For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

పోలీసు సిబ్బంది పనితీరు, సామాన్య ప్రజలకు అందిస్తున్న సేవలను సమీక్షించిన కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపిఎస్

06:23 PM Mar 07, 2025 IST | Sowmya
Updated At - 06:23 PM Mar 07, 2025 IST
పోలీసు సిబ్బంది పనితీరు  సామాన్య ప్రజలకు అందిస్తున్న సేవలను సమీక్షించిన కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపిఎస్
Advertisement

Rachakonda News : కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపిఎస్ గారు మాట్లాడుతూ... విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నామని, సైకిల్ పెట్రోలింగ్ వంటి విధానాల ద్వారా స్థానిక ప్రజలతో మమేకమై సైబర్ సెక్యూరిటీ, రోడ్ సేఫ్టీ, డ్రగ్ అవేర్నెస్, మహిళా భధ్రత వంటి అంశాల మీద ప్రజలలో మరింతగా అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది మరియు మహిళా సిబ్బందికి ప్రత్యేక వసతులతో కూడిన అత్యాధునిక నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని త్వరలోనే నిర్మిస్తామని, ఇప్పటికే భవన నిర్మాణానికి సంబంధించి స్థల కేటాయింపు పూర్తయిందని, త్వరలోనే నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులను, కేసుల దర్యాప్తు ప్రగతిని పరిశీలించడంతో పాటు రిసెప్షన్, పెట్రోలింగ్ స్టాఫ్ వంటి పలు విభాగాల పనితీరు, సీసీటీవీల నిర్వహణ వంటి అంశాలను సమీక్షించారు. సమస్యాత్మక ప్రాంతాల సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళా భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిపి యాదాద్రి రాజేష్ చంద్ర, ఐపీఎస్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement GKSC

Advertisement
Author Image