For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

సైబరాబాద్ లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం

11:44 AM Jun 02, 2024 IST | Sowmya
Updated At - 11:46 AM Jun 02, 2024 IST
సైబరాబాద్ లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
Advertisement

సైబరాబాద్ పోలీసు కమీషనరేట్ ప్రాంగ‌ణంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యఅతిథిగా హాజ‌రైన అవినాష్ మహంతి, ఐపీఎస్., జాతీయ జెండాను ఆవిష్క‌రించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ… ముందుగా అందరికీ తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 2014, జూన్ 2న, అధికారికంగా ఏర్పడిందన తెలంగాణ రాష్ట్రం నేటితో పదేళ్లు పూర్తి చేసుకుందన్నారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేయడంలో పోలీస్ శాఖ సిబ్బంది మనస్ఫూర్తిగా కర్తవ్య నిర్వహణ చేయాలని ఆయన కోరారు.

Advertisement GKSC

ఈ కార్యక్రమానికి సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, ఐపీఎస్., సైబరాబాద్ జాయింట్ సీపీ ట్రాఫిక్ డి. జోయెల్ డేవీస్, ఐపీాఎస్., మాదాపూర్ డీసీపీ డా. జి. వినీత్, ఐపీఎస్., శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి, ఐపీఎస్., బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు, ఐపీఎస్., రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్, ఐపీఎస్., మేడ్చల్ డీసీపీ నితికా పంత్, ఐపీఎస్., సైబరాబాద్ డీసీపీ క్రైమ్స్ నర్సింహా కొత్తపల్లి, డీసీపీ EOW కె. ప్రసాద్, ఉమెన్ & చైల్డ్ సేఫ్టీ డీసీపీ సృజన కర్ణం, ఎస్‌బి డీసీపీ సాయి శ్రీ, మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీ డివి శ్రీనివాసరావు, ఐపీఎస్., లా అండ్ ఆర్డర్ డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీలు, సిఏఓ అడ్మిన్ గీత, సిఏఓ అకౌంట్స్ చంద్రకళ, ఇన్స్పెక్టర్లు, మినిస్టీరియల్ స్టాఫ్ మరియు ఇతర సిబ్బంది హాజరయ్యారు.

Advertisement
Author Image