ? అంటే డెఫినెట్ గా ఉంది. ఎందుకంటే ఇత‌డు ముసుగు ధ‌రించ లేదు క‌దా !? ఆమె వెంట‌నే రియాక్ట్ కావ‌చ్చు క‌దా ??? ఇలా ఒక లాజిక్ కి నిల‌బ‌డ‌ని సినిమా ఉత్త‌మ స్త్రీవాద చిత్రంగా ఎలాగ‌య్యిందో అర్ధం కాలేదు నాలాంటి ఎన్నో మ‌ట్టి బుర్ర‌ల‌కు. స‌రే ఒక సినిమా మ‌న‌కు న‌చ్చిన‌ట్ట‌యితే దాన్ని ఆహా ఓహో అని ఆకాశానికి ఎత్తేయ‌డం క‌ద్దు. కాద‌న‌డం లేదు. బేసిగ్గా సినిమా అంటేనే లాజిక్ చూడ‌కూడ‌ద‌నీ అంటారు. ఓకే. దాన్ని అడ్డు పెట్టుకుని యానిమ‌ల్ తీసిన డైరెక్ట‌ర్ ని ఉల్ఫా అన‌డం ఎందుకు? ఒకే వేళ అత‌డే నీ టార్గెట్ అయితే.. డైరెక్ట్ గా అత‌డ్నే తిట్టొచ్చుగా.

నిజానికి ఒక యానిమ‌ల్ కావ‌చ్చు, అర్జున్ రెడ్డి కావ‌చ్చు.. డెఫినెట్ గా స్త్రీ మూర్తిత్వాన్ని గొప్ప‌గా చూపించిన చిత్రాలే. ఆమె ప్రేమ‌కోసం అత‌డు పిచ్చి వాడై పోవ‌డ‌మేగా అర్జున్ రెడ్డిలో చూపించింది. ఆమె ఒక ఆబ్జెక్ట్ కాద‌ని సంభాషిస్తుందీ చిత్రం. ఇక యానిమ‌ల్లో ఇదే స్త్రీ పాత్ర- పురుష పాత్ర త‌న‌పై చూపిన ప్రేమ‌ను, బాధ్య‌త‌ను ఎన్ని సార్లు పొగుడుతుందో చెప్ప‌లేం. ఇదెలా స్త్రీ వ్య‌తిరేక చిత్ర‌మో అర్ధం కాదు. స‌రే సందీప్ వంగా గ‌తంలో చేసిన స్త్రీ వ్య‌తిరేక కామెంట్లు కూడా ఒక కార‌ణం కావ‌చ్చుగాక‌.. అందులో కూడా స్త్రీ ప‌ట్ల ప్రేమ దాగి ఉంటుంద‌న్న‌ది కాద‌న‌లేని స‌త్యం.

పొర‌బాటున అత‌డు రెడ్డి అయ్యాడ‌నా? లేక మ‌రేదైనా కార‌ణ‌ముందో తెలీడం లేదు కానీ.. అత‌డ్ని ఉల్ఫా అనేంత క‌సి క్రోధ‌మేంటో నాకైతే బోధ ప‌డ‌లేదు. ఇవ‌న్నీ ఇలా ఉంచండి.. ఈ మ‌ధ్య కాలంలో బ‌స్త‌ర్ అనే సినిమా వ‌చ్చింది. అందులో నీర‌జా మాధ‌వ‌న్ అనే మ‌హిళా పోలీస్ ఆఫీస‌ర్ ని ఆకాశానికి ఎత్తేస్తూ సుదీప్తో సేన్ ఓ గొప్ప సినిమా తీశాడు. మ‌రి అత‌డి ద‌ర్శ‌క‌త్వంలో కూడా పురుషాధిక్య‌తే ఉందా? లేదా?? అక్క‌డ న‌క్స‌లిజం దాని తెర వెన‌క‌దాగి వ‌న్యా రాయ్ వంటి మ‌హిళ‌లాడే ర‌క్త క్రీడ‌ను కూడా వివ‌రించి ఇది త‌ప్ప‌ని డిస్క్రైబ్ చేయొచ్చుగా.

