For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

FILM NEWS: "లైగ‌ర్" మూవీ సెట్లో గ్రాండ్‌గా జ‌రిగిన‌ పూరిజ‌గ‌న్నాధ్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌

10:39 PM Sep 28, 2021 IST | Sowmya
Updated At - 10:39 PM Sep 28, 2021 IST
film news   లైగ‌ర్  మూవీ సెట్లో గ్రాండ్‌గా జ‌రిగిన‌ పూరిజ‌గ‌న్నాధ్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌
Advertisement

Dashing Director Puri Jagannadh Birthday Celebrations on "Liger" Movie Sets in Goa, Hero Vijay Devarakonda, Charmy Kaur, Telugu World Now,

"లైగ‌ర్" మూవీ సెట్లో గ్రాండ్‌గా జ‌రిగిన‌ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరిజ‌గ‌న్నాధ్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌

Advertisement GKSC

మోస్ట్ హ్యపెనింగ్ హీరో విజయ్ దేవరకొండ - డాషింగ్ డైరెక్ట‌ర్ పూరిజ‌గ‌న్నాధ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న క్రేజీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `లైగర్`. సాలా క్రాస్ బ్రీడ్ అనేది ట్యాగ్‌లైన్‌. ప్యాన్ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాపై అటు అభిమానుల్లో ఇటు ప్రేక్ష‌కుల్లో భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం లైగర్ చిత్రీకరణ గోవాలో జరుగుతుంది. ఈ రోజు(సెప్టెంబ‌రు 28) డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాధ్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా లైగ‌ర్ సెట్లో పూరిజ‌గ‌న్నాధ్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ గ్రాండ్‌గా జ‌రిగాయి. ఈ వేడుక‌ల్లో చిత్ర యూనిట్ స‌మక్షంలో బ‌ర్త్‌డే కేక్ క‌ట్ చేశారు పూరి జ‌గ‌న్నాధ్‌. ప్ర‌స్తుతం ఆ ఫోటోలు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

లైగ‌ర్ చిత్రం ద్వారా ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత బాక్స‌ర్ మైక్ టైసన్ మొదటి సారిగా ఇండియన్ స్క్రీన్‌కు పరిచయమ‌వున్నారు. ఈ అనౌన్స్‌మెంట్ కి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఇండియా వైడ్ గా ట్విట్ట‌ర్ లో ట్రెండ్ అయ్యింది. బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.

ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మళయాలి భాషల్లో రూపొందుతోంది.

నటీనటులు : విజయ్ దేవరకొండ, మైక్‌టైస‌న్, అనన్య పాండే, రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విష్ణురెడ్డి, ఆలి, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను

సాంకేతిక బృందం :
దర్శకుడు: పూరి జగన్నాథ్
నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా
బ్యానర్స్: పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్
కెమెరామెన్: విష్ణు శర్మ
ఆర్ట్ డైరెక్టర్: జానీ షేక్ బాషా
ఎడిటర్: జునైద్ సిద్దిఖీ
స్టంట్: డైరెక్టర్ కెచ్చా

Advertisement
Author Image