ఏఆర్ పీసీని అభినందించిన సైబరాబాద్ సీపీ
12:27 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:27 PM May 13, 2024 IST
Advertisement
సైబరాబాద్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో ఏఆర్ పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ఘనపురం సుదర్శన్ పీహెచ్డీ సాధించినందుకు గాను ఈరోజు సైబరాబాద్ సీపీ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., గారు అభినందించారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం అంతారం గ్రామానికి చెందిన ఘనపురం సుదర్శన్, ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ లో ప్రొఫెసర్ సాగి కమలాకర శర్మ గారి పర్యవేక్షణలో '' తెలంగాణ జాతీయోద్యమ కథా సాహిత్యం" అనే అంశంపై పీహెచ్డీ చేశారు.
ఈ సందర్భంగా ఏఆర్ పీసీ సుదర్శన్ మర్యాదపూర్వకంగా సిపి గారిని కలిశారు. భవిష్యత్తులో మరింత ఉన్నత విజయాలు సాధించాలని సిపి గారు ఏఆర్ పీసీని అభినందించి క్యాష్ రివార్డు అందజేశారు.
ఈ సందర్భంగా సుదర్శన్ మాట్లాడుతూ... తాను గతంలో సురక్ష మరియు ఇతర పోలీసు మ్యాగజీన్ లకు పలు వ్యాసాలను, కథలను రాశానని తెలిపారు.
Advertisement