అంటే మ‌హిళ అని ఒక షీల్డ్ అడ్డు పెట్టుకుని ఏదంటే అది అనేయ‌ట‌మే.. క‌ర్త‌వ్యం లాంటి చిత్రంలో స్త్రీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు అపార‌మైన‌వ‌ని చూపిన ద‌ర్శ‌కుడు మ‌గాడు కాడా? స‌ప్త‌ప‌దిలో త‌న భార్య‌లో అమ్మ‌వారిని చూసి కాళ్ల‌కు దండం పెట్టించిన ద‌ర్శ‌కుడు మ‌గ‌వాడు కాడా? మ‌గువా మ‌గువా అని పాట రాసిందెవ‌రు? అపురూప‌మైన‌ద‌మ్మ ఆడ‌జ‌న్మ అని పాట‌లు రాసిందెవ‌రు? ఆడ‌దే ఆధారం అంటూ స్త్రీత్వాన్ని ఆకాశానికి ఎంత్తిందెవ‌రు ? అదేమంటే అదొక ఎమోష‌న‌ల్ బ్లాక్ మెయిల్ బొంగూ బోశాండం అని రివ‌ర్స్ లో వ‌స్తారు. మ‌రి అంత మ‌గాధిక్య‌త అయితే మ‌గాడ్నే ఎందుకు పెళ్లి చేస్కున్నావ్ తుల‌సీ చందూ??? ఏబీఎన్ లో ఉండ‌గా మ‌గాడైన రాధాకృష్ణ‌ను మెప్పించ‌డానికి అన్ని పాట్లు ఎందుకు ప‌డ్డావ్.. ఎప్పుడైనా ఆలోచించావా!!!

స్త్రీ\ పురుష వాదాలు ఉండాల్సిందే కాద‌న‌డం లేదు. కానీ వాటిని అడ్డు పెట్టుకుని ఏది బ‌డితే అది మాట్లాడ్డం కాదు. వాడెవ‌డో కామెంట్ పెట్టాడు.. నువ్వేమంత సుద్ద పూస‌వు కావు.. ఎల్ల‌పుడూ దేశం మీద విషం చిమ్ముతుంటావు. ముందు నీ సంగ‌తి చూస్కో! అని. మ‌రొక‌డు అన్నాడు.. నిజంగా నువ్వంత మ‌హిళా ప‌క్ష పాతివి అయితే.. ఓల్డ్ సిటీలో క‌నిపించ‌కుండా పోతున్న మ‌హిళ‌ల‌పై ఇంతేలాంటి రిపోర్టు ఇవ్వు అంటూ. నిజానికి తుల‌సీ చందులాంటి చోటా మోటా జ‌ర్న‌లిస్టుల త‌ల‌తిక్క కామెంట్ల‌కు స్టేట్మెంట్ల‌కూ మ‌నం స్పందించ‌డం క‌రెక్టు కాదు.. కానీ ఆమె త‌న తెలిసీ తెలియ‌ని త‌నంతో ఏకంగా చిత్ర ద‌ర్శ‌క‌త్వానికి ఆడ\ మ‌గ జెండ‌ర్ సెన్సిటివిటీస్ ఆపాదించేస్తోంది.

ఆమె అంటూ సినిమాలెన్నో తీసిన జాతి మ‌గ‌జాతి. అలాంటి మ‌గాడికంటూ క‌నీస ర‌క్ష‌ణ లేకుండా పోతోందనే ఈ రైట‌ప్.. ఇంకా చాలానే రాయాలి. త‌ప్ప‌క రాస్తా.. రాస్తూనే ఉంటా.. (ఏది ఏమైనా నాకు చాలా చాలా ధైర్య‌మే.. కొంప‌దీసి నా పురుషాధిక్య‌త‌- పులిహోర అంటూ దీని మీద కూడా ఒక రౌండ్ టేబుల్ పెట్టిస్తుందో ఏమో.. బ‌లే బ‌లే బ‌యంగా ఉంద‌బ్బా!!!)

Advertisement
Author Image