For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

CYBERABAD NEWS: ట్రాఫిక్ సిబ్బందితో సైబరాబాద్ సీపీ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్. సమావేశం

06:24 AM Sep 04, 2021 IST | Sowmya
Updated At - 06:24 AM Sep 04, 2021 IST
cyberabad news  ట్రాఫిక్ సిబ్బందితో సైబరాబాద్ సీపీ శ్రీ స్టీఫెన్ రవీంద్ర  ఐపీఎస్  సమావేశం
Advertisement

Cyberabad CP Steffen Ravindra Meeting With Traffic Officer's Team, Cyberabad Police News, Cyberabad Media, Telangana News, Telugu World Now,

CYBERABAD NEWS: *ట్రాఫిక్ సిబ్బందితో సైబరాబాద్ సీపీ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., సమావేశం*

Advertisement GKSC

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని ట్రాఫిక్ సమస్యలపై ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీ ఎస్ ఎమ్ విజయ్ కుమార్, ఐపీఎస్., కూకట్పల్లి, శంషాబాద్, బాలానగర్ ట్రాఫిక్ ఏసీపీలు, ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ గారు ఇబ్బందిని అడిగి ముఖ్యంగా కమీషనరేట్లోని ట్రాఫిక్ సమస్యలకు అడిగి తెలుసుకున్నారు.

గణేష్ పండుగ దృష్ట్యా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చేయలు చేపట్టాలన్నారు. వర్షాల కారణంగా ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యలపై దృష్టి సారించాలన్నారు. యాక్సిడెంట్ లు జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రమాదాలు జరగకుండా చేయలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో తలెత్తే అత్యవసర ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు భద్రత వంటి అంశాలను ముందస్తుగా ఊహించి అందుకనుగుణంగా తగు చర్యలు చేపట్టాలన్నారు. అలాగే ఐటీ & ఐటీఎస్ కంపెనీలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ట్రాఫిక్ సాఫీగా ఉండేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి సిబ్బంది వినూత్న విధానాలను అవలంబించేందుకు కృషి చేయాలన్నారు.

Cyberabad CP Steffen Ravindra Meeting With Traffic Officer's Team, Cyberabad Police News, Cyberabad Media, Telangana News, Telugu World Now,ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., డీసీపీ ట్రాఫిక్ శ్రీ ఎస్ ఎమ్ విజయ్ కుమార్, ఐపీఎస్., ఏడీసీపీ శంకర్ నాయక్, బాలానగర్ ట్రాఫిక్ ఏడీసీపీ శ్రీనివాస్ రెడ్డి, శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ విశ్వప్రసాద్, కూకట్పల్లి ఏసీపీ హనుమంత రావు, ఏసీపీ సంతోష్ కుమార్, ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Cyberabad CP Steffen Ravindra Meeting With Traffic Officer's Team, Cyberabad Police News, Cyberabad Media, Telangana News, Telugu World Now,

Advertisement
Author Image