For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Decision Anxiety: నిర్ణయాలు తీసుకొనేటప్పుడు ,తీవ్రంగా ఆంధోళన పడుతున్నారా.. ధానిని ఎదురుకోవడానికి పరిష్కారం ఇప్పుడు మీకోసం

08:33 PM May 26, 2023 IST | Sowmya
Updated At - 08:33 PM May 26, 2023 IST
decision anxiety  నిర్ణయాలు తీసుకొనేటప్పుడు  తీవ్రంగా ఆంధోళన పడుతున్నారా   ధానిని ఎదురుకోవడానికి పరిష్కారం ఇప్పుడు  మీకోసం
Advertisement

Decision Anxiety : కొన్ని విషయాలను అతిగా విశ్లేషించినప్పుడు ఒకపట్టాన ఒక నిర్ణయానికి రాలేనప్పుడు ఆందోళన పరిస్ధితి చాలా మందిలో నెలకొంటుంది. నిర్ణయం తీసుకునే విషయంలో ఆందోళన పెరిగితే అతి సులభమైన నిర్ణయాలు తీసుకోవడం కూడా కష్టతరంగా మారుతుంది. ఆంధోళన కారణం గా నిర్ణయం తీసుకోవడం లో మన మీద మనం కాన్ఫిడంట్ కోల్పోతాము .
చాలా మంది సాధారణ నిర్ణయాలు తీసుకోవడానికి కష్టపడుతుంటారు. ప్రతి విషయాన్ని అతిగా విశ్లేషిస్తుంటారు. అన్ని కోణాలను పట్టి చూస్తుంటారు. దీంతో ఆందోళన నెలకొంటుంది. ఆందోళన, ఆత్రుత కారణంగా నిర్ణయం తీసుకునే ప్రక్రియ క్లిష్టతరంగా మారిపోతుంది.

అవగాహన: ఏదైనా సమస్య విషయంలో పరిష్కారానికి వచ్చే ముందు, ఆందోళనకు మూలకారణాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ ఆందోళనకు కారణమయ్యే వాటి గురించి మరింత అవగాహన అవసరం. అప్పుడే మనం దాన్ని ఎదుర్కోగలుగుతాం.
ఆందోళన తీవ్రంగా ఉన్నప్పుడు : ఆందోళన తీవ్రంగా ఉన్నప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం ఉత్తమం. అది ఆందోళనను మరింత ఎక్కువ చేస్తుంది. మరింత ఇబ్బందిని కలిగిస్తుంది. మనల్ని మనం శాంతింపజేసుకున్న తరువాతనే నిర్ణయం తీసుకునే విషయంలో ముంగిపుదశకు చేరుకోవాలి.

Advertisement GKSC

లాభాలు, నష్టాలు: నిర్ణయం తీసుకోవడం చాలా కష్టంగా ఉన్నప్పుడు, మన నిర్ణయంపై ఆధారపడిన విషయాల గురించి లాభాలు , నష్టాల జాబితాను తయారు చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల మరింత స్పష్టత వస్తుంది. ఇది నిర్ణయం తీసుకోవడంలో మీకు సహాయపడుతుంది.
విలువలు : మనం నిర్ణయం తీసుకోవడానికి ఇబ్బందిపడుతున్నప్పుడు, మనం పాటించే విలువలు, నైతికతలను గుర్తుంచుకోవాలి. నిర్ణయం, విలువలకు అనుగుణంగా ఉన్నప్పుడు, వెంటనే తీసుకోవడం సులభం అవుతుంది.
గడువు: నిర్ణయం తీసుకోవడానికి మనమే గడువు విధించుకోవాలి. ఇది ఒక నిర్దిష్ట సమయ వ్యవధిలో వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి గడువు విధించుకోవటం అన్నది సహాయపడుతుంది.

Advertisement
Author Image