For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా క్రైమ్ అనలిటిక్స్ మరియు రిపోర్ట్స్ వింగ్ : సీపీ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్.

12:25 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:25 PM May 13, 2024 IST
తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా క్రైమ్ అనలిటిక్స్ మరియు రిపోర్ట్స్ వింగ్   సీపీ శ్రీ స్టీఫెన్ రవీంద్ర  ఐపీఎస్
Advertisement

సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్‌లోని పరిధిలోని అన్నీ జోన్ల డి‌సి‌పి లు , ఏ‌సి‌పి లు, ఎస్‌హెచ్‌ఓ లు, డి‌ఐ లు, ఎస్‌ఐ లు, డి‌ఎస్‌ఐ లు, అన్ని పోలీస్ స్టేషన్‌లలోని బ్ల్యూ కోల్ట్, పాట్రోల్ మొబైల్ , సి‌సి‌ఎస్, క్రైమ్స్ సిబ్బంది తదితర అధికారులతో ఈరోజు i.e. 04.10.2022 సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., గారు క్రైమ్స్ డీసీపీ శ్రీ కల్మేశ్వర్ సింగన్వర్, ఐపీఎస్., మరియు పి‌ఎస్‌ఐ‌ఓ‌సి ఏ‌సి‌పి రవీందర్ గార్ల ఆధ్వర్యంలో ‘క్రైమ్ అనలిటిక్స్ మరియు రిపోర్ట్స్’ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈరోజు సమావేశంలో సీపీ గారు సైబరాబాద్ జోన్లలో పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బంది నేరాల సంఖ్యను తగ్గించే విధంగా క్రైమ్ అనాలసిస్ , నేరాల అంచనా, నేరాలను ఎలా నిరోధించాలి తద్వారా గస్తీ ఏ విధంగా నిర్వహించాలి అనే తదితర అంశాలపై చర్చించడం జరిగింది.

Advertisement GKSC

ఈ సందర్భంగా సీపీ గారు మాట్లాడుతూ.. నేరాలు జరగకుండా ప్రతి ఒక్కరూ నేర నియంత్రణ లో తప్పనిసరి అనుసరించవలసిన చర్యలను తీసుకోవాలని సూచించారు. జరుగు నేరాల పట్ల త్వరగా స్పందించి, కేసు నమోదు చేసి నాణ్యతతో కూడిన దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు.

క్రైమ్ హాట్ స్పాట్ లను ఎలా నియంత్రించలి, క్రైమ్ ప్రోన్ ఏరియాలను, యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాలను గుర్తించి నివారణ మార్గాలను చేపట్టదానికి వివిద అప్ప్లికేషన్ల ద్వారా నేరాలను నియంత్రించాలని సూచించారు.

ప్రతి పోలీస్ స్టేషన్లో నేర నియంత్రణ కోసం అనుసరించవలసిన, రూట్ కాస్ అనాలసిస్, రిపోర్ట్ అనాలసిస్ గురించి పోలీస్ స్టేషన్లలో ఉండే సెక్టార్ డి‌ఐ, డి‌ఎస్‌ఐ, సెక్టార్ ఎస్ఐలకు మరియు క్రైమ్ సిబ్బందికి నేర నివారణ అంశాలను తెలియజేశారు.

తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా క్రైమ్ అనలిటిక్స్ మరియు రిపోర్ట్స్ వింగ్ అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పరిచామన్నారు. ప్రతిరోజు క్రైమ్ ఎనాలసిస్ రిపోర్ట్ తయారు చేసి ప్రతి పోలీస్ స్టేషన్లకు పంపించి, ఈ రిపోర్టు ఆధారంగా నేర నియంత్రణ చర్యలను చేపట్టవలసిన వీలుంటుంద్దన్నారు.

ఈ సమావేశంలో క్రైమ్స్ డీసీపీ శ్రీ కల్మేశ్వర్ సింగన్వర్, ఐపీఎస్., మాదాపూర్ డీసీపీ శ్రీమతి శిల్పవల్లి, బాలానగర్ డీసీపీ సందీప్, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, ఏసీపీ లు, ఇన్‌స్పెక్టర్లు, డీఐ లు, ఎస్‌ఐ లు మరియు ఇతర పోలీసు సిబ్బంది ఉన్నారు.

Advertisement
Author Image