For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

"కేసీఆర్" "నాగార్జునసాగర్" బహిరంగ సభ రద్దు కోసం ఎన్నికల కమీషన్ కి ఫిర్యాదు చేసిన "యుగ తులసి చైర్మన్ శ్రీ కె శివ కుమార్"

02:54 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 02:54 PM May 11, 2024 IST
 కేసీఆర్   నాగార్జునసాగర్  బహిరంగ సభ రద్దు కోసం ఎన్నికల కమీషన్ కి ఫిర్యాదు చేసిన  యుగ తులసి చైర్మన్ శ్రీ కె శివ కుమార్
Advertisement

CM KCR April 14th Public Meeting at Nagarjuna Sagar by Elections, Yuga Tulasai Foundation, TTD Member K Shivakumar, Telangana Poltical News,

కేసీఆర్ బహిరంగ సభ రద్దు కోసం ఎన్నికల కమీషన్ కి ఫిర్యాదు చేసిన యుగ తులసి చైర్మన్ శ్రీ కె శివ కుమార్, సోమవారం హైకోర్ట్ లో లంచ్ మోషన్ దాఖలు.

Advertisement GKSC

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల నేపధ్యంలో ఏప్రిల్ 14 వ తేదీన హాలియా లో సీయం కేసీఆర్ తలపెట్టిన భారీ బహిరంగ సభను ప్రజారోగ్యం దృష్ట్యా రద్దుచేయాలని రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు యుగ తులసి, గో సేన ఫౌండేషన్స్ చైర్మన్ శ్రీ కొలిశెట్టి శివ కుమార్ విజ్ఞప్తి చేసారు. ఈ మేరకు ఆయన ఎన్నికల కమీషన్ కు ఆన్ లైన్లో ఫిర్యాదు చేసారు.

కరోనా తీవ్రత దృష్ట్యా ఏప్రిల్ 30వ తేదీ వరకూ ఎటువంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో యం.యస్ నెం.69ని ఉల్లంఘిస్తూ, సాక్షాత్తూ ముఖ్యమంత్రి గారే సభ నిర్వహించడం సరికాదని, దీనివల్ల ప్రజారోగ్యం మీద తీవ్రమైన ప్రభావం పడుతుందని, అందువల్ల ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్ 14వ తేదీన జరగబోయే సీయం కేసీఆర్ బహిరంగ సభను రద్దుచేయాలని శ్రీ కె శివ కుమార్ ఎలక్షన్ కమీషన్ ని కోరారు.

ఇదే విషయం పై సోమవారం(12.04.2021) గౌరవ తెలంగాణ రాష్ట్ర హై కోర్ట్ లో లంచ్ మోషన్ దాఖలు చేయనున్నట్లు శ్రీ కె శివ కుమార్ తెలియజేసారు.

Advertisement
Author Image