For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

డీ2ఆర్‌ ఇండీ బ్యాన‌ర్‌లో తొలి తెలుగు చిత్రం"సినిమాబండి" మే 14న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌.

02:56 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 02:56 PM May 11, 2024 IST
డీ2ఆర్‌ ఇండీ బ్యాన‌ర్‌లో తొలి తెలుగు చిత్రం సినిమాబండి  మే 14న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌
Advertisement

D2R Indie, Raj & DK’s ,Raj Nidimoru and Krishna DK,Praveen Kandregula,Cinema Bandi Movie,Latest Telugu Movies,

డీ2ఆర్‌ ఇండీ బ్యాన‌ర్‌లో తొలి తెలుగు చిత్రం"సినిమాబండి" మే 14న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌.

Advertisement GKSC

‘ది ఫ్యామిలీమేన్‌’ వెబ్‌సిరీస్‌ అద్భుతమైన సక్సెస్‌తో  హిందీ ప‌రిశ్ర‌మతో పాటు ‌మిగతా ఇండస్ట్రీల చూపును తమ వైపు తిప్పుకున్నారు దర్శక ద్వయం రాజ్‌ అండ్‌ డీకే (రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకే). కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే ఫిల్మ్‌ మేకర్స్‌ను ప్రొత్సహించడంలో కూడా ముందు వరుసలో ఉంటారు ఈ దర్శక ద్వయం. ఆ ప్రయత్నంలో భాగంగానే `డీ2ఆర్‌ ఇండీ` అనే ఓ కొత్త బ్యాన‌ర్‌ను స్టార్ట్‌ చేసి ప్రతిభావంతులైన‌ కొత్తవారిని ప్రొత్సహిస్తున్నారు.  దీనిలో భాగంగా తెలుగులో తొలి అడుగుగా ఇండిపెండెంట్‌ కామెడీ ఫిల్మ్‌ ‘సినిమా బండి’ ట్రైలర్‌ను శుక్రవారం ఉదయం విడుదల చేశారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా ఈ ట్రైలర్‌ రిలీజైంది. మే 14న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.
మన ఇండియాలో అంద‌రికీ సినిమా అనేది ఒక క‌ల‌. అంద‌రికీ సినిమాని నిర్మిద్దాం అనికాని, డైరెక్ట్ చేద్దాం అని కాని, యాక్ట్ చేద్దాం అని కాని.. ఇలా ఏదో ఒక క‌ల ఉండే ఉంటుంది. ఎక్క‌డో ఒక చిన్న ఆశ ఉంటుంది. సినిమాకి సంభందించిన ఏదైన ప‌ని చేయ‌గ‌ల‌మా అని. సినిమా అంటే అంత ఇష్టం మన ఇండియ‌న్స్‌కి అందులోనూ మ‌న తెలుగు వాళ్ల‌కి. మా ఈ ‘సినిమా బండి’ సినిమా లవర్స్‌ అందరి కోసం. పదిమంది స్నేహితులు కలిసి ఈ  ఇండిపెండెంట్‌ సినిమాను చేశారు. ఈ సినిమా కోసం వీరిలో కొందరు యాక్టర్స్‌గా కూడా మారారు’’ అన్నారు రాజ్ అండ్ డీకే. ఈ సినిమాను ప్రవీణ్‌ కంద్రెగుల డైరెక్ట్ చేయగా, వసంత మరిగంటి ఈ సినిమాకి ర‌చ‌న చేశారు. ఈ చిత్రంలో వికాస్‌ వశిష్ఠ, వారణాసి సందీప్‌ కుమార్, రాగ్‌ మయూర్, ఉమా వైజి, సింధు శ్రీనివాసమూర్తి, సిరివెన్నెల, త్రిషర ప్రధాన పాత్రలు పోషించారు.
"సినిమా బండి" కథ:
ఓ ఆటోడ్రైవర్‌కు కెమెరా దొరుకుతుంది. ఆ కెమెరాతో తాను తన గ్రామంలో, తన స్నేహితులతో ఓ సినిమా తీయాలనుకుంటాడు. కానీ అతనికిగానీ, అతని స్నేహితులకు కానీ సినిమాను ఎలా తీస్తారో తెలియదు. కానీ ఎన్నో సినిమాలను చూసిన వారి అనుభవం, వారికి దొరికిన కెమెరా సినిమా తీయాలనే తపన వారి సంకల్పాన్ని ముందుకు తీసుకెళుతుంది. ఈ ప్రయాణంలో ఆ ఆటోడ్రైవర్‌ ఎదుర్కున్న పరిణామాలు, ఆ గ్రామంలో జరిగిన సంఘటనలు అన్నీ వినోదాత్మకంగా బాగుంటాయి. వారి అమాయకత్వం, సినిమా చేయాలనే వారి ఆసక్తి చూసే వీక్షకులకు బాగా నచ్చుతుంది.
ఎప్పటికప్పుడు కొత్తరకమైన కంటెంట్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటారు రాజ్‌ అండ్‌ డీకే ద్వయం. వారు  ‘గో గోవా గాన్‌’ వంటి జాంబీ ఫిల్మ్, ‘స్త్రీ’ వంటి బ్లాక్‌బాస్టర్‌ సినిమాల‌ను చేశారు. ప్ర‌స్తుతం షాహిద్‌ కపూర్, విజయ్‌సేతుపతి న‌టిస్తున్న‌ ఓ వెబ్‌సిరీస్‌ను డైరెక్ట్‌ చేస్తున్నారు. అలాగే సూపర్‌హిట్‌ వెబ్‌సిరీస్‌ ‘ది ఫ్యామిలీమేన్‌’ వెబ్‌సిరీస్‌ సెకండ్‌ సీజన్‌ను రెడీ చేస్తున్నారు రాజ్‌ అండ్‌ డీకే.

