NEWS: సర్కారు దవాఖానలో "కలెక్టర్" భార్య ప్రసవం.. మంత్రి హరీశ్‌రావు అభినందనలు
11:49 AM Nov 11, 2021 IST | Sowmya
Updated At - 11:49 AM Nov 11, 2021 IST
Advertisement
భద్రాచలం కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ఏరియా ప్రభుత్వ దవాఖానలో మంగళవారం అర్ధరాత్రి జిల్లా కలెక్టర్ అనుదీప్ భార్య మాధవి పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్ వేదికగా కలెక్టర్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ దవాఖానలు అధునాతన సౌకర్యాలతో మెరుగైన సేవలు అందిస్తున్నాయని మంత్రి తెలిపారు. దీంతో రాష్ట్రంలోని ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్స్‌లోనే వైద్యం చేయించుకునేందుకు ఉత్సాంగా ముందుకొస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. అందుకు నిదర్శనం కలెక్టర్ దంపతులేనని మంత్రి ప్రశంసించారు. అలాగే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా కలెక్టర్ దంపతులకు గ్రీటింగ్స్ తెలిపారు.
Advertisement