For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Children's Day 2024 : ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో ఘనంగా చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్

09:32 PM Nov 15, 2024 IST | Sowmya
UpdateAt: 09:32 PM Nov 15, 2024 IST
children s day 2024   ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో ఘనంగా చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్
Advertisement

Film Nagar Cultural Center | Hyderabad : హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. అతిధులుగా హీరో తరుణ్, హీరోయిన్ నిత్య శెట్టి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎన్ సీసీ ప్రెసిడెంట్ కె. ఎస్. రామారావు, వైస్ ప్రెసిడెంట్ ఎస్.ఎన్. రెడ్డి, సెక్రటరీ తుమ్మల రంగారావు, జాయింట్ సెక్రటరీ కె సదాశివ రెడ్డి, కమిటీ మెంబర్స్ కాజా సూర్యనారాయణ, ఎన్ భాస్కర్ నాయుడు , ఏడిద రాజా, జె బాలరాజు, వీవీజీ కృష్ణంరాజు, సీహెచ్ వరప్రసాద్ రావు, కోగంటి భవానీ కల్చరల్ కమిటీ ఛైర్మన్ ఎ గోపాలరావు, కల్చరల్ కమిటీ అడిషనల్ ఛైర్మన్ సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కల్చరల్ మరియు స్పోర్ట్స్ కాంపిటేషన్స్ లో గెల్చిన చిన్నారులకు బహుమతులను ప్రధానం చేశారు.

ఈ సందర్భంగా ఎఫ్ఎన్ సీసీ ప్రెసిడెంట్ కె.ఎస్. రామారావు మాట్లాడుతూ - మన ఫిలింనగర్ కల్చలర్ సెంటర్ లో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఎంతోమంది చిన్నారులు ఈ రోజు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మన ఎఫ్ఎన్ సీసీలో ఎన్నో ఏళ్లుగా అనేక కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాం. పిల్లలను ఇక్కడికి తరుచూ తీసుకురావాలని పేరెంట్స్ ను కోరుతున్నా. స్పోర్ట్స్ కాంపిటేషన్స్ లో గెల్చిన పిల్లలకు నా విషెస్. ఓడినవారు గెలవాలనే స్పిరిట్ తెచ్చుకోవాలి. నెక్ట్స్ టైమ్ మరింత ఘనంగా చిల్డ్రన్స్ డే నిర్వహిస్తాం. అన్నారు.

Advertisement

అతిథిగా వచ్చిన హీరో తరుణ్ మాట్లాడుతూ - ఈ రోజు ఫిలింనగర్ కల్చలర్ సెంటర్ లో చిల్డ్రన్స్ డే ఈవెంట్ లో పాల్గొనడం ఆనందంగా ఉంది. పిల్లలకు నేను చెప్పేది ఒక్కటే. మీరు మీ లైఫ్ లో ఏది ఇష్టమో ఆ రంగంలో ముందుకు వెళ్లండి. అది స్పోర్ట్స్ అయినా చదువులు అయినా మీకు నచ్చిన విషయంలో ఎదిగేందుకు ప్రయత్నించండి. గెలుపు, ఓటమి ఏదైనా స్పోర్టివ్ గా తీసుకోండి. లైఫ్ లో ప్రతి మూవ్ మెంట్ ఆస్వాదించండి అన్నారు.

ఈ కార్యక్రమం లో డాన్స్ మాస్టర్ సాయిరాజ్ ఆధ్వర్యంలో చిన్నారులచే మాయ బజార్… నాటు నాటు నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి మరియు బిల్వ సౌండ్ లాబ్స్ నరసింహ అద్వర్యంలో పాడుతా తీయగా ఫేమ్ సాయి వేదాన్ష్, ప్రాధాన్య, రిషిల్, భరద్వాజ్, సహస్ర,యశ్వగ్నిక తమ పాటలతో అలరించారు.భీమవరం శేఖర్ రాజు గారి ఆధ్వర్యంలో రోప్ డాన్స్ విశేషం గా ఆకట్టుకుంది. శివుడి వేషధారణలో చిన్నారి దక్ష్ రామ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.ప్రముఖ నిర్మాత K. S. రామారావు గారి మనమడు, వల్లభ - సౌమ్య గారి కుమారుడు క్షాత్ర వీర్ కుదరవల్లి మొట్టమొదటి సారిగా కీర్తన ఆలపించాడు.

Advertisement
Tags :
Author Image