డైరెక్టర్‌: ప్రవీణ్‌ కంద్రెగుల
నిర్మాతలు: రాజ్‌ అండ్‌ డీకే
కథ: వసంతమరింగంటి
స్క్రీన్‌ ప్లే: ప్రవీణ్‌ కంద్రెగుల, వసంతమరింగంటి, కృష్ణ ప్రత్యూష
సినిమాటోగ్రాఫర్స్‌: అపూర్య సాలిగ్రమ్, సాగర్‌ వైవీవీ
ఎడిటర్స్‌: ధర్మేంద్ర కాకరాల ఎఎఫ్‌ఈ, రవితేజ గిరిజాల
మ్యూజిక్‌: శిరీష్‌ సత్యవోలు
సౌండ్‌ సింకరనైజేషన్‌ డిజైన్‌: అక్షయ్‌ పటేల్‌
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌:  విజయ్‌శంకర్ డొంకాడ‌, రాహుల్‌ గాంధీ
లైన్‌ ప్రొడ్యూసర్‌: అఖిల్‌రెడ్డి
అసోసియేట్‌ డైరెక్టర్స్‌: కృష్ణ ప్రత్యూష, కొండురు దీపక్‌ రాజు, వసంత మరింగంటి
అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌: శ్రీనిబాబు ముసిమి, వంశీకృష్ణ కుప్పం, సిద్దార్థ్‌ వర్మ కె, చింతలరాజు, ఎమ్‌ అభిజిత్‌
అసోసియేట్‌ సినిమాటోగ్రాఫర్‌: రోహిత్‌ కొప్పు
కాస్ట్యూమ్‌ డిజైనర్స్‌: సిరివెన్నెల యడమండ్ల, కృష్ణ ప్రత్యూష
ప్రొడక్షన్‌ డిజైనర్స్‌: అఖిల్‌రెడ్డి, కృష్ణ ప్రత్యూష

D2R Indie, Raj & DK’s (Raj Nidimoru and Krishna DK) latest venture in nurturing budding filmmakers, launched the trailer of an independent Telugu comedy drama, Cinema Bandi. The trailer was released exclusively on Netflix India this Friday, and will start streaming on May 14, 2021.

Advertisement
Author Image