For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

#Nani33 : నేచురల్ స్టార్ నాని దసరా ట్రయో ఈజ్ బ్యాక్

08:58 PM Mar 30, 2024 IST | Sowmya
Updated At - 08:58 PM Mar 30, 2024 IST
 nani33   నేచురల్ స్టార్ నాని దసరా ట్రయో ఈజ్ బ్యాక్
Advertisement

పీరియడ్ లవ్, మాస్ యాక్షన్ డ్రామా 'దసరా' 2023లో బిగ్గెస్ట్  హిట్‌లలో ఒకటి.  నేచురల్ స్టార్ నానితో సహా ఈ సినిమాలో భాగమైన దాదాపు ప్రతి ఒక్కరికీ అత్యధిక వసూళ్లు రాబట్టింది. దసరా త్రయం మరోసారి చేతులు కలిపారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV సినిమాస్) సుధాకర్ చెరుకూరి నిర్మించనున్న కొత్త చిత్రం #Nani33 కోసం దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో నాని మరోసారి జతకట్టారు.

శ్రీకాంత్ ఓదెల దసరాతో ఆకట్టుకునే అరంగేట్రం చేసాడు. దసరా కమర్షియల్ హిట్‌గా సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది. రచయితగా, దర్శకుడిగా తన సత్తా చాటి ప్రశంసలు అందుకున్నారు. మునుపెన్నడూ లేని మాస్ క్యారెక్టర్ లో నానిని ప్రెజెంట్ చేశారు. అనౌన్స్ మెంట్ పోస్టర్ ఎరుపు రంగులో పెయింట్ చేయబడింది, ఇది వైలెన్స్ సూచిస్తుంది. నాని గడ్డం, మెలితిప్పిన మీసాలతో మ్యాసీవ్ అవతార్‌లో కనిపించారు. స్టైలిష్ షేడ్స్‌ ధరించి, గ్రేస్ ఫుల్ గా సిగార్‌ను కాలుస్తూ కనిపించారు. 'You don’t need an identity to be a leader'' అని పోస్టర్ పై రాసుంది.  వాస్తవానికి, నాని ముఖం అతని పాత్రను సూచించే నేపథ్యంలో జనసమూహంతో డిజైన్ చేయబడింది.

Advertisement GKSC

నానిని పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేయడానికి శ్రీకాంత్ మరో విన్నింగ్ స్క్రిప్ట్ రెడీ చేశాడు.  ప్యాషనేట్ ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి ఈ కొత్త సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. అన్ని రకాల జోనర్స్, సబ్జెక్ట్‌లతో అలరిస్తున్న నాని.. శ్రీకాంత్ ఓదెలతో కలిసి మళ్లీ పనిచేయడానికి ఉత్సాహంగా వున్నారు. ఈ క్రేజీ, బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో సినిమా కథా, మేకింగ్, సాంకేతిక ప్రమాణాల పరంగా బిగ్గర్ గా వుండబోతుంది. ఈ చిత్రాన్ని 2025 వేసవిలో విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.

Advertisement
Author Image