For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Swine Flu -Rainy Season:స్వైన్ ఫ్లూ రాకుండా వర్షాకాలం లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు .....

10:33 AM Jun 27, 2023 IST | Sowmya
Updated At - 10:33 AM Jun 27, 2023 IST
swine flu  rainy season స్వైన్ ఫ్లూ రాకుండా వర్షాకాలం లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Advertisement

Swine Flu -Rainy Season : వర్షాకాలం అనేది అనేక ప్రాణాంతక వైరస్‌లు మనల్ని అనారోగ్యానికి గురయ్యేలా చేస్తాయి. H1N1 వైరస్‌ కారణంగా వచ్చే స్వైన్ ఫ్లూ వంటి వాటికి నివారణ లేనప్పటికీ, మిమ్మల్ని మీరు దాని బారిన పడకుండా కాపాడుకోవటం చాలా అవసరం. H1N1 వైరస్ యొక్క లక్షణాలు, కారణాలు , చికిత్సలపై అవగాహన పెంచుకోవటం ద్వారా మాత్రమే ఈ తీవ్రమైన అనారోగ్యం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది.

H1N1 వైరస్, దీనినే స్వైన్ ఫ్లూ అని కూడా పిలుస్తారు, ఇది ఒక అంటువ్యాధి శ్వాసకోశ వైరస్. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా మంది దీనిబారినపడుతున్నారు. ఇది ఒక రకమైన ఇన్ఫ్లుఎంజా వైరస్. మానవులలో తేలికపాటి నుండి తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుంది. గత దశాబ్ద కాలంలో H1N1 వ్యాప్తి మానుషులు, జంతువులలో ఎక్కువ ఉంది.

Advertisement GKSC

H1N1 ఫ్లూ లక్షణాలు ;
H1N1 వైరస్ యొక్క సాధారణ లక్షణాలు కాలానుగుణంగా ఇన్ఫ్లుఎంజా మాదిరిగానే ఉంటాయి. వీటిలో జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శరీర నొప్పులు, తలనొప్పి, చలి, అలసట ,కొన్నిసార్లు వాంతులు , విరేచనాలు అవుతాయి. కొందరిలో ముక్కు కారడం , ముక్కు మూసుకుపోవడం, తుమ్ములు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో, న్యుమోనియా వంటి తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయి. ఈ లక్షణాలలో దేనినైనా గుర్తిస్తే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందటం మంచిది.

H1N1 వైరస్ సోకిన వ్యక్తితో సంపర్కం వల్ల వస్తుంది. ఇది సోకిన వ్యక్తి నుండి లాలాజలం, శ్లేష్మం వంటి శ్వాసకోశ స్రావాలతో ద్వారా వ్యాపిస్తుంది. కలుషితమైన ఉపరితలాలు , డోర్ నాబ్‌లు,బొమ్మలు వంటి వస్తువులను తాకటం వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది. వైరస్ సోకిన వ్యక్తి మరొక వ్యక్తి దగ్గర దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది.

Advertisement
Author Image