For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Telangana News : పార్లమెంటు ఎన్నికలపై కాంగ్రెస్ ఎన్నారై విభాగం సమీక్ష

06:25 PM Apr 13, 2024 IST | Sowmya
Updated At - 06:25 PM Apr 13, 2024 IST
telangana news   పార్లమెంటు ఎన్నికలపై కాంగ్రెస్ ఎన్నారై విభాగం సమీక్ష
Advertisement

16న సీఎం రేవంత్ రెడ్డితో హైదరాబాద్ లో గల్ఫ్ సంఘాల ప్రతినిధులతో సమావేశం 

రాబోయే పార్లమెంటు ఎన్నికలలో గల్ఫ్ కార్మికుల కుటుంబాలు, ఎన్నారైలు కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూలంగా ఉన్నారని టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ డా. బిఎం వినోద్ కుమార్ అన్నారు. శనివారం హైదరాబాద్ లో జరిగిన సమీక్షలో టీపీసీసీ ఎన్నారై సెల్ పార్లమెంట్ ఎన్నికల కోఆర్డినేటర్ స్వదేశ్ పరికిపండ్లతో నియోజకవర్గాల వారీగా ఉన్న పరిస్థితిని వినోద్ కుమార్ సమీక్షించారు. ఈనెల 16న సీఎం రేవంత్ రెడ్డితో హైదరాబాద్ లో గల్ఫ్ సంఘాల ప్రతినిధులతో సమావేశం ఉన్నదని ఆయన తెలిపారు.

Advertisement GKSC

రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజులలోనే గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన హామీల అమలుకు శ్రీకారం చుట్టడం వలన గల్ఫ్ కార్మికుల కుటుంబాలు ఈ ఎన్నికలలో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని వారు నిర్ధారణకు వచ్చారు. గల్ఫ్ వలసలు అధికంగా ఉన్న నిజామాబాద్, కరీంనగర్ ఆదిలాబాద్, జహీరాబాద్, మెదక్, వరంగల్ ఎంపీ స్థానాలలో గల్ఫ్ ఓటు బ్యాంకు ప్రభావం గణనీయంగా ఉంటుందని ఈ నియోజకవర్గాలలో ఎన్నారై విభాగం బృందం ప్రత్యేక ప్రచార కార్యాచరణ చేపట్టిందని వినోద్ కుమార్ తెలిపారు.

Advertisement
Author Image