TRS Party వర్కింగ్ ప్రెసిడెంట్ KTRని కలిసిన చండూరు జెడ్పిటిసి కర్నాటి వెంకటేశం
12:27 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:27 PM May 13, 2024 IST
Advertisement
తిరిగి టిఆర్ఎస్ పార్టీ గూటికి చేరిన మునుగోడు నియోజకవర్గం చండూరు జెడ్పిటిసి కర్నాటి వెంకటేశం ఈరోజు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావును ఈరోజు హైదరాబాదులో కలిశారు.
టిఆర్ఎస్ పార్టీ నుంచి తనను బలవంతంగా బిజెపిలోకి తీసుకువెళ్లారని, అక్కడికి వెళ్లిన తర్వాత ఎంతో మనోవేదనకి గురైనట్టు కర్నాటి వెంకటేశం తెలిపారు. ఈరోజు మంత్రి కేటీఆర్ తో సమావేశం సందర్భంగా చండూరు కు సంబంధించిన కొన్ని ప్రజా సమస్యలను ఆయనకు వివరించి వీటి పరిష్కారానికి సహకరించాలని కేటీఆర్ కు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నియమావళి ముగిసిన అనంతరం చండూరులో ఉన్న పలు సమస్యలకు పరిష్కారం ఇచ్చేలా ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Advertisement
