For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Devotional : ఆహారాన్ని ఆ దిక్కు వైపు ఉండి తినడం వల్ల ఏం జరుగుతుందంటే..!

12:29 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:29 PM May 13, 2024 IST
devotional   ఆహారాన్ని ఆ దిక్కు వైపు ఉండి తినడం వల్ల ఏం జరుగుతుందంటే
Advertisement

Devotional : జీవరాశులన్నింటి మనుగడకు ప్రధానమైనది ఆహారం. పేద, ధనిక తార తమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరూ కష్టపడేది పొట్టకూటి కోసమే. మనం తీసుకునే ఆహారం అనేది మన ఆరోగ్యానికి, మన శరీరం పొందే శక్తికి నేరుగా సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి వాస్తు శాస్త్రం ఆహారం విషయంలో కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలని సూచిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, వంట చేయడానికి, తినడానికి, వంటగదిని ఏర్పాటు చేసుకోవడానికి కొన్ని పద్ధతులు సూచించబడ్డాయి. అదే విధంగా ఆహారాన్ని వండడానికి, తినడానికి కూడా కొన్ని మార్గదర్శకాలను అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ప్రత్యేకంగా మీకోసం...

తూర్పు లేదా ఈశాన్య ముఖంగా కూర్చుని ఆహారం తీసుకోవడం ఉత్తమం. ఇలా చేయడం ద్వారా సదరు వ్యక్తి ఆహారం నుండి పూర్తి శక్తిని పొందుతాడు.

Advertisement GKSC

పశ్చిమ దిశను లాభాల దిశగా పరిగణిస్తారు. వ్యాపారం చేసేవారు లేదా ఉద్యోగంలో ఉన్నవారు లేదా రచనలు, విద్య, పరిశోధన మొదలైన పనులతో సంబంధం ఉన్నవారు కూడా ఈ దిశలో కూర్చుని ఆహారం తీసుకోవాలి.

ఉత్తరాభిముఖంగా ఆహారం తీసుకోవడం కూడా మంచిది. ఇది మానసిక ఒత్తిడి మరియు వ్యాధుల నుండి ఉపశమనం పొందుతుంది. ఆరోగ్యం బాగానే కొనసాగుతోంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, విద్యార్ధులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఉత్తరాభి ముఖంగా ఆహారం తీసుకోవాలి. కెరీర్ తొలిదశలో ఉన్నవారు కూడా ఈ దిశలోనే ఆహారం తీసుకోవాలి. ఈ దిశ సంపద, జ్ఞానం, ఆధ్యాత్మికతకు దిశగా పరిగణించ బడుతుంది.

మీరు దక్షిణ దిక్కుకు తిరిగి ఆహారం తీసుకుంటే, వెంటనే ఈ అలవాటును మార్చుకోండి. దక్షిణ దిక్కును యమరాజు దిశగా పరిగణిస్తారు. యమరాజు మృత్యుదేవత. దక్షిణాభి ముఖంగా ఆహారం తీసుకుంటే ప్రాణహాని కలుగుతుందని అంటున్నారు.

Advertisement
Author Image