For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తికరణ్ పురస్కార్ గ్రహీతలను సన్మానించిన ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు.

02:54 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 02:54 PM May 11, 2024 IST
దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తికరణ్ పురస్కార్ గ్రహీతలను సన్మానించిన ముఖ్యమంత్రి కె  చంద్ర శేఖర్ రావు
Advertisement

CM KCR Appreciated Panditha Deen Dayal Upadhyay Panchayat Sashaktikaran Puraskar National Award Winners,

తెలంగాణ రాష్ట్రంలోని ‘సంగారెడ్డి జిల్లా పరిషత్‌’ను అత్యున్నత పురస్కారంతో గౌరవించిన భారత ప్రభుత్వం

Advertisement GKSC

జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన స్థానిక సంస్థలకు, 2018-19 సంవత్సరానికి గాను , కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వశాఖ ప్రకటించిన జాతీయ అవార్డు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తికరణ్ పురస్కార్.. కు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికైన గ్రామ, మండల, జిల్లా పరిషత్ ప్రజా ప్రతినిధులను ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు శుక్రవారం ప్రగతి భవన్ లో సన్మానించారు.
వీరిలో.. కరీంనగర్ జిల్లా పర్లపల్లి గ్రామ సర్పంచ్ ఎం .భారతి , రాజన్న సిరిసిల్ల జిల్లా హరిదాస్ నగర్ గ్రామ సర్పంచి తెడ్డు అమృత, సిద్దిపేట జిల్లా మిట్టపెల్లి గ్రామ సర్పంచి వంగ లక్ష్మి , సిద్దిపేట జిల్లా మల్యాల గ్రామ సర్పంచి దరిపల్లి వజ్రవ్వ , ఆదిలాబాద్ జిల్లా రుయ్యడి గ్రామ సర్పంచి పుండ్రు పోతారెడ్డి , మహబూబ్ నగర్ జిల్లా చక్రాపూర్ గ్రామ సర్పంచ్ కే. శైలజ, పెద్దపల్లి జిల్లా సుందిల్ల గ్రామ సర్పంచి దాసరి లక్ష్మి ,రాజన్నసిరిసిల్ల జిల్లా మోహినికుంట గ్రామ సర్పంచి కల్వకుంట్ల వనజ, జగిత్యాల జిల్లా కోరుట్ల ఎంపీపీ తోట నారాయణ, పెద్దపల్లి జిల్లాల ధర్మారం ఎంపీపీ ముత్యాల కరుణ, సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్లోళ్ల మంజూశ్రీ, సంగారెడ్డి జడ్పీ సీఈవో సీ హెచ్ ఎల్లయ్య, పెద్దపల్లి డీపీవో గీత ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని ‘సంగారెడ్డి జిల్లా పరిషత్’ను భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారంతో గౌరవించింది. సంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ శ్రీమతి పట్లోళ్ల మంజుశ్రీ జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సాధించిన ప్రగతికి గానూ.. పంచాయితీ రాజ్ డిపార్ట్‌మెంట్‌లోనే అత్యున్నత పురస్కారమైన ‘దీన్ దయల్ ఉపాధ్యాయ్ సశక్తికరణ్ పురస్కార్’తో ‘సంగారెడ్డి జిల్లా పరిషత్’ను భారత ప్రభుత్వం గౌరవించింది. జిల్లా పరిషత్‌లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకున్న భారత ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా పరిషత్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. సంగారెడ్డి జిల్లా పరిషత్‌కు ‘దీన్ దయల్ ఉపాధ్యాయ్ సశక్తికరణ్ పురస్కార్’ అవార్డు రావడానికి కారణమైన జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ శ్రీమతి పట్లోళ్ల మంజుశ్రీ జైపాల్ రెడ్డిని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు పలువురు ప్రముఖుల మధ్య ప్రగతిభవన్‌లో సన్మానించారు. ‘‘మనం కాదు మాట్లాడాల్సింది.. మనం చేసే పని మాట్లాడాలి’’ అంటూ తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పరిషత్‌కు ఈ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర పథకాలన్నింటిని సక్రమంగా అమలు పరిచి, అభివృద్ధికి కారణమైన జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ శ్రీమతి పట్లోళ్ల మంజుశ్రీ జైపాల్ రెడ్డిగారిని అభినందిస్తున్నానని, ముందు ముందు మరెన్నో అవార్డులు ఈ సంగారెడ్డి జిల్లా పరిషత్ అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ సన్మాన కార్యక్రమంలో చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, పంచాయతీ రాజ్ మినిస్టర్ ఎర్రవల్లి దయాకర్, పంచాయతీ రాజ్ కమిషనర్ స్మితా సబర్వాల్, జిల్లా పరిషత్ సి.ఏ.ఓ ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా, ‘దీన్ దయల్ ఉపాధ్యాయ్ సశక్తికిరణ్ పురస్కార్’ను ఏప్రిల్ 24న ప్రధానమంత్రి నరేంద్రమోడీగారు లేదంటే వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడుగారి చేతుల మీదుగా సంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ శ్రీమతి పట్లోళ్ల మంజుశ్రీ జైపాల్ రెడ్డిగారు అందుకోనున్నారు.

Advertisement
Author Image