For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

టీకా తీసుకున్నా కరోనా రావొచ్చట...!!

12:30 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:30 PM May 13, 2024 IST
టీకా తీసుకున్నా కరోనా రావొచ్చట
Advertisement

జలుబు, దగ్గు, జ్వరంలాంటి అనారోగ్యాలు మనల్ని బాధిస్తూంటే మనం ఏవైనా టాబ్లెట్లు వేసుకుంటాం, మరీ అవసరమైతే ఇంజెక్షన్ తీసుకుంటాం. ఎందుకూ, తగ్గాలని. అయితే, టీకా మాత్రం ఎందుకు తీసుకుంటామంటే అనేక పెద్ద అనారోగ్య సమస్యలు భవిష్యత్తులో మనల్ని దరిచేరకూడదని. పసిపిల్లలుగా వుండగానే టీకాలను ఇప్పించడానికి కారణం అదే...! వారిని భవిష్యత్తులో ఏ అనారోగ్య సమస్యలూ బాధించకూడదని.

కానీ, టీకా తీసుకున్నా అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం లేకపోలేదంటే అది ఆందోళన కలిగించే విషయమే గదూ...! కరోనా టీకా తీసుకున్నా, ఇప్పటికే కరోనా బారిన పడి కోలుకున్నా ఇక మీదట తమకు కరోనా రిస్క్ ఉండదనుకుంటే అది పొరబాటేనంటున్నారు నిపుణులు. కరోనా టీకా తీసుకున్నా వైరస్ ఇన్ఫెక్షన్ బారిన పడే రిస్క్ లో ఎలాంటి వ్యత్యాసం ఉండదు. కాకపోతే, దీని బారిన పడినా, ఇతరులతో పోలిస్తే వీరికి అదనపు రక్షణ ఉంటుందని చెప్పవచ్చు. బ్రిటన్ కు చెందిన జో కోవిడ్ అనే సంస్థ ఇటీవలే ఒక సర్వే నిర్వహించి ఫలితాలు విడుదల చేసింది. కరోనా టీకాలు తీసుకున్న వారు కరోనా వైరస్ కు గురైనప్పుడు ఐదు ప్రధాన లక్షణాలను గుర్తించి వివరాలు వెల్లడించింది.

Advertisement GKSC

విడవకుండా దగ్గు వస్తుంది. ఎక్కువ రోజుల పాటు అదే పనిగా దగ్గు రావడం వల్ల మగతగా అనిపిస్తుంది. అలసటతో రోజువారీ పనులు చేయడం కూడా కష్టంగా మారొచ్చు. హెర్బల్ కాఫ్ సిరప్ లు, అల్లంతో చేసిన టీతో ఉపశమనం లభిస్తుంది. ముక్కు కారడం కూడా కరోనా వైరస్ లో లక్షణమే అని ఈ సర్వే ప్రకటించింది. కరోనా తొలి నాళ్లల్లోనూ ఈ లక్షణం కనిపించిన విషయం తెలిసిందే. టీకాలు తీసుకున్న వారిలోనూ ఇది కనిపిస్తుంది. ఎందుకంటే శ్వాస కోస వ్యవస్థకు సంబంధించి బయటకు కనిపించే తొలి లక్షణం ఇది.

కరోనాలో ముక్కు మూసుకుపోయే లక్షణం కనిపించొచ్చు. దీంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ సమయంలో వేడి నీటి ఆవిరి పట్టడం మంచి చర్య అవుతుంది. నాసల్ స్ప్రేల కంటే కూడా దీంతో మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

కరోనా తొలి రెండు విడతల్లో ఎక్కువ మందిలో కనిపించిన లక్షణం ఇది. గొంతు నొప్పి, మంటతో చాలా మంది ఇబ్బంది ఎదుర్కొన్నారు. కరోనా టీకా తీసుకున్న వారిలోనూ ఈ లక్షణం కనిపిస్తుంది. గొంతు నొప్పి/మంట, దగ్గు, ముక్కు కారడం, మూసుకుపోవడంలో ఒకటి రెండు లక్షణాలు లేదంటే అన్నింటితోపాటు తలనొప్పి కూడా ఉంటే అది కరోనానే అయి ఉండొచ్చు. శ్వాస సరిగ్గా ఆడకపోవడం వల్ల వచ్చే తలనొప్పి ఇది. అందుకే, ఇలాంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త వహించడం మనకే మంచిది.

Advertisement
Author Image