For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

ప‌నితీరు బేష్‌.. సేవ‌ల్లో శ‌భాష్‌

03:13 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 03:13 PM May 11, 2024 IST
ప‌నితీరు బేష్‌   సేవ‌ల్లో శ‌భాష్‌
Advertisement

సైబరాబాద్ పోలీసులు పనితీరు భేష్: డీజీపీ శ్రీ మహేందర్ రెడ్డి, ఐపీఎస్ , క్రైమ్ రివ్యూ అండ్ ఫంక్షనల్ వర్టికల్స్ లో సైబరాబాద్ టాప్ -నేరాల నియంత్ర‌ణ‌, పోలీసు దర్యాప్తు, ఫంక్షనల్ వర్టికల్స్ పై తెలంగాణ రాష్ట్ర డీజీపీ సమీక్ష సమావేశం

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆల్ యూనిట్ ఆఫీసర్లతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ మహేందర్ రెడ్డి, ఐపీఎస్., గారు ఈరోజు క్రైమ్స్ రివ్యూ అండ్ ఫంక్షనల్ వర్టికల్స్ సమావేశం నిర్వహించారు.

Advertisement GKSC

ఇందులో భాగంగా ఫంక్షనల్ వర్టికల్స్ లో సైబరబాద్ పోలీస్ కమిషనరేట్ టాప్ లో నిలిచిందని డీజీపీ శ్రీ మహేందర్ రెడ్డి గారు., సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., గారిని మరియు సిబ్బందిని అభినందించారు.

సైబరబాద్ 14 ఫంక్షనల్ వర్టికల్స్ (రిసెప్షన్, Blue Colts, Station writer, Tech team, Court duty ificers, Warrants, Admin SI, DI, DSIs, Sector SI, Crime Writers, Traffic, Trainings, HRMS, Cyber Crimes లలో టాప్ లో నిలిచిందన్నారు. లాంగ్ పెండెన్సీ కేసులను త్వరితగతిన పరిష్కరించడం, గ్రేవ్ కేసులను తగ్గించడంలో, మహిళలు మరియు చిన్నారులకు సంబంధించిన నేరాలను తగ్గించడం, పోక్సో కేసుల పరిష్కారం, వారెంట్ల జారీ, ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ క్రైమ్ వంటి వాటిల్లో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ నంబర్ 1 స్థానంలో ఉందని డీజీపీ గారు జోనల్ డీసీపీ లను, క్రైమ్స్ డీసీపీ లను, ఎస్ హెచ్ ఓ లను అభినందించారు.

ఫంక్షనల్ వర్టికల్స్ లో సైబరాబాద్ పనితీరు రాష్ట్రంలోనే ఉత్తమ స్థానానికి చేరుకునే విధంగా కృషిచేసిన ఫంక్షనల్ వర్టికల్స్ అధికారులందరినీ అభినందించారు.

ఈ సమావేశంలో సైబరాబాద్ నుంచి జాయింట్ సీపీ అవినాష్ మహంతి, ఐపీఎస్., క్రైమ్స్ డీసీపీ శ్రీ కల్మేశ్వర్ సింగన్వర్, ఐపీఎస్., డీసీపీ ట్రాఫిక్ శ్రీనివాస్ రావు, మాదాపూర్ డీసీపీ శ్రీమతి శిల్పవల్లి, బాలానగర్ డీసీపీ సందీప్, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, డీసీపీ శ్రీమతి కవిత, డీసీపీ శ్రీమతి ఇందిర, ఏసీపీ రవిచంద్ర, ఏసీపీ లు, ఫంక్షనల్ వర్టికల్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Author Image