For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Wish U Happy Birthday CM Jagan : నిజమయిన దార్శనికుడు సీఎం జగన్

01:31 AM Dec 21, 2023 IST | Sowmya
UpdateAt: 01:31 AM Dec 21, 2023 IST
wish u happy birthday cm jagan   నిజమయిన దార్శనికుడు సీఎం జగన్
Advertisement

మానవత్వం నా మతం మాట నిలబెట్టుకోవడం నా కులం BC లంటే బ్యాక్ వార్డ్ కాస్ట్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ పిల్లలకు మనమిచ్చే నిజమయిన ఆస్థి విద్య మానిఫెస్టో నాకు గీత ఖురాన్ బైబిల్ అని చెప్పి 99 శాతం అమలు చేసిన జననేత జగన్. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి ప‌ద‌వి నుంచి దిగిపోయిన మే 30, 2019న ( జ‌గ‌న్ ప్ర‌మాణ‌స్వీకారం రోజు) ` ఖ‌జానాలో కేవ‌లం రూ.100 కోట్లే ఉన్నాయి. మరుసటి రోజు జీత‌భ‌త్యాలు పెన్ష‌న్ల‌కు రూ.8 వేల కోట్ల కావాలని , అప్పుకోసం రిజర్వ్ బ్యాంకు దగ్గరికి జగన్ పరిగెత్తాలి అని ఈనాడు ప‌త్రికే ఆ రోజు రాసింది. పైగా దిగిపోతూ 40 వేల కోట్ల పెండింగ్ బిల్లులు పెట్టాడు.

ఈ పూర్వ రంగం లో వరుసగా రెండేళ్లు కరోనా మహమ్మారి వచ్చినా సమర్ధంగా సుపరిపాలన ఇచ్చాడు సీఎం జగన్. కరోనా తో సహా జీవనం చేయాల్సి ఉంటుంది అని మొట్టమొదట చెప్పిన వ్యక్తి సీఎం జగన్. అప్పుడు బాబు కుల మీడియా ఈనాడు జ్యోతి హేళన చేసాయి. తరువాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ , ప్రధాని మోడీ ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి , జయప్రకాశ్ నారాయణ లాంటి వాళ్ళు కూడా కరోనా తో సహా జీవనం చేయాల్సి ఉంటుంది అని చెప్పారు.

Advertisement

పాలన అనుభవం లేకపోయినా .. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం లో దేశం లో 2 , 3 స్థానాల్లో ఏపీ ఉంది అని లోకల్ సర్కిల్స్ అనే ప్రఖ్యాత సంస్థ చెప్పింది అంటే దానికి జగన్ సమర్ధతకు తెలివితేటలకు నిదర్శనం. అభివృద్ధి వికేంద్రీకరణ ( 13 జిల్లాలను 26 జిల్లాలు చేయడం, విశాఖ లో పరిపాలన రాజధాని, కర్నూల్ లో హై కోర్ట్ ..) ప్రజల ముందుకు పాలన, గ్రామ స్వరాజ్యం (గ్రామ వార్డ్ సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు , విలేజ్ క్లినిక్స్ ) పిల్లలకు మనమిచ్చే నిజమయిన ఆస్థి విద్య అని భవించే జగన్ ప్రపంచం తో పోటీ పడి ఉద్యోగాలు సంపాదించే విధంగా ఇంగ్లీష్ మీడియం , ద్విభాషా పుస్తకాలూ ,CBSE సిలబస్ , బైజూస్ కంటెంట్ టోఫెల్ ట్రైనింగ్ డిజిటల్ క్లాస్ లతో విద్యా రంగాన్ని తీర్చి దిద్దుతున్నాడు. విద్యా రంగ సంస్కరణల మీద పెట్టిన ఖర్చు -69, 239 కోట్లు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లు జగన్ సుపరిపాలన ఇలా ..

అభివృద్ధి 

1)పరిశ్రమలు–పెట్టుబడులు 

బాబు హాయాములో వచ్చిన పరిశ్రమల పెట్టుబడులు కేవలం- 60 వేల కోట్లు. ఇప్పుడు జగన్ హాయాములో రెండేళ్ళు కరోనా ఉన్నా ఇప్పటికే వచ్చిన పెట్టుబడులు - 70 వేల కోట్లు.

పారిశ్రామిక వృద్ధిరేటు :

బాబు హయాంలో 3.2 శాతంతో దేశంలో 22వ స్థానంలో ఉంటే, జగన్ ప్రభుత్వంలో 12.8 శాతం వృద్ధి రేటుతో దేశంలో నే 3వ స్థానంలో నిలిచింది. ఆస్తులు అభివృద్ధి వ్యయం లో 2 వ స్థానం లో ఏపీ. సామాజిక రంగ వ్యయం (విద్య, వైద్యం, సంక్షేమం, గ్రామీణాభివృద్ధి) కేటాయింపుల్లో, ఖర్చులో 1 వ స్థానం లో ఏపీ.

-కాగ్ నవంబర్ 6 2023 

అక్టోబర్ నెలలో ఎక్కువ పారిశ్రామిక పెట్టుబడి సాధించిన రాష్ట్రాలలో ఏపీ 2వ స్థానం.

