For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Foods Effect Sleep Quality: ఈ ఫుడ్ తింటే నైట్ సరిగా నిద్ర పట్టదు .. అవేంటో తెలుసుకోవాలి అంటే ...

09:33 AM Jul 08, 2023 IST | Sowmya
Updated At - 09:33 AM Jul 08, 2023 IST
foods effect sleep quality  ఈ ఫుడ్  తింటే నైట్ సరిగా నిద్ర పట్టదు    అవేంటో తెలుసుకోవాలి అంటే
Advertisement

Foods Effect Sleep Quality: మన శరీరాన్ని రీఛార్జ్‌ చేయడానికి, ఆరోగ్యాన్ని రక్షించడానికి నిద్ర చాలా అవసరం. రాత్రి ప్రశాంతమైన నిద్ర.. మీరు రోజంతా యాక్టివ్‌గా, రీఫ్రెష్‌గా, ఏకాగ్రతతో, ఒత్తిడి లేకుండా.. ఉంచడంలో సహాయపడుతుంది. వీటితో పాటు.. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది, గుండె సమస్యల ముప్పును తగ్గిస్తుంది. సరిపడా నిద్ర మన బరువును కంట్రోల్‌లో ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే రాత్రి పూట 7 నుంచి 8 గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు. రోజుకు 7 నుంచి 8 గంటల కంటే తక్కువ నిద్రపోయే వారికి పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ (PAD) వచ్చే ప్రమాదం ఉందని యూరోపియన్ హార్ట్ జర్నల్ ఓపెన్‌లో ప్రచురించిన ఓ తాజా అధ్యయనం స్పష్టం చేసింది. రాత్రిపూట కొన్ని ఆహారాలు తీసుకుంటే.. నిద్ర మీద ఎఫెక్ట్‌ పడుతుందిని, ఇవి నిద్రకు భంగం కలిగిస్తాయని నిపుణులు అంటున్నారు.

కేఫిన్‌ రిచ్‌ ఫుడ్స్‌..
​రాత్రిపూట కెఫిన్‌ రిచ్‌ ఫుడ్స్‌ తింటే నిద్ర పాడవుతుందని నిపుణులు చెబుతున్నారు. కాఫీ, టీ, సోడా, ఎనర్జీ డ్రింక్స్, మరియు చాక్లెట్ వంటి కెఫీన్ అధికంగా ఉండే ఆహారాలు మీ నిద్రకు భంగం కలిగిస్తాయి. ఈ ఆహారాలలో ఉండే.. కెఫిన్ కంటెంట్ నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. మిమ్మల్ని యాక్టివ్‌ చేస్తుంది, మీరు ప్రశాంతంగా నిద్రపోవడం కష్టం అవుతుంది. ​

Advertisement GKSC

స్పైసీ ఫుడ్‌..
మసాలా, కారం ఎక్కువగా ఉండే ఆహారం అజీర్ణం, గుండెల్లో మంటను కలిగిస్తాయి. ఇవి హాయిగా నిద్రపట్టనివ్వవు. . కారంగా ఉండే ఆహారాలలో క్యాప్సైసిన్ ఉంటుంది, ఇది కడుపులో యాసిడ్‌ ఉత్పత్తిని పెంచుతుంది. రాత్రి పూట స్పైసీ ఫుడ్‌ తింటే.. యాసిడ్ రిఫ్లక్స్, జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. మీరు ప్రశాంతంగా నిద్రపోవాలంటే.. నిద్రవేళకు కనీసం 3-4 గంటల ముందు స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం మానేయడం మంచిది.

Advertisement
Author Image