For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Memantha Siddam : తిరుపతి జిల్లా చిన్న సింగమలలో ఆటో, టిప్పర్ డ్రైవర్లతో ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్

10:33 PM Apr 04, 2024 IST | Sowmya
Updated At - 10:33 PM Apr 04, 2024 IST
memantha siddam   తిరుపతి జిల్లా చిన్న సింగమలలో ఆటో  టిప్పర్ డ్రైవర్లతో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్
Advertisement

ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ 8వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర. ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే..: 

ఈరోజు ఇక్కడ.. ఆటోలు నడుపుకొంటూ, ట్యాక్సీలు,టిప్పర్లు నడుపుకొంటూ తమ జీవనం కొనసాగిస్తున్న పరిస్థితిలో ఉన్న అన్నదమ్ములందరికీ కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి స్వాగతం. మనమంతా కూడా ఈరోజు ఇక్కడ ఏకమై ఒకవైపున మన సమస్యలను వినేందుకు, మన తరపున మనకు ఎటువంటి సమస్యలున్నాయని చెప్పి మా తరపున చట్ట సభలో ఉండాలి, అలా ఉంటే మా సమస్యలు కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకుని పోతాం, తద్వారా గవర్నమెంట్ దగ్గర నుంచి సానుకూల స్పందన మాకు వస్తుంది అని మీరు అడిగిన రిక్వెస్ట్‌కు మొట్ట మొదటి ప్రభుత్వం అనుకుంటా.. అది మన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెబుతున్నాను.

Advertisement GKSC

మీలో నుంచి ఒకరిని చట్టసభలకు.. మీలో నుంచి కూడా ఒకరిని ఏకంగా చట్టసభలో కూర్చోబెట్టేందుకు శింగనమల నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా నిలబెడుతున్నాం. నాకు ఈ ప్రస్తావన వచ్చినప్పుడు శింగనమల నియోజకవర్గం నుంచి ఈ మాదిరిగా ఒక టిప్పర్ డ్రైవర్ ను మనం అసెంబ్లీకి నిలబెట్టే కార్యక్రమం చేస్తే బాగుంటుందని, ఒక అభ్యర్ధి ఉన్నాడు అని నా దగ్గరకు ప్రస్తావన వచ్చినప్పుడు నిజంగా నేను అనుకున్నాను.. ఆ అభ్యర్ధి ఎవరు? ఆ అభ్యర్ధికిసంబంధించిన చదువులేమిటి? అని అడిగాను. చదువు విషయానికి వచ్చే సరికే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఆ వీరాంజనేయులు అనే వ్యక్తి, ఆ మనిషి.. మన పార్టీకి కార్యకర్తగా చాలా సంవత్సరాలుగా ఉన్నాడు. కార్యకర్తగా ఉంటూనే తాను ఎంఏ చదివి, ఎంఏతోనే చదువు సరిపెట్టకుండా ఏకంగా ఎంఏ ఎకనామిక్స్, ఆ తర్వాత బీఈడీ కూడా పూర్తి చేసిన పరిస్థితిలో ఆ అభ్యర్ధి ఉన్నాడు.

అంత గొప్ప చదువులు చదివి కూడా టిప్పర్ డ్రైవర్ గా తన కాళ్ల మీద తాను నిలబడ్డారు. కారణం ఏంటంటే తాను ఉద్యోగం రావడం లేదని చెప్పి తాను బాధపడలేదు. చంద్రబాబు హయాంలో తనకు ఉద్యోగం దొరక్కపోయినా కూడా తాను బాధపడలేదు. తాను టిప్పర్ డ్రైవర్ గా అయినా సరే తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఎటువంటి ఇబ్బంది కూడా పడకుండా తన కుటుంబాన్ని పోషించడం మొదలు పెట్టాడు.అటువంటి వ్యక్తిని ఎవరైనా కూడా భుజం తట్టి శభాష్ అని చెప్పి అనాల్సింది. అటువంటి వీరాంజనేయులును, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంఏ చదివి, బీఈడీ చదివి టిప్పర్ డ్రైవర్ గా తన జీవితం కొనసాగుతున్న ఆ వీరాంజనేయులును, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఈరోజు మీ అందరి ప్రతినిధిగా నిలబెడుతున్నాం. మీ అందరి ప్రతినిధిగా, మీ అందరికీ తోడుగా ఉంటూ మీ సమస్యలను కూడా చట్టసభల్లో లేవనెత్తడానికి మీ తరఫున మీ సోదరుడిగా చట్టసభలో ఉండేందుకు నిలబెడుతున్నాను.

