For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

AP NEWS: లొక్డౌన్ సమయంలో మూగ జీవాలకు చేయూతగా కందుల ఓబుల రెడ్డి హాస్పిటల్

02:59 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 02:59 PM May 11, 2024 IST
ap news  లొక్డౌన్ సమయంలో మూగ జీవాలకు చేయూతగా కందుల ఓబుల రెడ్డి హాస్పిటల్
Advertisement

Corona 2nd Lockdown News, Kandula Obula Reddy Hospital Helped to Animals, Covid News, AP News, Markapur, Prakasam District,

AP NEWS: లొక్డౌన్ సమయంలో మూగ జీవాలకు చేయూతగా ! వాటి ఆకలి తీరుస్తున్న కందుల ఓబుల రెడ్డి హాస్పిటల్ యాజమాన్యం !!

Advertisement GKSC

లొక్డౌన్ సమయంలో అన్ని హోటల్స్ భోజనశాలలు , కూరగాయల మార్కెట్ మరియు ఇతర ఆహార లభ్యమయ్యే సదుపాయాలు కొన్ని మూసివేయగా మరికొన్ని కేవలం మధ్యాహ్నం 12 గంటలవరకు మాత్రమే తెరిచివుండటం వలన టవర్ క్లోక్ , దోర్నాల సెంటర్ , కంభం బస్టాండ్ సెంటర్ తదితర ప్రదేశాలలో మూగజీవాలు ముఖ్యముగా ఆవులు , గేదలు , ఎద్దులు ఆహారం దొరక్క ఎంతో యాతన అనుభవిస్తున్నవి !

గత 10 రోజుల నుండి ప్రతిరోజూ రాత్రి వేళల్లో కందుల ఓబుల రెడ్డి హాస్పిటల్ సిబ్బంది వాటికి పండ్లు , కూరగాయలు , ధాన్యం ఏర్పాటు చేస్తున్నారు, బయట పండ్లు కూరగాయలు కొనుగోలు చేస్తున్నామని, కొంత దాతలు సహకరిస్తున్నారని ఓబుల రెడ్డి హాస్పిటల్ చైర్మన్ డా కందుల గౌతమ్ నాగి రెడ్డి గారు తెలియజేసారు !

ఈ రోజు బొమ్మలాపురం గ్రామం నుండి రైతు అమ్మిరెడ్డి రమణ రెడ్డి గారు మరియు కాసా రఘునాధరెడ్డి గారు ( దోర్నాల ) నుండి హాస్పిటల్ చైర్మన్ డా. కందుల గౌతమ్ నాగి రెడ్డి గారికి 120 అరటి గెలలు అందజేశారు. అటువంటి దాతల సహకారం మరువలేనిది. ప్రతిరోజూ లొక్డౌన్ సమయం ముగిసే వరకు, టవర్ క్లోక్, దోర్నాల & కంభం బస్టాండ్ సమీపం లోని మూగజీవాలకు పండ్లు కూరగాయలు తదితర ఆహారం అందజేస్తామని గౌతమ్ నాగి రెడ్డి తెలిపారు. మానవతా దృక్పధంతో అందరూ సహకరిస్తున్నారని, హాస్పిటల్ స్టాఫ్ చాలా బాగా సహకరిస్తూ రాత్రి వేళల్లో మూగజీవాలకు సేవ చేస్తున్నారని వారికీ మరియు దాతలకు ప్రత్యేకంగా డా. గౌతమ్ ధన్యవాదములు తెలియజేసారు !!

Advertisement
Author Image