గుజరాత్ - రూ.25,685 కోట్లు,
ఆంధ్రప్రదేశ్ - రూ.19,187 కోట్లు
ఉత్తరాఖండ్ - రూ.10,150 కోట్లు
తమిళనాడు - రూ.7,750 కోట్లు
మహారాష్ట్ర - 5,511 కోట్లు

Indian tech & Infra Nov 1 2023 

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో వరసగా మూడేళ్లుగా దేశంలో నంబర్‌ వన్‌ స్ధానం. విశాఖలో నిర్వహించిన గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌లో రూ.13.42 లక్షల కోట్ల మేర ఎంవోయూలు.

బడ్జెట్ కేటాయింపుల్లో కేపిటల్ (అభివృద్ధి ) వ్యయం 

రాష్ట్రం-కేటాయింపుల్లోవ్యయం
కాగ్ లెక్కల ప్రకారం ఆగష్టు నాటికి
తెలంగాణ-49.12 శాతం
ఆంధ్రప్రదేశ్-40.79 శాతం
కేరళ-32.44 శాతం
గుజరాత్-27.24 శాతం
తమిళనాడు-22.43 శాతం
కర్ణాటక-10.42 శాతం

2) దేశంలో ఏపీలో 982 కిలోమీటర్ల సుధీర్ఘ తీర ప్రాంతముంది 

ఈ బ్లూ ఎకానమీని వాడుకుని ఏపీని అభివృద్ధి పదం లో తీసుకెళ్ళాలని భావించిన జగన్ , 20 వేల కోట్లతో 4 పోర్టులు,10 ఫిషింగ్ హార్బర్లు,6 ఫిషింగ్ పాండ్స్ ఏర్పాటు చేస్తున్నారు.

3) 18 వేల కోట్లతో నాడు నేడు క్రింద 45 వేల ప్రభుత్వ బడుల ఆధునీకరణ

4) 16 వేల కోట్లతో నాడు–నేడు కింద రాష్ట్ర ప్రభుత్వ వైద్య రంగం రూపురేఖలు మారుస్తున్నారు. ఇందులో భాగంగా రూ.8,480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు. (ఇంతకుముందు రాష్ట్రంలో కేవలం 11 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉన్నాయి )

5) 10,032 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు, 560 అర్బన్‌ హెల్త్‌ క్లినిక్‌లు ఏర్పాటు 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు. 10,778 ఆర్బీకెలు ఏర్పాటు.

6) 2 లక్షల 7 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు సీఎం జగన్ (బాబు హయాములో ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం -34 వేలే )

7) విద్యా రంగ సంస్కరణల మీద పెట్టిన ఖర్చు -69, 239 కోట్లు. వైద్య రంగం లో కేవలం సంస్కరణల మీద చేసిన చేస్తున్న మొత్తం వ్యయం -రూ.32,279 కోట్లు. అన్నదాతలకు జగన్ సాయం-1.75 లక్షల కోట్లు. వైఎస్ జగన్ ప్రభుత్వం 4 ఏళ్లలో మహిళా సంక్షేమానికి-రూ.2,10,425 కోట్లు. అక్క చెల్లెమ్మల ఖాతాలకు నేరుగా రూ.1.65 లక్షల కోట్లు బదిలీ. నగదేతర బదిలీ పథకాలతో మరో రూ.85 వేల కోట్ల మేర ప్రయోజనం. మొత్తంగా 2.50 లక్షల కోట్ల సాయం.

సంక్షేమం 

31 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. 22 లక్షల ఇల్లు కడుతున్నారు. ఇందుకోసం మొత్తంగా 2 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. తద్వారా పేదలకు దాదాపు ఒక్కొక్కరికి 10 లక్షల ఆస్థి ఇస్తున్నారు సీఎం జగన్. డీబీటీ -2.40 లక్షల కోట్లు. నాన్‌డీబీటీ ద్వారా అంటే ఇళ్ల స్థలాలు, సంపూర్ణ పోషణ లాంటి కార్యక్రమాల ద్వారా
మరో రూ.1.70 లక్షల కోట్లు. వెరసి మొత్తం రూ.4.10 లక్షల కోట్ల పైచిలుకు మేర ప్రజలకు లబ్ధి కలిగించింది.

సుపరిపాలన 

  1. వైద్యరంగంలో ఏపీ నంబర్‌ వన్‌, దేశంలోనే ఏపీ ఆస్పత్రులకు అత్యధికంగా 3,161 కాయకల్ప అవార్డులు, 2,619 ఆస్పత్రులతో రెండో స్థానంలో తమిళనాడు
    7 అంశాలను పరిగణనలోకి తీసుకుని అవార్డుల కేటాయింపు, - పార్లమెంట్‌ లో కేంద్ర ఆరోగ్య శాఖ Dec 17 2023.
  2. ఎగుమతుల్లో దూకుడు. 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో .. వాణిజ్య ఎగుమతుల్లో 4.88 శాతం వాటాతో 5వ స్థానంలో ఏపీ
  3. 100 ఏళ్ళ తరువాత సమగ్ర భూసర్వే

3) రాష్ట్రంలో పేదరికం

బాబు హయాంలో -12 శాతం. జగన్ ప్రభుత్వంలో-6 శాతం. జగన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రభుత్వ స్కూళ్లలో నాడు–నేడు, ఆర్బీకేలు, గ్రామ, వార్డు సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, వాలంటీర్‌ వ్యవస్థ, రేషన్‌ డోర్‌ డెలివరీ, సమగ్ర భూసర్వే లాంటి వాటిని ఆదర్శనంగా ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నాయి.

Advertisement
Tags :
Author Image