For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

AP Politics : YSRCPపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ లపై ఫిర్యాదు

06:31 PM Apr 17, 2024 IST | Sowmya
Updated At - 06:31 PM Apr 17, 2024 IST
ap politics   ysrcpపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నందమూరి బాలకృష్ణ  నారా లోకేష్ లపై ఫిర్యాదు
Advertisement

ఎన్నికల నియమావళికి విరుధ్దంగా ముఖ్యమంత్రి జగన్ గారిపై, వైయస్సార్ సిపిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నందమూరి బాలకృష్ణ, యూట్యూబ్ ద్వారా జగన్ గారికి వ్యతిరేకంగా పాట ప్రసారం చేస్తున్న నారా లోకేష్ లపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమీషన్ లకు ఫిర్యాదు చేసిన వైయస్సార్ సిపి నేతలు. వైయస్సార్ సిపి శాసనసభ్యుడు మల్లాది విష్ణు,మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు,పార్టీ గ్రీవెన్స్ సెల్ ఛైర్మన్ నారాయణమూర్తి,లీగల్ సెల్ నేత శ్రీనివాసరెడ్డి ఫిర్యాదుతోపాటు ఆధారాలను అందచేశారు.

  1. తెలుగుదేశం పార్టీనేత,హిందూపురం ఎంఎల్ఏ నందమూరి బాలకృష్ణ ఈనెల16 వతేదీన కర్నూలులో స్వర్ణాంధ్ర సాకారయాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ గారిపై అనుచిత వ్యాఖ్యలు, తిట్లు, శాపనార్ధాలు, బూతులతో ప్రసంగించారు. ఎన్నికల నియమావళికి విరుధ్దంగా వ్యాఖ్యలు చేసినందుకు బాలకృష్ణపై చర్యలు తీసుకోవాలని కోరారు.
  2. టిడిపి జాతీయప్రధాన కార్యదర్శి నారాలోకేష్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా జగన్ గారిని ఉధ్దేశించి సైకో పోవాలి, సైకిల్ రావాలంటూ ఒక వీడియో పాటను పోస్ట్ చేశారు. ఈ పాటను కర్నూలు జిల్లాలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ సభలో ప్లే చేశారు. పైగా అది యూట్యూబ్ ఛానల్ లో టెలికాస్ట్ అవుతోంది.ఇది ఎన్నికల నియమావళికి విరుధ్దం. దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
  3. ఆంధ్రజ్యోతి దినపత్రికలో జగన్ సేవలో జవహర్ అనే శీర్షికన ఈనెల 17 వతేదన న్యూస్ ఐటమ్ ప్రచురించారు. జగన్ గారికి మధ్దతు ఇస్తున్నారంటూ ఆ విధంగా పత్రికలో అవాస్తవాలతో కూడిన కధనం ఇవ్వడం ఎన్నికల నియమావళికి విరుద్ధం కాబట్టి ఆంధ్రజ్యోతిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Advertisement GKSC
Advertisement
Author Image