తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని రాచకొండ కమిషనర్ రాచకొండ కార్యాలయంలో జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు.
01:09 PM Jun 02, 2024 IST | Sowmya
Updated At - 01:10 PM Jun 02, 2024 IST
Advertisement
ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రజల పోరాటాలు, ఆకాంక్షలకు అనుగుణంగా స్వరాష్ట్రం ఏర్పడిందని, ప్రత్యేక రాష్ట్ర పోరాటాన్ని తాను స్వయంగా చూశానని పేర్కొన్నారు. ఈ పదేళ్లలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసుశాఖలో ఎన్నో నూతన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పనతో పాటు సిబ్బంది నియామకం, శిక్షణ తరగతులు, సమర్థవంతమైన విధానాల ద్వారా నేరశాతం తగ్గిందని తెలిపారు.
పోలీసుశాఖలోని అన్ని విభాగాల అధికారులు మరియు సిబ్బంది కలిసికట్టుగా పనిచేస్తూ ఉండడం వల్లే రాష్ట్రం ప్రశాంతంగా ఉందని పేర్కొన్నారు. పోలీసుల కృషి వల్ల లోక్ సభ ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరిగాయని అభినందించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ అడ్మిన్ ఇందిర, ఎసిపిలు ఇతర అధికారులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement