For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Huzurabad News: బతుకు మార్చిన దళితబంధు - ట్రాక్టర్‌కు ఓనరైన కూలీ బిడ్డ.. కారు ఓనరైన డ్రైవర్‌, ఇన్నాళ్లు టైలర్‌.. ఇప్పుడు ఫ్యాన్సీ స్టోర్‌ యజమాని

12:46 PM Sep 13, 2021 IST | Sowmya
Updated At - 12:46 PM Sep 13, 2021 IST
huzurabad news  బతుకు మార్చిన దళితబంధు   ట్రాక్టర్‌కు ఓనరైన కూలీ బిడ్డ   కారు ఓనరైన డ్రైవర్‌  ఇన్నాళ్లు టైలర్‌   ఇప్పుడు ఫ్యాన్సీ స్టోర్‌ యజమాని
Advertisement

CM KCR Dalitha Bandu Scheme beneficiarys, Huzurabad News, Latest Telangana Poltical News, Huzurabad by Elections, Telugu World Now,

Huzurabad News: బతుకు మార్చిన దళితబంధు, దళితుల జీవితాల్లో ఆత్మగౌరవ రెపరెపలు, ట్రాక్టర్‌కు ఓనరైన కూలీ బిడ్డ.. కారు ఓనరైన డ్రైవర్‌, ఇన్నాళ్లు టైలర్‌.. ఇప్పుడు ఫ్యాన్సీ స్టోర్‌ యజమాని, ఆత్మగౌరవం, ఆదాయ మార్గంతో ఆనందాలు.

Advertisement GKSC

డ్రైవర్‌ ఉద్యోగంలో నెలకు ఆరువేల జీతంతో జీవితాన్ని ఈడ్చుకొచ్చిన శంకర్‌.. ఇక సొంత కారులో మెరుగైన జీవితంవైపు దూసుకుపోతానంటున్నడు! కూరగాయలమ్ముకొనే కొమురమ్మ కొడుకు రాజశేఖర్‌.. సొంత ట్రాక్టర్‌కు ఓనరయ్యాడు!

పక్షవాతంతో భర్త మంచానికి పరిమితమైతే.. ఇంటి బాధ్యతను భుజాలపై మోస్తూ పెట్రోల్‌ బంక్‌లో పనిచేస్తున్న సరిత.. తన కష్టాలు ఇక తొలగిపోతాయన్న సంబురంలో ఉన్నది. బాకీ కట్టలేదని ఫైనాన్సోళ్లు ఆటో ఎత్తుకపోయినట్టుగా.. తన కారును ఎవరో ఎత్తుక పోతరనే దిగులు ఇక రాజేందర్‌కు లేదు! టైలరింగ్‌లో నైపుణ్యం ఉన్న చంద్రకళ టైలర్‌, రెడీమేడ్‌ గార్మెంట్‌, ఫ్యాన్సీ షాపు యూనిట్‌ ప్రారంభించుకునే ఏర్పాట్లలో ఉన్నారు. సంధ్య, సుగుణ, జయ, వినోద.. అందరిదీ ఇదే స్ఫూర్తి గాథ! భవిష్యత్తుపై బెంగలేని భరోసా! ఇది ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన ధైర్యం! దళితబంధు తెచ్చిన ఆత్మగౌరవం!

కారుచీకట్లు కమ్మిన బతుకుల్లో కాంతిపుంజాలు నిండుతున్నాయి. నడుములు డొప్పలయ్యేలా రాత్రిపగలూ కష్టపడినా మూడుపూటలా తిండి కష్టమైన జీవితాలు.. కొత్త మార్గానికి మళ్లుతున్నాయి. అరిగోస పడిన చోటనే ఆత్మగౌరవంతో తలెత్తుకొని జీవించేలా ఆత్మీయ ‘బంధు’వు తలుపుకొట్టి ప్రేమగా తట్టిలేపుతున్నది. ఊరి చివరన ఎండకు ఎండి, వానకు తడిసి నీరసించిన బతుకుల్లో కొత్త జీవాలు మొలిపిస్తున్నది. దళితబంధుతో ఊహించని సంతోషాలు తమ నట్టింట నిలిచాయని లబ్ధిదారుల కండ్లల్లో కనిపిస్తున్న మెరుపులే చెప్తున్నాయి. అందుకు సాక్ష్యం.. ట్రాక్టర్‌కు ఓనరైన ఎల్కపల్లి కొమురమ్మ కుటుంబం. మరో నిదర్శనం.. కారుకు యజమాని కానున్న రొంటాల సరిత భవితవ్యం! వీరిద్దరేకాదు.. సీఎం చేతుల మీదుగా దళితబంధు మంజూరు పత్రాలు అందుకున్న దళితులు.. కొత్త జీవితం ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.

