For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Manjummel Boys : 'మంజుమ్మల్ బాయ్స్' గ్రిప్పింగ్ ట్రైలర్ విడుదల

07:40 PM Mar 31, 2024 IST | Sowmya
UpdateAt: 07:40 PM Mar 31, 2024 IST
manjummel boys    మంజుమ్మల్ బాయ్స్  గ్రిప్పింగ్ ట్రైలర్ విడుదల
Advertisement

సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలలో చిదంబరం ఎస్ పొదువల్ దర్శకత్వం వహించిన మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ 'మంజుమ్మల్ బాయ్స్' ఇండస్ట్రీ  హిట్ అయ్యింది. మలయాళంలోనే 200 కోట్లకు పైగా గ్రాస్‌తో ఈ సంవత్సరం ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. పరవ ఫిలింస్‌ పతాకంపై బాబు షాహిర్‌, సౌబిన్‌ షాహిర్‌, షాన్‌ ఆంటోని నిర్మించిన ఈ చిత్రం తమిళంలో కూడా మంచి విజయం సాధించింది.

పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు ప్రేక్షకులకు ముందు ఈ సర్వైవల్ థ్రిల్లర్‌ను తీసుకువస్తోంది. తెలుగు వెర్షన్‌ను నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పిస్తున్నారు. ఏప్రిల్ 6న తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.

Advertisement

హ్యాపీ-గో-లక్కీ యంగ్ ఫ్రెండ్స్ బ్యాచ్ తమిళనాడులోని కొడైకెనాల్‌కు డ్రీం టూర్ కి వెళ్తారు. వారు హిల్ స్టేషన్ తో పాటు కమల్ హాసన్ 'గుణ' చిత్రీకరించబడిన డెవిల్స్ కిచెన్ అని పిలువబడే గుణ కేవ్స్ ను ఎక్స్ ఫ్లోర్ చేస్తారు. దురదృష్టవశాత్తు, స్నేహితుల్లో ఒకరు గుహలోని లోతైన గుంటలలో ఒకదానిలో పడిపోతాడు, మిగతా వారు భయాందోళనలకు గురౌతారు. మిగాతా అంతా  ఆ వ్యక్తిని రక్షించే రెస్క్యూ మిషన్ గురించి.ట్రైలర్ సూచించినట్లుగా, చిత్రం కూడా హోప్,  గ్రిట్ గురించి ఉంది. ఇది నిజమైన కథ ఆధారంగా రూపొందించబడింది. ఓపెనింగ్ పార్ట్స్ బ్యాచ్ స్నేహాన్ని చూపిస్తే, చివరి సగం భావోద్వేగాలు, థ్రిల్స్‌తో నిండి ఉంటుంది. దర్శకుడు చిదంబరం సర్వైవల్ థ్రిల్లర్‌ను అద్భుతంగా తీశారు.

పర్ఫెక్ట్ కాస్టింగ్ కథనానికి అథెంటిసిటీ తీసుకొచ్చింది. ప్రొడక్షన్ డిజైన్, ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి, షైజు ఖలీద్ కొడైకెనాల్ ల్యాండ్‌స్కేప్‌లను అద్భుతంగా తీశారు. సుశిన్ శ్యామ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ డిఫరెంట్ మూడ్‌లను సెట్ చేస్తుంది. ట్రైలర్ చాలా ప్రామెసింగ్ గా ఉంటూ సినిమాపై అంచనాలు పెంచింది.  మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు వెర్షన్‌కు బ్యాకింగ్ ఇవ్వడంతో సినిమా సేఫ్ హ్యాండ్స్‌లో ఉంది. డబ్బింగ్‌లోని సూపర్‌లేటివ్ క్వాలిటీ మనకు స్ట్రెయిట్ సినిమా చూస్తున్న అనుభూతిని ఇస్తుంది. వివేక్ హర్షన్ ఎడిటర్, అజయన్ చలిసేరి ప్రొడక్షన్ డిజైనర్.

Advertisement
Tags :
Author Image