ఏపీ బెవరేజెస్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ సోదాలు
04:07 PM Jun 07, 2024 IST | Sowmya
Updated At - 04:07 PM Jun 07, 2024 IST
Advertisement
ఉదయం మూడు వాహనాల్లో వచ్చిన ఏపి పోలీసులు.., నానక్‌రామ్‌గూడలోని వాసుదేవరెడ్డి నివాసంలో ఉదయం నుంచి సోదాలు, జగన్ హయాంలో మద్యం దోపిడీ పర్వాన్ని ముందుండి నడిపించారని ఆరోపణలు, అధికార వైకాపాకు కరడుగట్టిన మద్దతుదారుగా పనిచేసిన వాసుదేవరెడ్డి, వైకాపాకు అనుచిత లబ్ధి కలిగించేలా భారీ ఎత్తున మద్యం సరఫరా చేశారని ఫిర్యాదులు, నూతన మద్యం విధానం పేరుతో వైకాపా నేతలకు లబ్ధి కలిగేలా పనిచేశారని ఆరోపణలు.
ఏపీలో జే-బ్రాండ్ మద్యం తీసుకురావడంలో వాసుదేవరెడ్డిది కీలకపాత్ర, డిస్టిలరీలన్నీ అనధికారికంగా వైకాపా నేతల చేతుల్లోకి వెళ్లడంలో వాసుదేవరెడ్డిది కీలకపాత్ర, జే-బ్రాండ్ మద్యం ప్రభుత్వ దుకాణాల్లో అమ్మించిన ఘనత వాసుదేవరెడ్డిదేనని ఆరోపణలు.
Advertisement