మా అమ్మ పేరు మీద కారు తీస్కుంటున్న

----------------------------------

నిన్న డ్రైవర్‌ శంకర్‌.. నేడు కారు ఓనర్‌
ఇతడి పేరు రాచపెల్లి శంకర్‌. డ్రైవర్‌ శంకర్‌గా చాలా మందికి తెలుసు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండల శాయంపేట గ్రామం. కుటుంబపోషణ కోసం చిన్నప్పుడే అటో డ్రైవర్‌గా జీవనం ప్రారంభించాడు. భార్య మౌనిక, ఇద్దరు పిల్లల. కారు డ్రైవర్‌గా చాలీచాలని జీవితంతో సంసారం నెట్టుకొస్తున్నాడు. మౌనిక కూలీ పనులు చేస్తూ భర్తకు చేదోడుగా నిలుస్తున్నది. దళితబంధు పథకం డ్రైవర్‌ శంకర్‌ను ఓనర్‌ శంకర్‌గా మార్చింది. పథకం ద్వారా వచ్చిన డబ్బుతో కారు ఆప్షన్‌ను ఎంచుకొన్నాడు. రెండురోజుల క్రితం మారుతీ ఎర్టిగా కారు శంకర్‌ చేతికి వచ్చింది. జమ్మికుంటలో ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ నివాసం వద్ద కారుకు రిబ్బన్‌ కట్‌చేసి ప్రారంభించారు. మొదటి గిరాకీగా శంకర్‌ జమ్మికుంట నుంచి యాదగిరిగుట్టకు కిరాయికి కూడా వెళ్లాడు.

కేసీఆర్‌ దయతో కారుకు ఓనరైన..
-----------------------------
ఇంటర్‌ దాకా చదివిన. చదువు మానేసి ఆటో నడిపేందుకు జీతం ఉన్న. మొన్నటి దాకా కారు నడిపిన. ఆరువేల జీతంతో బతికినం. బాధలు పడ్డం. దళిత బంధు అచ్చింది. ఎప్పుడత్తే అప్పుడు కారు తీస్కోవల్నని అనుకున్న. అనుకున్నట్టే నా పేరు ముందుగా అచ్చింది. కేసీఆర్‌ సారు చేతుల్తోటి రూ.10 లక్షలందుకున్న. కారే కావల్నని అన్నా. కారచ్చింది. ఇంటికి తెచ్చుకున్నం. నా భార్య, పిల్లలు సంబురపడుతున్నరు. దళితులను గుర్తించింది ఒక్క కేసీఆర్‌ సారే. ఇన్నేండ్లసంది ఎవలన్నా పట్టించుకున్నరా? డ్రైవర్‌గున్న నన్ను దళితబంధుతో ఓనర్ను జేసిండు. సార్‌కు రుణపడి ఉంటం.
• రాచపెల్లి శంకర్‌, దళితబంధు లబ్ధిదారుడు

