For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

ఆగస్టు 15న వరల్డ్ వైడ్ హీరో చియాన్ విక్రమ్ 'తంగలాన్' సినిమా

06:07 PM Jul 19, 2024 IST | Sowmya
Updated At - 06:07 PM Jul 19, 2024 IST
ఆగస్టు 15న వరల్డ్ వైడ్ హీరో చియాన్ విక్రమ్  తంగలాన్  సినిమా
Advertisement

చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ "తంగలాన్" రిలీజ్ డేట్ ను ఈరోజు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. "తంగలాన్" చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. "తంగలాన్" సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది.

రీసెంట్ గా రిలీజ్ చేసిన "తంగలాన్" సినిమా ట్రైలర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే 'మనకి మనకి..' లిరికల్ సాంగ్ కూడా ఛాట్ బస్టర్ అయ్యింది. రిలీజ్ చేసిన ప్రతి కంటెంట్ కు మంచి రెస్పాన్స్ రావడం "తంగలాన్" మూవీ మీద ఉన్న క్రేజ్ కు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. "తంగలాన్" ప్రేక్షకులకు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతిని కలిగించనుంది.

Advertisement GKSC

Cast : Chiyaan Vikram, Malavika Mohanan, Parvathy Thiruvothu, Pashupathi, Harikrishnan, Anbhu Durai, etc.

Technical Team :
Music - GV Prakash Kumar
Art - SS Murthy
Editing - RK Selva
Stunts - Stunner Sam
PRO - GSK Media (Suresh - Sreenivas)
Banners - Studio Green, Neelam Productions
Producer - KE Gnanavel Raja
Directed by Pa Ranjith

Advertisement
Author Image