For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Latest News : రాంగోపాల్ వర్మ పై రాజమండ్రి లో పిర్యాదు .. మత ఉగ్రవాద చర్యలను ప్రేరేపిస్తున్న రాంగోపాల్ వర్మ..

10:48 PM Apr 09, 2025 IST | Sowmya
Updated At - 10:48 PM Apr 09, 2025 IST
latest news   రాంగోపాల్ వర్మ పై రాజమండ్రి లో పిర్యాదు    మత ఉగ్రవాద చర్యలను ప్రేరేపిస్తున్న రాంగోపాల్ వర్మ
Advertisement

Ram Gopal Varma : రోజు రోజు కు రాంగోపాల్ వర్మ (అర్జివి) చేష్టలు శృతిమించి పోతున్నాయి . సామాజిక ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న అర్జివి పై చట్ట పరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ సారథ్యంలో ఈ రోజు రాజమండ్రి లోగల 3 వ పట్టణ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు. ఆర్యాపురం లోగల రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం నుండి పార్టి సెక్యూలర్స్ , శ్రేయోభిలాషులు బారిగా కదలి వెళ్లి రాజమండ్రి 3 వ పట్టణ ఎస్ హెచ్ ఓ వారికి పిర్యాదును అందచేసారు.

రాంగోపాల్ వర్మ కొన్ని మీడియా ఫ్లాట్ ఫామ్స్ ద్వారా అఖండ భారతీయులు అమితంగా విశ్వాసించే రామాయణ , మహాభారతాల కోసం వ్యంగ్యంగా మాట్లాడుతూ భారతీయుల మనోభావాలను గాయపరుస్తున్నారు . ఆంధ్రప్రదేశ్ , తెలంగాణా ప్రాంతాల మధ్య కుట్ర పూరితంగా సొంత లాభాపేక్షకై ప్రాంతీయ విభేదాలను కొత్తగా రెచ్చగొడుతున్నారు . మరింత పైసాచికత్వం తో భారతీయ సైనికుల ఆత్మస్టైర్యాన్ని దెబ్బతీసే విధంగాను , సైనికుల మనోభావాలను బాధించే విధంగాను శృతిమించిన ప్రేలాపనలు చేస్తున్నారు . అఖండ భారతీయులు ఆరాధ్య దైవంగా కొలిచే పరమ శివుని కోసం వ్యంగ్యంగా మాట్లాడుచున్నారు . సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి కోసం, సరస్వతి మాత కోసం, మానవ సంబంధాల కోసం తప్పుడుగా మాట్లాడు చున్నారు . యాంకర్ స్వప్న తో కలిసి ఉద్దేశ్య పూర్వకంగానే ముందుగా కుట్ర పూరితంగా సిద్దం చేసుకున్న ప్రశ్నలతో సామాజిక ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నారు.

Advertisement GKSC

అర్జివి మాటలు , చేష్టలు కారణంగా సామాజిక భద్రత కోల్పోతుంది . మత ఘర్షనలకు తావునిస్తుంది . కొన్ని ఉగ్రవాద సంస్థలతో పోల్చుతు హిందూ ధర్మ దైవాలను వక్రీకరిస్తు తప్పుగా మాట్లాడుతూ యువతకు తప్పుడు సాంకేతాలను ఇస్తున్నారు . అర్జివి అప్ లోడ్ చేస్తున్న సంఘ విద్రోహ వీడియోలను కొన్ని ఉగ్రవాద సంస్తలు ఉగ్రవాద కార్యకలాపాలకు ముడి సరుకుగా మార్చుకునే ప్రమాదం వుంది . ఈ మధ్య కాలంలో ఎక్కడ బడితే అక్కడ మత ఘర్షణలు ఎక్కువై పోతున్నాయి . అందుకు అర్జివి వంటి వారి చేష్టలే ప్రధాన కారణంగా బావించాలి . అర్జివి వంటి వారి చేష్టలకు ఆకర్షితు లవుతున్న కొంతమంది కారణంగా యుక్త వయస్సు వారు మత్తు ప్రధార్దాలకు బానిసలుగా మారి మత ఘర్షణలకు కారకులవుతున్నారు . అర్జివి ఇప్పటికే లెక్క కట్టలేని వీడియోలు అనేక యూ ట్యూబ్ వేదికల్లో అప్ లోడ్ చేసారు . అర్జివి సంఘ విద్రోహ చర్యలకు ఎక్కువ శాతం యాంకర్ స్వప్న ప్రోత్సాహం ఉంటుంది.

తక్షణమే ప్రభుత్వం సామాజిక భద్రతను గుర్తించి , శాంతి భద్రతలను కాపాడే దిశగా మా పిర్యాదుపై 153- A, 153- B , 504, 506, 150-B ఐ పి సి , 67 ఐ టి యాక్ట్ - 2000 చట్టాల ప్రకారం చర్యలు చేపట్టి శాంతి భద్రతలను కాపాడాలని , రామాయణ , మహాభారతాల పవిత్రతను రక్షించాలని , సామాజిక భద్రతను , పౌరుల స్వేచ్చ ను కాపాడాలని అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఈ సందర్బంగా మీడియా తో మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో అర్పిసి సెక్యూలర్స్ సర్వ్వశ్రీ డి వి రమణమూర్తి , పెడ్యాల కామరాజు, కాసా రాజు , సిమ్మా దుర్గారావు , దోషి నిషాంత్ , ఎమ్ డి హుస్సేన్ , ఆర్ కే చెట్టి , దుడ్డే త్రినాద్ , లంక దుర్గాప్రసాద్ , దుడ్డే సురేష్ , వర్ధనపు శరత్ కుమార్ , బర్ల ప్రసాద్ , ద్వాదశి శ్రీను , బర్ల సతీష్ , కంతి పండు, అడపా దేవుడు , కొల్లి సిమ్మన్న , బత్తుల మధుబాబు, గుడ్ల సాయి దుర్గా ప్రసాద్ , బసా సోనియా , వాడపల్లి జ్యోతిష్ , మాసా అప్పాయమ్మ , మాసా సుభద్ర , వల్లి వెంకటేష్, మోర్త ప్రభాకర్ , చల్లా సాంబశివరావు, మొగలి రాజేష్ , అల్లాడ రమేష్ , నాగురు అన్నపూర్ణ , మాసా దుర్గ , ఖండవల్లి శ్రీను , దొంగ బాలాజీ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని యున్నారు.

Advertisement
Author Image