Payal Rajput :RX 100 తర్వాత కొందరి మాటలు నన్ను మార్చేసాయి .. వాళ్ళే నన్ను మిస్ గైడ్ చేశారు.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన పాయల్..
Payal Rajput : ఢిల్లీ(Delhi) భామ పాయల్ రాజ్‌పుత్ RX 100 సినిమాతో టాలీవుడ్(Tollywood) లో ఒక్కసారిగా పాపులర్ అయింది. ఆ ఒక్క సినిమాతోనే ఎంట్రీ ఇవ్వడమే కాక ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది. ఆ తర్వాత మాత్రం ఆ రేంజ్ హిట్ సినిమా పడలేదు. RX 100 తర్వాత వెంకీమామ, డిస్కో రాజా, RDX లవ్.. ఇలా పలు సినిమాల్లో నటించింది. తాజాగా మాయాపేటిక సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో పాయల్ మాట్లాడుతూ టాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. పాయల్ రాజ్‌పుత్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. RX 100 సినిమా తర్వాత టాలీవుడ్ లో కొంతమంది నన్ను మిస్ గైడ్ చేశారు. నేను నమ్మిన వాళ్ళే నన్ను అడ్వాంటేజ్ గా తీసుకొని వాడుకున్నారు. ఆ సినిమా వద్దు, ఈ సినిమా చేయి అంటూ నాకు తప్పుడు సలహాలు ఇచ్చారు. వారి వల్ల కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది.
కొన్నాళ్ళకి అది అర్థమయి వాళ్ళని దూరం పెట్టాను. ఇప్పుడు నాకు కొంచెం మెచ్యూరిటీ వచ్చింది. ఏ సినిమా చేయాలి, ఏ సినిమా చేయకూడదు అని నాకు ఒక ఐడియా వచ్చింది ,ఇక నుండి నేనే డిసైడ్ అవుతా ఏ సినిమా చేయాలి అనేది అని కామెంట్స్ చేసింది. దీంతో పాయల్ ని టాలీవుడ్ లో తప్పుదారి పట్టించిన వాళ్ళు ఎవరా అని ఆలోచిస్తున్నారు. ఇక ప్రస్తుతం పాయల్ చేతిలో పలు తెలుగు, తమిళ్ సినిమాలు ఉన్నాయి. మరి ఇకనైనా ఆమె కాతాలో మంచి హిట్ పడనుందో లేదో చూడాలి .