For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Cyberabad Police News: సైబరాబాద్ లో ‘గ్రీవెన్స్ సెల్’ సమీక్షా సమావేశం

07:41 PM Oct 28, 2021 IST | Sowmya
Updated At - 07:41 PM Oct 28, 2021 IST
cyberabad police news  సైబరాబాద్ లో ‘గ్రీవెన్స్ సెల్’ సమీక్షా సమావేశం
Advertisement

సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో డీసీపీలు, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది తో ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., గ్రీవెన్స్ సెల్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీ గారు మాట్లాడుతూ.. పోలీసుల సమస్యల పరిష్కారానికి సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో గ్రీవెన్స్ సెల్ ను ఏర్పాటు చేసిన విషయం విధితమేనన్నారు. కాగా సిబ్బంది నుంచి గ్రీవెన్స్ సెల్ కు మంచి స్పందన వస్తుందన్నారు. గతవారం గ్రీవెన్స్ సెల్ కు వచ్చిన ఫిర్యాదులు పరిష్కారంపై సీపీ సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ఈవారం వచ్చిన ఫిర్యాదులను, పెండింగ్ ఫైల్స్ ను త్వరితగతిన క్లియర్ చేయాలన్నారు.

Advertisement GKSC

ఈరోజు ముఖ్యంగా సేవా పథకాల ప్రపోజల్స్, ఫంక్షనల్ వెర్టికల్స్ తదితర అంశాలు చర్చకు వచ్చాయి. సీఏఓ లు, సెక్షన్ సూపరింటెండెంట్లు ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించాలన్నారు. సిబ్బందికి సమస్యలుంటే ఉంటే గ్రీవెన్స్ సెల్(8333993272) ద్వారా తన దృష్టికి తీసుకురావాలన్నారు.

ఈ సమావేశంలో సైబరాబాద్ శంషాబాద్ డీసీపీ ఎన్. ప్రకాష్ రెడ్డి, ఐపీఎస్., క్రైమ్స్ డీసీపీ శ్రీమతి రోహిణీ ప్రియదర్శినీ, ఐపీఎస్., విమెన్& చిల్డ్రన్ సేఫ్టీవింగ్ డీసీపీ శ్రీమతి అనసూయ, బాలానగర్ డీసీపీ శ్రీమతి పద్మజా, సిఆర్ హెడ్ క్వార్టర్ ఏడీసీపీ ఎండీ రియాజ్ ఉల్ హక్, ఏసీపీ మట్టయ్య, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ చంద్రకళ, చీఫ్ అడ్మిన్ ఆఫీసర్ గీత, వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.

Cyberabad Police Grievance Cell Review Meeting,Telangana Police News,CP M. Stephen Raveendra ips,v9 news telugu,telugu golden tv,my mix entertainments,www.teluguworldnow.com.1

Advertisement
Author Image