----------------------

సరిత కారు ఓనరైతాంది..
ఈమె పేరు రొంటాల సరిత. హుజూరాబాద్‌ పట్టణానికి చెందిన ఈమె భర్త రవీందర్‌కు కొన్నాళ్ల క్రితం పక్షవాతం వచ్చి కాలు, చేయి పనిచేయడం లేదు. ఒక పాప, బాబు ఉన్న వీరి కుటుంబంలో సంపాదించే వ్యక్తి మంచాన పడటంతో సరిత స్థానికంగా ఉన్న ఓ పెట్రోల్‌ బంక్‌లో పనికి కుదిరింది. ఆమె పరిస్థితిని చూసిన అధికారులు సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా దళితబంధు మంజూరు పత్రాన్ని అందించారు. అధికారుల కౌన్సెలింగ్‌ తర్వాత సరిత టాక్సీ కారు కొనాలని నిర్ణయించుకొన్నది. డ్రైవర్‌ను నియమించుకొని కారు నడుపుకోవచ్చని ఆలోచించిన సరిత ఇష్టానికే అధికారులు మొగ్గు చూపారు. నాలుగైదు రోజుల్లో తనకు కారు వస్తుందని సంతోషంగా చెప్తున్నది సరిత.

కేసీఆర్‌ దయవల్లనే కారు వస్తంది..
------------------------------
మాకు ఇద్దరు పిల్లలు. నా భర్త ప్రాణం మంచిగ లేనప్పటిసంది నేను హుజూరాబాద్‌లోని పెట్రోల్‌ బంక్‌ల పనిచేస్తున్న. ఇద్దరు పిల్లలు, భర్త పోషణ రోజురోజుకూ కష్టమైతంది. కేసీఆర్‌ సారు దయతోని మాకు దళితబంధు వచ్చింది. ఇప్పుడు నాకు కారు వస్తంది. నాలుగైదు రోజులల్ల నాకు కారు వస్తది. కారు నడుపుకుంటనే పెట్రోల్‌ బంక్‌ల పని చేసుకుంట. నాలుగు పైసలు సంపాయించుకొని అందరిలెక్క ఆర్థికంగా ఎదగాలన్నదే నా ఆలోచన.
• రొంటాల సరిత, హుజూరాబాద్‌ టౌన్‌

------------------------------

కూలీ కుటుంబం.. ట్రాక్టర్‌ సంబురం
ఈ చిత్రంలో కనిపిస్తున్న తల్లీకొడుకులు ఎల్కపల్లి కొమురమ్మ, రాజశేఖర్‌. వీరిది కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం చల్లూరు. కొమురమ్మ భర్త రాజయ్య గతంలో బావులు తవ్వేందుకు కూలీకి వెళ్లేవారు. చాలా రోజులుగా ఆ పని కూడా దొరక్కపోవడంతో కొమురమ్మ కూరగాయలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నది. కుటుంబం గడవక పెద్ద కొడుకు రాజశేఖర్‌ చదువును మధ్యలోనే ఆపించి ఊరిలోనే ఓ ఆసామి వద్ద ట్రాక్టర్‌ డ్రైవర్‌గా జీతానికి పెట్టింది. దళితబంధు పథకం ఈ పేద కుటుంబ పరిస్థితిని మార్చేసింది. పథకం కింద కొమురమ్మకు రూ.10 లక్షలు రావటంతో రూ.6 లక్షలతో ట్రాక్టర్‌, రూ.3.25 లక్షలతో స్ట్రా బేలర్‌ (గడ్డి చుట్టచుట్టు యంత్రం, రూ.80తో రొటావేటర్‌ కొన్నారు. నిన్నమొన్నటి వరకు వేరొకరి ట్రాక్టర్‌పై డ్రైవర్‌గా పనిచేసిన కొడుకు ఇప్పుడు ట్రాక్టర్‌కు ఓనర్‌ కావడంతో ఆ తల్లి మురిసిపోతున్నది. సీఎం కేసీఆర్‌ తమ కుటుంబానికి బతుకు భరోసా కల్పించారని చెప్పుకొంటున్నారు.

