For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

#CMJAGAN : విజయవాడలో ఐప్యాక్ ప్రతినిధులతో సీఎం శ్రీ. వైయస్ జగన్

Andhrapradesh Elections 2024, AP Politics
11:59 PM May 16, 2024 IST | Sowmya
Updated At - 11:59 PM May 16, 2024 IST
 cmjagan   విజయవాడలో ఐప్యాక్ ప్రతినిధులతో సీఎం శ్రీ  వైయస్ జగన్
Advertisement

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ మాట్లాడుతూ ..

నేను ప్రామిస్ చేస్తున్నా ఏపీలో మరోసారి వైసీపీ ప్రభంజనం ఖాయం. మనమే అధికారంలోకి రాబోతున్నాం. ఈసారి చరిత్ర సృష్టించబోతున్నాం. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితం తర్వాత యావత్ దేశం మనవైపు చూస్తుంది. గతంలో కంటే ఎక్కువ అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలు గెలవబోతున్నాం. ఒకరు ఊహించిన దానికంటే మనకు ఎక్కువ సీట్లు వస్తాయి.

Advertisement GKSC

2019లో 151 అసెంబ్లీ, 22 లోక్‌సభ స్థానాలు గెలిస్తే ఈసారి 151 అసెంబ్లీ సీట్లకు పైగా గెలవబోతున్నాం. అలాగే 22కు పైగా లోక్‌సభ స్థానాలు గెలుస్తాం. తద్వారా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలకు ఈ ఐదేళ్లకు మించిన గొప్ప పాలన అందిస్తాం. వచ్చే ప్రభుత్వంలో ప్రజలకు మరింత మేలు చేద్దాం. రానున్న రోజుల్లో కూడా వైఎస్సార్‌సీపీ, ఐప్యాక్ ప్రయాణం ఇలాగే ముందుకు కొనసాగుతుంది. ఈ ఎన్నికల్లో ఏడాదిన్నరగా ఐ ప్యాక్ టీం అందించిన సేవలు వెలకట్టలేనిది. అంటూ సీఎం శ్రీ.వైయస్ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.

Advertisement
Author Image