For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

బీజేపీతో బీ అర్ ఎస్ కుమ్మక్కు కావడంతోనే సికింద్రాబాద్ లో ఓటమి : ఎమ్మెల్యే దానం నాగేందర్

04:46 PM Jun 07, 2024 IST | Sowmya
Updated At - 04:46 PM Jun 07, 2024 IST
బీజేపీతో బీ అర్ ఎస్ కుమ్మక్కు కావడంతోనే సికింద్రాబాద్ లో ఓటమి   ఎమ్మెల్యే దానం నాగేందర్
Advertisement

బంజారాహిల్స్ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ ... సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వారందరికీ కృతజ్ఞతలు.. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు.నాయకుల పోరాట స్ఫూర్తికి శిరస్సువంచి నమస్కరిస్తున్నాను. పార్లమెంట్ పరిదిలో నా కోసం ఎంతో కష్టపడి పనిచేసిన రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, పార్టీ నేతలు వీ హనుమంత రావు గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, అజారుద్దీన్ గారు, రోహిన్ రెడ్డిగారు, ఫిరోజ్ ఖాన్ గారు, అదం సంతోష్ గారు, విజయా రెడ్డి గారు, కోట నీలిమ గారితో పాటు కార్పొరేటర్లు, బ్లాక్ స్థాయి నేతలు, అన్ని డివిజన్ల నాయకులు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నాయకులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

సికింద్రాబాద్ గడ్డమీద కాంగ్రెస్ జెండా ఎగురవేయలన్న లక్ష్యంతో ఎన్నికల్లో ప్రతి ఒకరు శక్తి వంచన లేకుండా పని చేసారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమే. నమ్మిన పార్టీ కోసం చిత్తశుద్దితో పనిచేయడమే ముఖ్యం. ఈ ఎన్నికల్లో ఓడినా కార్యకర్తల పోరాట స్ఫూర్తి రానున్న రోజుల్లో పార్టీ పటిష్టతకు దారి చూపింది. కాబట్టి ఎవరూ నిరాశ చెందవద్దు కాంగ్రెస్ పార్టీ లో క్రమశిక్షణ గలిగిన సైనికుడిలా పార్టీ ఆదేశం మేరకు పార్లమెంట్ బరిలో దిగాను. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలలో ఉన్న అభిమానం, నా పట్ల ప్రేమ, ముఖ్యమంత్రి రేవంత్ నాయకత్వంపై విశ్వాసం కారణంగా పెద్ద ఎత్తున ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు. అతి తక్కువ మెజారిటీ తో ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి.

Advertisement GKSC

ఎన్నికలకు ముందే నేను చెప్పాను.. బీజేపీ బీ అర్ ఎస్ కలిసి పనిచేస్తున్నాయి అని.. ఫలితాల తర్వాత ఈ విషయం స్పష్టవుతోంది. అన్ని నియోజకవర్గాల్లో బీ అర్ ఎస్ పార్టీ ఓట్లు మొత్తం బీజేపీకి వేయించారు. బీజేపీ కోసం బీ అర్ ఎస్ పార్టీని చంపుకున్నరు. బీజేపి,బి అర్ ఎస్ లోపాయికార ఒప్పందం వల్లనే కాంగ్రెస్ ఓటమి పాలైంది. హేమ హేమీలు అని చెప్పుకున్న హైదరాబాద్ జిల్లా బీ అర్ ఎస్ ప్రజాప్రతినిధులు బి జె పి కోసం పని చేసారు అని ఆయా నియోజకవర్గాల్లో బి అర్ ఎస్ ఓట్లు వచ్చిన దానితో తెలుస్తోంది.

సికింద్రాబాద్ లో ఓటమి పాలైనా నైతిక విజయం మనదే మరోసారి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన వారందరికీ హృదయ పూర్వక కృతజ్ఞతలు. పార్లమెంట్ పరిదిలో కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా నిలబడి రానున్న రోజుల్లో మరింత మెరుగైన ఫలితాల కోసం ప్రయత్నిద్దాం.

Advertisement
Author Image