ఇలాంటి ఈ వ్యక్తిని ప్రతి సామాజిక వర్గం నుంచి, ప్రతి వృత్తి నుంచి వీలైతే చట్టసభలోకి తీసుకుని రాగలిగితేనే వాళ్ల సమస్యలు రెప్రజెంట్ కాబడతాయి అన్న సంగతి తెలిసి ఉన్నా కూడా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినా కూడా, 3 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా ఇలా ఈ టిప్పర్ డ్రైవర్ వృత్తి చేసుకుంటున్న వర్గానికి సంబంధించిన వ్యక్తి చట్టసభలో కూర్చుంటే డ్రైవర్లకు సంబంధించిన సమస్యలు అన్నీ ఓ కొలిక్కి తీసుకురాగలిగే అవకాశం ఉంటుంది. వాళ్లు పడుతున్న ఇబ్బందులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే కార్యక్రమం ఎఫెక్టివ్ గా చేయగలుగుతారు అని తెలిసి ఉండి కూడా అవహేళన చేస్తూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు.

టిప్పర్ డ్రైవరని బాబు అవహేళన... జగన్ ఒక టిప్పర్ డ్రైవర్ కు సీటు ఇచ్చాడు అని చంద్రబాబు అవహేళన చేస్తూ ఇలా ఇలా చూపించాడు. అంతటితో కూడా ఆగిపోకుండా టిప్పర్ డ్రైవర్ అనే సరికే కాదు.. వేలి ముద్రగాడు అని కూడా అనేశారు చంద్రబాబు. నేను అడుగుతున్నా.. ఇదే చంద్రబాబును. నేను చంద్రబాబునాయుడుగారిని.. అవునయ్యా.. జగన్ టిప్పర్ డ్రైవర్ కే సీటు ఇచ్చాడు. నువ్వు అవహేళన చేసేందుకు ఏం తప్పు చేశాడయ్యా? జగన్ అని అడుగుతున్నాను. నిజంగా నువ్వు చేయలేని పని, నువ్వు కోట్లు కోట్లు డబ్బులున్న పెత్తందార్లకు టికెట్లు ఇచ్చావు. నేను ఒక సామాన్యుడికి, ఒక పేదవాడికి పార్టీ తరపున నిలబెట్టించి టికెట్ ఇచ్చి గెలిపించే కార్యక్రమం నేను చేస్తున్నాను. నిజంగా నీకు, నాకు ఉన్న తేడా ఇదీ చంద్రబాబూ అని ఒక వైపున చెబుతూ, మరో వైపున నిజంగా ఈరోజు గర్వపడుతున్నాను. ఎందుకు తెలుసా? సొంత ఆటోలు కొనుక్కుని, ఈరోజు ట్యాక్సీలు కొనుక్కుని నడిపేవారు ఎంత మందో తెలుసా? అక్షరాలా 3,93,655 మంది.

తమ జీవితం మీద తామే కంట్రోల్ తీసుకుంటూ తమ జీవితం వేరే వాళ్ల మీద ఆధారపడకుండా.. చదువుకున్న వాళ్లే వీరంతా కూడా. కాస్తో కూస్తో పెట్టుబడి పెట్టేవాళ్లే వీళ్లంతా. వీళ్లంతా కూడా ముందుకు వచ్చి ఎవడో ఉద్యోగం ఇవ్వలేదనో, ఎవడో తోడుగా ఉండటం లేదనో భయపడకుండా తామంతట తామే సొంత ఆటో కొనుక్కుని, సొంత ట్యాక్సీ కొనుక్కుని తమ కుటుంబాలను పోషిస్తున్న వారు అక్షరాలా 3,93,655 మంది.

మొట్ట మొదటి ప్రభుత్వం.. వాళ్లు ఉన్నారు అని గమనించి, వాళ్లకు తోడుగా, అండగా ఉంటూ వాళ్లను ప్రోత్సహించాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఫిట్ నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలంటే బండికి ఇన్సూరెన్స్ ఉండాలి, చిన్న చిన్న రిపేర్లు చేయించాలి. ఈ రెండూ చేపిస్తే తప్ప ఫిట్ నెస్ సర్టిఫికెట్ రాదు. ఫిట్ నెస్ సర్టిఫికెట్ రావాలి అంటే కనీసం అంటే రూ.10 వేలు ఇన్సూరెన్స్ కోసమని, రిపేర్ల కోసం అయినా గానీ ఖర్చు పెట్టి.. ఆ రూ.10 వేలు ముందే జమ చేసి, ఖర్చు పెట్టి అన్నీ చేస్తే తప్ప ఫిట్ నెస్ సర్టిఫికెట్ వచ్చే కార్యక్రమం జరగదు.

Advertisement
Author Image