బాధలు పోతున్నయ్‌
-------------------
సీఎం కేసీఆర్‌ కడుపు సల్లగుండ.. మా అసోంటి పేదళ్ల మీద దయసూపిండు. ఒక్కొక్కలకు పది లచ్చలు ఇచ్చుడంటే మాటలా. ఇంత మందికి సాయంజేత్తుండు. మా అసోంటోళ్లు బాగుపడాల్ననే ఇట్ల సేత్తుండు. మా ఇల్లు గడ్వక మస్తు అప్పులైనయ్‌. మా కొడుకు టాక్టర్‌ కొను.. టాక్టర్‌ కొను అనెటోడు. పైసలు లేక పాయె. ఎట్ల కొనుడు. సీఎం సారు దయతోని ఇప్పుడు మా ఇంటికి టాక్టరచ్చింది. మా కొడుకు నిమ్మలమైండు. టాక్టర్ను మంచిగ నడిపిచ్చి అప్పులు తీర్పుకుంటం. నాలుగు పైసలు ఎన్కేసుకుంటం. ఇక మా కట్టాలు తీరినట్టే.
• ఎల్కపల్లి కొమురమ్మ, చల్లూరు (వీణవంక)

బతుకుకు బాట వేసింది
---------------------
సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా దళితబంధు మంజూరు పత్రాలు అందుకున్న అందరికీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన పథకాన్ని గ్రౌం డింగ్‌ చేస్తున్నారు. వీణవంకకు చెందిన దాసారపు స్వరూప ట్రాక్టర్‌ యూనిట్‌ను ఎంచుకోగా అధికారులు గ్రౌండింగ్‌ చేశారు. హన్మకొండ జిల్లా కమలాపూర్‌కు చెందిన మాట్ల సుభాశ్‌ ఇప్పటికే సెంట్రింగ్‌ సేఠ్‌గా మారిపోయాడు. ఇదే మండలం కన్నూరుకు చెందిన కనుకం రవీందర్‌ హమాలీ పనిచేస్తుండగా అతని కొడు కు దిలీప్‌ వేరే ఆసామి వద్ద ట్రాక్టర్‌ నడుపుతున్నాడు. కొమురమ్మలాగే రవీందర్‌ కూడా తన కొడుకు కోరిక మేరకు ట్రాక్టర్‌ యూనిట్‌ను ఎం చుకోగా అధికారులు గ్రౌండింగ్‌ చేశారు. హు జూరాబాద్‌ మండలం చెల్పూరుకు చెందిన కనకం చంద్రకళ, రాజ్‌కుమార్‌ దంపతులకు టైలరింగ్‌లో నైపుణ్యం ఉన్నది. వీరు టైలర్‌, రెడీమేట్‌ గార్మెంట్‌, ఫ్యాన్సీ షాపు యూనిట్‌ను ఎంచుకున్నారు. ఇదే మండలం కనుకులగిద్దకు చెందిన కొత్తూరు రాధ, మొగిలి దంపతులు మినీ డెయిరీని ఎంచుకోగా షెడ్డు నిర్మాణ ప్ర యత్నంలో ఉన్నారు. హుజూరాబాద్‌లోని శనిగరపు సరోజన కూడా సిమెంట్‌, స్టీల్‌ దుకాణం యూనిట్‌ను ఎంచుకోగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జమ్మికుంట మండలం నగురం గ్రామానికి చెందిన చెరుకు ఎల్లమ్మ కొడుకు కోరిక మే రకు టాక్సీ కారును ఎంచుకున్నారు. జమ్మికుంటలోని బాజాల సంధ్య, జీ సుగుణ వేర్వేరుగా సూపర్‌ మార్కెట్లను ఎంచుకున్నారు. ఇల్లందకుంటకు చెందిన కొత్తూరి జయ, ఇదే మండలం మల్యాలకు చెందిన తాడెం వినోద, హన్మకొండ జిల్లా కమలాపూర్‌ మండలం శనిగరానికి చెం దిన నాంపెల్లి రాజేందర్‌ డెయిరీ ఏర్పాట్లలో ఉన్నారు.

CM KCR Dalitha Bandu Scheme, Huzurabad News, Latest Telangana Poltical News, Huzurabad by Elections,v9 news telugu,teluguworldnow.com,public openeion on dalitha bandu,

Advertisement
Author Image