For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

నిర్విఘ్నంగా గణేష్ నిమజ్జనం : సైబరాబాద్ సీపీ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్

07:31 PM Sep 28, 2023 IST | Sowmya
Updated At - 07:31 PM Sep 28, 2023 IST
నిర్విఘ్నంగా గణేష్ నిమజ్జనం   సైబరాబాద్ సీపీ శ్రీ స్టీఫెన్ రవీంద్ర  ఐపీఎస్
Advertisement

సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో జరిగే గణేష్ నిమజ్జనాల సరళిని ఈరోజు Public Safety Integrated Operation Centre (PSIOC) ద్వారా సైబరాబాద్ సీపీ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., గారు పర్యవేక్షించారు. ఇప్పటికే పలుమార్లు సీపీ గారు ఆయా జోన్ అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటించారు. గణేశ్ నిమజ్జనం ముందస్తుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం జరిగే విధంగా అధికారులకు తగు సూచనలు కూడా జారీచేశారు.

సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో జరిగే గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. ఇప్పటివరకూ రాజేంద్రనగర్ జోన్ లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పత్తికుంట చెరువు/Baby Pond, మాదాపూర్ జోన్ లోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గంగారం చెరువును మరియు బాలానగర్ జోన్ లోని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న IDL చెరువు ఇతర చెరువులు వద్ద నిమజ్జన సరళిని సందర్శించారన్నారు. సైబరాబాద్ లో భద్రతకు సంబంధించి 4500 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. భద్రత దృష్ట్యా కమీషనరేట్ పరిధిలో డ్రోన్లకు అనుమతి లేదని సీపీ గారు తెలిపారు. PSIOC నుండి CCTVల ద్వారా మొత్తం నిమజ్జన ప్రక్రియను పర్యవేక్షిస్తున్నామన్నారు.

Advertisement GKSC

ప్రభుత్వపరంగా వివిధ శాఖల అధికారులంతా సమన్వయంతో పని చేస్తున్నారన్నారు. సైబరాబాద్ పోలీసులు ఇతర డిపార్ట్మెంట్ లతో కలిసి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. ప్రధానంగా GHMC, TSSPDCL, R&B, Road Transport, Fire Services, Irrigation, Medical and Health department లు కలిసి సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు.

సైబరాబాద్‌లో కమీషనరేట్ పరిధిలో ఈ ఏడాది 10,979 పైగా వినాయకులను ప్రతిష్టించారన్నారు. మాదాపూర్‌లో జోన్-1712, బాలానగర్ జోన్-3331, రాజేంద్రనగర్ జోన్-2112, మేడ్చల్ జోన్- 1912 & శంషాబాద్ జోన్-1912 విగ్రహాలు ప్రతిష్టించారన్నారు. ఈరోజు 4474 విగ్రహాలను నిమజ్జనం చేస్తారన్నారు. అందులో ఎక్కువగా కూకట్‌పల్లిలోని IDL చెరువులో 281 విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ఏర్పాటు చేశామన్నారు.

సైబరాబాద్ కమీషనరేట్ నుంచి హుస్సేన్‌ సాగర్‌ ట్యాంక్‌బండ్‌ కు మొత్తం 32 గణేశ్ విగ్రహాలను... రాజేంద్రనగర్‌ జోన్ నుంచి - 21, బాలానగర్‌ జోన్ - 02, మాదాపూర్‌ - 05, మేడ్చల్ - 03, మరియు శంషాబాద్ జోన్ - 01 నిమజ్జనం చేయనున్నారన్నారు. సైబరాబాద్‌లో మొత్తం (34) చెరువులు ఉన్నాయన్నారు, వాటిలో GHMC పరిధిలో - 26 చెరువులు, మేడ్చల్ కలెక్టరేట్ పరిధిలో -12 (06 బేబీ పాండ్స్ సహా) చెరువులు, రంగారెడ్డి కలెక్టరేట్ పరిధిలో -21 (08 బేబీ పాండ్స్ సహా) చెరువులు మరియు సంగారెడ్డి కలెక్టరేట్-01 (బేబీ పాండ్) ఉన్నాయన్నారు. కమీషనరేట్ పరిధిలో గణేశ్ నిమజ్జనం కోసం మొత్తంగా 44 స్టాటిక్ క్రేన్లు ఏర్పాటు చేశామని సీపీ గారు తెలిపారు.

పౌరులకు సైబరాబాద్ పోలీసుల సూచనలు :

- గణేష్ నిమజ్జనం వైభవంగ జరపుకోవటానికి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌ పరిధిలోని వాహనదారులకు మరియు ప్రజలకు ఈ క్రింది సూచనలు జారీ చేయడమైనది.

- నిమజ్జనం జరిగే చెరువుల వద్ద CCTV ల పర్యవేక్షణ ఉంటుందన్నారు.

- పౌరులు పోలీసులకు సహకరించాలని కోరారు.

- చిన్నారులు, వృద్ధుల పట్ల జాగ్రత్త వహించాలి.

- పౌరులు తమ వాహనాలను నిర్దేశిత ప్రాంతాల్లో పార్క్ చేసుకోవాలి. ఎవరి వస్తువుల పట్ల వారు జాగ్రత్త వహించాలి.

- పౌరులు సోషల్ మీడియాలో వచ్చే ఎలాంటి పుకార్లను నమ్మవద్దు మరియు వ్యాప్తి చేయవద్దు. ఈ విషయంలో Whatsapp గ్రూప్ అడ్మిన్లు జాగ్రత్తగా వహించాలి.

- చెరువుల వద్ద ప్రత్యేకంగా తర్ఫీదునిచ్చిన సిబ్బందిని భద్రత కోసం నియమించామన్నారు.

- ఏదైనా సాయం కోసం పోలీసుల సహాయాన్ని అడగడానికి సంకోచించకండి. నిమజ్జన సమయంలో మహిళలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే సైబరాబాద్ షీ టీమ్స్ హెల్ప్ లైన్ నంబర్ 9490617444కు కాల్ చేయగలరు.

- పౌరులకు ఏదేని అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే దయచేసి సైబరాబాద్ పోలీసులకు తెలియజేయండి. డయల్ -100 లేదా సైబరాబాద్ పోలీసుల Whatsapp నంబర్ -94906 17100కు తెలియజేయగలరు.

Advertisement
Author Image