For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Sasivadane : ఏప్రిల్ 19న రిలీజ్ అవుతున్న 'శశివదనే' మూవీ : హీరో రక్షిత్ అట్లూరి

09:12 PM Mar 21, 2024 IST | Sowmya
UpdateAt: 09:12 PM Mar 21, 2024 IST
sasivadane   ఏప్రిల్ 19న రిలీజ్ అవుతున్న  శశివదనే  మూవీ   హీరో రక్షిత్ అట్లూరి
Advertisement

‘పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్.స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మించారు. గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వ‌హించారు. ఏప్రిల్ 19న సినిమా రిలీజ్ అవుతుంది.

హీరో రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ... ‘‘శశివదనే చిత్రాన్ని ఏప్రిల్ 5 ని కాకుండా ఏప్రిల్ 19న విడుదల చేస్తున్నాం. ఎందుకు వాయిదా వేశామనేది మా దర్శకుడు చెప్పారు. సినిమా ఫస్ట్ కాపీ చూసుకుని కాన్ఫిడెంట్ గా ఉన్నాం. సినిమా చాలా బ్రహ్మాండంగా వచ్చింది. దర్శకుడు సాయి మోహన్ కథ చెప్పిన విధానం నాకు ముందు అర్థం కాలేదు. అప్పుడు నేను తనని నువ్వు పలాస సినిమా చూశావా అని అడిగాను. దానికి తను లేదు సార్ అన్నాడు. పలాస సినిమా చూడకుండా నేను ఈ సినిమాను ఎలా పెర్ఫామ్ చేయగలను అనుకున్నావ్ అని అడిగాను. రాత్రికి సినిమా చూసి మాట్లాడుతానని అన్నాడు. అలా జర్నీ ప్రారంభమైంది.

Advertisement

హను రాఘవపూడిగారి దగ్గర సాయి వర్క్ చేశాడు. తను కూడా హనుగారంత పెద్ద డైరెక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అబ్బాయి, అమ్మాయి మధ్య ఉండే ఎమోషన్ తో పాటు తండ్రి ఎమోషన్‌ని సాయి ముందుగా రాసుకున్నాడు. పలాస కంటే శశివదనే పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. అవుతుందని నమ్మకంగా ఉన్నాను. అలాగే డైరెక్టర్ రాసుకున్న కథను బ్రహ్మాండంగా మా సినిమాటోగ్రాఫర్ సాయికుమార్ దారి విజువలైజ్ చేసి, అద్భుతంగా చూపించారు. తను పెద్ద సినిమాటోగ్రాఫర్ అవుతాడు. శరవణన్ మంచి పాటలను ఇచ్చారు.

అలాగే అనుదీప్ గారు బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. జెడి మాస్టర్ క్యూట్ గా కొరియోగ్రఫీ చేశారు. రాఘవ అనే పాత్రలో నేను బాగా నటించటానికి కారణం శశి పాత్రలో అద్భుతంగా చేసిన కోమలిగారే. ఈ సినిమాలో నన్ను చూసినట్లు వేరే సినిమాలో కనిపించలేదు. క్లైమాక్స్ విషయానికి వస్తే.. నాది, కోమలిగారి పెర్ఫామెన్స్ చూస్తే మీరే గొప్పగా చెబుతాను. సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో ఉన్నాం. మా నిర్మాతలు తేజ, గౌరి, అభిలాష్ గారు చాలా కష్టపడ్డారు. ఏప్రిల్ 19న సినిమాను రిలీజ్ చేస్తున్నాం. అందరూ మా టీమ్‌ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

Advertisement
Tags :
Author Image