Gulf News : గల్ఫ్ కార్మికుల సంఘాల నాయకులతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
2024, సెప్టెంబర్ 17లోగా గల్ఫ్ కార్మికుల కోసం ఎన్ఆర్ఐ పాలసీ తో కూడిన గల్ఫ్ మరియు ఓవర్సీస్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని తెలియజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సంధర్భంగా గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక (Gulf Workers Awareness Center-GWAC) అద్యక్షులు కృష్ణ దోనికేని ముఖ్యమంత్రి గారికీ గల్ఫ్ సమస్యల గురించి విన్నవించారు.
గత కేసీఆర్ గారి ప్రభుత్వం 10 సంవత్సరాలు GWAC తరపున మరియు జేఏసీ తరపున ఎన్ని పోరాటాలు చేసిన పట్టించు కోలేదని, గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 100 రోజుల్లో గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై చొరవ చూపినందుకు ధన్యావాదాలు తెలిపారు. చరిత్రలో నిలిచిపోయేలా గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం కట్టుదిట్టమైన చట్టబద్ధమైన వ్యవస్థను ఏర్పాటు చెయ్యాలని కోరారు.
తమ వారు దుబాయి, సౌదీ లాంటి దేశాల్లో జైల్లో పడితే, లేకుంటే చనిపోయితే అతని తల్లి లేదా భార్య ఎవరికి పిర్యాదు చెయ్యాలి, అలాంటి వ్యవస్థ లేదు, అలాంటి చట్టబద్ధమైన వ్యవస్థ ఎర్పాటు చేసి ఆ తల్లులకు అండగా నిలబడాలని కోరారు. గల్ఫ్ దేశాలకు వెళ్ళే వారి వివరాలు స్థానిక పోలీస్ స్టేషన్ లో గాని, గ్రామ పంచాయితీలో గాని నమోదు చేసుకుని ఏజెంట్ మరియు కంపెనీ వివరాలు తెలుసుకొని దృవీకరించిన తర్వాతనే గల్ఫ్ దేశాలకు పంపే వ్యవస్థ ఎర్పాటు చెయ్యాలనీ కోరారు.
స్పందించిన ముఖ్యమంత్రి గారు, వారం రోజులు ట్రైనింగ్ ఇచ్చి అన్ని వివరాలు నమోదు చేసుకుని పంపే వ్యవస్థ ఎర్పాటు చేస్తామని మరియు శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో GWAC ఉపాధ్యక్షులు వంశీ గౌడ్ రత్నగారి, ఆర్మూర్ రీజియన్ అధ్యక్షులు వసంత్ రెడ్డి, JAC నాయకులు మరియు గల్ఫ్ కార్మికులు పాల్గొన్నారు.
కృష్ణ దోనికేని - అద్యక్షులు
గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక (Gulf Workers Awareness Center-GWAC)