For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Gulf News : బీజేపీ ఎంపీ అరవింద్ పై 4 ప్రశ్నలు సంధించిన టీపీసీసీ ఎన్నారై సెల్

Congress has released sensational chargesheet in the name of Gulf labor traitor Gappala Arvind
12:26 AM May 10, 2024 IST | Sowmya
Updated At - 12:26 AM May 10, 2024 IST
gulf news   బీజేపీ ఎంపీ అరవింద్ పై 4 ప్రశ్నలు సంధించిన టీపీసీసీ ఎన్నారై సెల్
Advertisement

2019 లో మాయ మాటలతో గల్ఫ్ కార్మికుల ఓట్లు కొల్లగొట్టి నిజామాబాద్ ఎంపీగా గెలిచిన అరవింద్ గల్ఫ్ కార్మికును మోసం చేశాడని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. "గల్ఫ్ కార్మిక ద్రోహి... గప్పాల అరవింద్" పేరిట టీపీసీసీ ఎన్నారై సెల్, గల్ఫ్ కాంగ్రెస్ నాయకులు సోమవారం గాంధీ భవన్ లో ఒక చార్జిషీట్ ను విడుదల చేశారు.

మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, టీపీసీసీ ఎన్నారై సెల్ నాయకులు మంద భీంరెడ్డి, నంగి దేవేందర్ రెడ్డి, కేరళ ప్రవాసి కాంగ్రెస్ నేత మునీర్ తో కలిసి ఎంపీ అరవింద్ పై చార్జిషీట్ పోస్టర్ ను ఆవిష్కరించారు.

Advertisement GKSC

చార్జిషీట్ లోని నాలుగు ప్రశ్నలకు జవాబు ఇవ్వకపోతే... ఈ పార్లమెంటు ఎన్నికల్లో అరవిందుకు గల్ఫ్ కార్మికుల ఓట్లు అడిగే నైతిక అర్హత ఉండదని కాంగ్రెస్ నాయకులు అన్నారు.

ఎంపీ అరవింద్ పై సంధించిన నాలుగు ప్రశ్నలు : 

★ 2020 సెప్టెంబరు కేంద్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల పొట్టగొడుతూ... కనీస వేతనాలు 30 నుండి 50 శాతం వరకు తగ్గిస్తూ సర్కులర్లు జారీ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కనీసం ఒక వినతిపత్రం కూడా ఇవ్వడం చేతకాని అసమర్ధుడు అరవింద్.

★ 'ప్రవాసి భారతీయ బీమా యోజన' లో సహజ మరణాన్ని చేర్చకుండా గల్ఫ్ కార్మికుల బతుకులతో బీజేపీ ప్రభుత్వం అడుకుంటే... అరవిందుడు కేంద్ర ప్రభుత్వంతో చర్చించకుండా తప్పించుకుంట తిరిగిన 'గల్ఫ్ ద్రోహి'

★ హైదరాబాద్ లో సౌదీ అరేబియా, కువైట్ దేశాల కాన్సులేట్ ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి లెటర్ కూడా రాయటం చేతకాని అజ్ఞాని అరవింద్.

★ కరోనా కష్టకాలంలో... గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు వచ్చిన పేద కార్మికుల రక్తం పిండి రెండింతలు, మూడింతలు విమాన చార్జీలు వసూలు చేసింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. ఫ్రీగా రప్పించాల్సిన కేంద్రం.. అధిక చార్జీలు వసూలు చేయడాన్ని ప్రశ్నించలేని అరవింద్ ఎంపీ పదవికి అనర్హుడు.

Advertisement
Author Image